Sri Vignana Bhairava Tantra

Rs.100
Rs.100

Sri Vignana Bhairava Tantra
INR
MANIMN2992
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

విజ్ఞానభైరవతన్త' అంటే 'చైతన్యాన్ని దాటి ఆవలకు వెళ్లేందుకు ఉన్న సాంకేతిక ప్రక్రియలు' అని మన పూర్వులచే చెప్పబడినది. -

'తన్త' అంటే సాంకేతిక 'ప్రక్రియ' లేక 'పద్దతి'.

112 ధారణలతో కూడిన 'విజ్ఞానభైరవతన్త'కు గ్రంథకర్త ఎవరో తెలియదు. ఇది 'రుద్రయామలసార'మని గ్రంథాంత శ్లోకము చెప్పుచున్నది. -

ఈ ధారణలలో ఇది అత్యన్త అనుకూలమైన 'ధారణ' అని దేనిని మీరు భావింతురో దానిని గ్రహించి 'ఆట ఆడుతున్నట్లు సరదాగా' ప్రయోగం చేయండని, 'కష్టతరమైన ప్రయత్నాలు చేయవద్దని', 'వేడుకగా చేయండని' చెప్పిన వారు 'ఓషో' మహనీయుడు.

ఓషో ఈ 'విజ్ఞానభైరవతన్త' గ్రంథాన్ని కూలంకుషంగా 'అధ్యయనం - అధ్యాపనం' చేయటంతో అది 'ది బుక్ ఆఫ్ సీక్రెట్స్' అనే బృహత్ గ్రంథంగా ఆంగ్లభాషలో రూపొందింది. ఈ గ్రంథంలో మొదటి 12 ధారణలు తెలుగులో 'ఓషో' ప్రచురణగా 272 పేజీలతో వెలువడింది.

కదిలే ఆలోచనల గుంపే మనస్సు. దాన్ని లయం చేయటం ద్వారా 'భైరవస్థితి'ని ఆనందానుభూతి పొందటమే ధారణను పట్టుకోవటమంటే. అదే అమనస్కరాజయోగము.

జీవితంలో మౌనం, నిశ్శబ్దము, నిర్మలత్వం ముఖ్యమైనవి. అవి ఉంటే వాళ్లల్లో దైవత్వముంటుంది. అదే ధారణ ఫలితము జీవించడం ఒక్కటే వాళ్లకు తెలుసు. సర్వమతాతీత భావన - 'విజ్ఞానభైరవతన్త'. భావనే భగవంతుడు.

'విజ్ఞానభైరవతన్త' అనే గ్రంథాన్ని ఆకళింపు చేసుకొనేందుకు, అందు అడుగిడుటకు సౌలభ్యంగా ఉంటుందని భావించి తెలుగులో ప్రతిపదార్థ తాత్పర్యాలను, వివరణ అందించవలసినదిగా కోరిన వెంటనే 'కీటభ్రమరణా' వ్యాఖ్యను రూపొందించినవారు మిత్రవర్యులు శ్రీ మేళ్లచెఱ్వు వేజ్కటసుబ్రహ్మణ్యశాస్త్రి గారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధారణీయులకు శుభం కలగాలని కోరుకుంటూ నమస్సులతో...

                                                                                                                                   - రా మోరా

విజ్ఞానభైరవతన్త' అంటే 'చైతన్యాన్ని దాటి ఆవలకు వెళ్లేందుకు ఉన్న సాంకేతిక ప్రక్రియలు' అని మన పూర్వులచే చెప్పబడినది. - 'తన్త' అంటే సాంకేతిక 'ప్రక్రియ' లేక 'పద్దతి'. 112 ధారణలతో కూడిన 'విజ్ఞానభైరవతన్త'కు గ్రంథకర్త ఎవరో తెలియదు. ఇది 'రుద్రయామలసార'మని గ్రంథాంత శ్లోకము చెప్పుచున్నది. - ఈ ధారణలలో ఇది అత్యన్త అనుకూలమైన 'ధారణ' అని దేనిని మీరు భావింతురో దానిని గ్రహించి 'ఆట ఆడుతున్నట్లు సరదాగా' ప్రయోగం చేయండని, 'కష్టతరమైన ప్రయత్నాలు చేయవద్దని', 'వేడుకగా చేయండని' చెప్పిన వారు 'ఓషో' మహనీయుడు. ఓషో ఈ 'విజ్ఞానభైరవతన్త' గ్రంథాన్ని కూలంకుషంగా 'అధ్యయనం - అధ్యాపనం' చేయటంతో అది 'ది బుక్ ఆఫ్ సీక్రెట్స్' అనే బృహత్ గ్రంథంగా ఆంగ్లభాషలో రూపొందింది. ఈ గ్రంథంలో మొదటి 12 ధారణలు తెలుగులో 'ఓషో' ప్రచురణగా 272 పేజీలతో వెలువడింది. కదిలే ఆలోచనల గుంపే మనస్సు. దాన్ని లయం చేయటం ద్వారా 'భైరవస్థితి'ని ఆనందానుభూతి పొందటమే ధారణను పట్టుకోవటమంటే. అదే అమనస్కరాజయోగము. జీవితంలో మౌనం, నిశ్శబ్దము, నిర్మలత్వం ముఖ్యమైనవి. అవి ఉంటే వాళ్లల్లో దైవత్వముంటుంది. అదే ధారణ ఫలితము జీవించడం ఒక్కటే వాళ్లకు తెలుసు. సర్వమతాతీత భావన - 'విజ్ఞానభైరవతన్త'. భావనే భగవంతుడు. 'విజ్ఞానభైరవతన్త' అనే గ్రంథాన్ని ఆకళింపు చేసుకొనేందుకు, అందు అడుగిడుటకు సౌలభ్యంగా ఉంటుందని భావించి తెలుగులో ప్రతిపదార్థ తాత్పర్యాలను, వివరణ అందించవలసినదిగా కోరిన వెంటనే 'కీటభ్రమరణా' వ్యాఖ్యను రూపొందించినవారు మిత్రవర్యులు శ్రీ మేళ్లచెఱ్వు వేజ్కటసుబ్రహ్మణ్యశాస్త్రి గారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధారణీయులకు శుభం కలగాలని కోరుకుంటూ నమస్సులతో...                                                                                                                                    - రా మోరా

Features

  • : Sri Vignana Bhairava Tantra
  • : Mellacheruvu Venkata Subrahmanya Sastri
  • : Ravi Mohan Rao
  • : MANIMN2992
  • : Paperback
  • : 135
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Vignana Bhairava Tantra

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam