సాహిత్య ప్రక్రియల్లో కవితలు, కథలు, నవలలూ, నాటకాల గురించి ప్రస్తావిస్తారు గానీ సంగీతాన్ని ప్రస్తావించరు. సంగీతానికి స్వయం ప్రతి పత్తి వుండటం దీనికి కారణమై వుండవచ్చు. కానీ సాహిత్యం లేనిదే సంగీతం లేదు. సంగీతానికీ సాహిత్యానికే అవిభావన సంబంధం, శాస్త్రీయ సంగీతమంటే భక్తీ ప్రాధాన్యమే. త్యాగరాజు, పురందరదాసు, రామదాసు, శ్యామశాస్త్రి గార్ల కీర్తనలు స్వరరాగ బద్ధమై, తాళజతిగతులతో, రాగాల్లో ఇమిడే గమకాలతో పాడుకునే సాహిత్యం.
కానీ పామరజనరంజకంగా, రాగచ్చాయాల్లో, భావప్రాధాన్యంగా అనుభూతిని సంతరించుకున్నవి - లలితాగీతాలు. ఇలాంటి పాటలు రాయటానికి భాషలో పాండిత్యం అవసరంలేదు, దానిలోని లాలిత్యం తెలిస్తేచాలు. చిన్నపువ్వునో, చిగురునో, వానచినుకునో చూసి పరవశించే మనసు కావాలి. అలా ఉన్నప్పుడు, ఆ పరవశంలోనే భావాలు చిమ్ముకుని వస్తాయి. వాటంతటవే అందంగా రాగాల్లో ఒదిగిపోతాయి. లలితాగీతాలౌతాయి. నాగలక్ష్మి "వాన చినుకుల్లో" పైన చెప్పినవన్నీ పుష్కలంగా ఉన్నాయనిపించింది.
సాహిత్య ప్రక్రియల్లో కవితలు, కథలు, నవలలూ, నాటకాల గురించి ప్రస్తావిస్తారు గానీ సంగీతాన్ని ప్రస్తావించరు. సంగీతానికి స్వయం ప్రతి పత్తి వుండటం దీనికి కారణమై వుండవచ్చు. కానీ సాహిత్యం లేనిదