Vilakshana P. V. Narasimha Gari Jeevita Charitra

Rs.395
Rs.395

Vilakshana P. V. Narasimha Gari Jeevita Charitra
INR
MANIMN4449
In Stock
395.0
Rs.395


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

పి.వి. జీవితం - కుటుంబం

నరసింహారావుగారి ఇంటి పేరు పాములపర్తి. ఈ ఊరు ప్రస్తుతం సిద్ధిపేట జిల్లాలోని గజ్వేల్ శాసనసభా నియోజక వర్గ పరిధిలో ఉంది. నరసింహారావు పూర్వీకులు పాములపర్తి గ్రామం నుండి హుజూరాబాద్ తాలూకా పరిధిలోని వంగరకు వెళ్ళి స్థిరపడి ఉంటారని ఒక ఊహ. తెలంగాణలో బ్రాహ్మణులతో పాటు అనేక ఇతర సామాజిక వర్గాల వారి ఇంటి పేరు వారి తొలి నివాసస్థలం లేదా ఊరుతో ముడిపడి ఉండడం సహజంగా కనబడుతుంది. తన పూర్వీకుల ఊరు పాములపర్తి పట్ల పివికి ఎంతో అభిమానం, అయినా చిత్రం, పి.వి. పాములపర్తి గ్రామానికి ఎన్నోసార్లు వెళ్ళాలనుకున్నా అది కుదరనేలేదు! పి.వి. స్వగ్రామం వంగర వంద సంవత్సరాల పూర్వం అన్ని తెలంగాణ గ్రామాల వలెనే ఒక చిన్న పల్లెటూరు. ఈ మామూలు పల్లె. గత శతాబ్ది చివరినాళ్ళల్లో యావత్ భారతదేశంలోనే చిరపరిచితమైన ఊరుగా గుర్తింపును పొందింది. ఈ ఊరి ముద్దుబిడ్డ నరసింహారావు భారత ప్రధాని కావడమే ఇందుకు కారణం.

వంగరలోని బ్రాహ్మణ (కరణం) సామాజిక వర్గానికి చెందిన సీతారామారావు, రుక్మాబాయమ్మల పుత్రుడు పి.వి.నరసింహారావు. రుక్మాబాయమ్మ తల్లిగారి ఊరు ఉమ్మడి వరంగల్లు జిల్లా నర్సంపేట దగ్గరి లక్నేపల్లి. రుక్మాబాయమ్మ ప్రసవం కోసం వంగర నుండి లక్నేపల్లిలో తల్లిగారింటికి వెళ్ళారు. అక్కడ 1921 జూన్ 28వ తేదీనాడు అంటే దుర్మతి నామ సంవత్సరం, జ్యేష్ఠ బహుళ సప్తమి, మంగళవారం రోజు, ఉత్తరాభాద్ర నక్షత్రంలో నరసింహారావు జన్మించారు. (ఆయన కన్యాలగ్న జాతకుడని వరంగల్లుకు చెందిన సుప్రసిద్ధ పత్రికా సంపాదకుడు ఎం.ఎస్. ఆచార్య ఒక వ్యాసంలో వ్రాశారు). పి.వి. ప్రధానిగా ఉన్న రోజుల్లో ఆయన రాశిని గురించి చర్చించిన జ్యోతిష్యులు చివరకు ఆయనది మీనరాశి అని తేల్చారు. మీనరాశి జాతకులు సహజంగానే సంయమనానికి, సహనానికి మారుపేరుగా ఉంటారు. మూడు సంవత్సరాల వయసులో వంగరలోని వారి జ్ఞాతి రత్నాబాయమ్మ, రంగారావులకు దత్తత వెళ్ళారు నరసింహారావు. విస్తారమైన భూవసతి కలిగిన ఆనాటి తెలంగాణ కుటుంబాలలో దత్తత సంప్రదాయం విరివిగా కనిపించేది. ఆ రోజుల్లో కొన్ని బ్రాహ్మణ (ఇందులో వైదికులు, నియోగులూ ఉన్నారు) రెడ్డి, వెలమ, సామాజిక వర్గాలకు చెందిన.......................

పి.వి. జీవితం - కుటుంబం నరసింహారావుగారి ఇంటి పేరు పాములపర్తి. ఈ ఊరు ప్రస్తుతం సిద్ధిపేట జిల్లాలోని గజ్వేల్ శాసనసభా నియోజక వర్గ పరిధిలో ఉంది. నరసింహారావు పూర్వీకులు పాములపర్తి గ్రామం నుండి హుజూరాబాద్ తాలూకా పరిధిలోని వంగరకు వెళ్ళి స్థిరపడి ఉంటారని ఒక ఊహ. తెలంగాణలో బ్రాహ్మణులతో పాటు అనేక ఇతర సామాజిక వర్గాల వారి ఇంటి పేరు వారి తొలి నివాసస్థలం లేదా ఊరుతో ముడిపడి ఉండడం సహజంగా కనబడుతుంది. తన పూర్వీకుల ఊరు పాములపర్తి పట్ల పివికి ఎంతో అభిమానం, అయినా చిత్రం, పి.వి. పాములపర్తి గ్రామానికి ఎన్నోసార్లు వెళ్ళాలనుకున్నా అది కుదరనేలేదు! పి.వి. స్వగ్రామం వంగర వంద సంవత్సరాల పూర్వం అన్ని తెలంగాణ గ్రామాల వలెనే ఒక చిన్న పల్లెటూరు. ఈ మామూలు పల్లె. గత శతాబ్ది చివరినాళ్ళల్లో యావత్ భారతదేశంలోనే చిరపరిచితమైన ఊరుగా గుర్తింపును పొందింది. ఈ ఊరి ముద్దుబిడ్డ నరసింహారావు భారత ప్రధాని కావడమే ఇందుకు కారణం. వంగరలోని బ్రాహ్మణ (కరణం) సామాజిక వర్గానికి చెందిన సీతారామారావు, రుక్మాబాయమ్మల పుత్రుడు పి.వి.నరసింహారావు. రుక్మాబాయమ్మ తల్లిగారి ఊరు ఉమ్మడి వరంగల్లు జిల్లా నర్సంపేట దగ్గరి లక్నేపల్లి. రుక్మాబాయమ్మ ప్రసవం కోసం వంగర నుండి లక్నేపల్లిలో తల్లిగారింటికి వెళ్ళారు. అక్కడ 1921 జూన్ 28వ తేదీనాడు అంటే దుర్మతి నామ సంవత్సరం, జ్యేష్ఠ బహుళ సప్తమి, మంగళవారం రోజు, ఉత్తరాభాద్ర నక్షత్రంలో నరసింహారావు జన్మించారు. (ఆయన కన్యాలగ్న జాతకుడని వరంగల్లుకు చెందిన సుప్రసిద్ధ పత్రికా సంపాదకుడు ఎం.ఎస్. ఆచార్య ఒక వ్యాసంలో వ్రాశారు). పి.వి. ప్రధానిగా ఉన్న రోజుల్లో ఆయన రాశిని గురించి చర్చించిన జ్యోతిష్యులు చివరకు ఆయనది మీనరాశి అని తేల్చారు. మీనరాశి జాతకులు సహజంగానే సంయమనానికి, సహనానికి మారుపేరుగా ఉంటారు. మూడు సంవత్సరాల వయసులో వంగరలోని వారి జ్ఞాతి రత్నాబాయమ్మ, రంగారావులకు దత్తత వెళ్ళారు నరసింహారావు. విస్తారమైన భూవసతి కలిగిన ఆనాటి తెలంగాణ కుటుంబాలలో దత్తత సంప్రదాయం విరివిగా కనిపించేది. ఆ రోజుల్లో కొన్ని బ్రాహ్మణ (ఇందులో వైదికులు, నియోగులూ ఉన్నారు) రెడ్డి, వెలమ, సామాజిక వర్గాలకు చెందిన.......................

Features

  • : Vilakshana P. V. Narasimha Gari Jeevita Charitra
  • : Dr Gummanna Gari Balasrinivas Murthy
  • : Neelkamal Publications pvt ltd
  • : MANIMN4449
  • : paparback
  • : 2022 First Print
  • : 305
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vilakshana P. V. Narasimha Gari Jeevita Charitra

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam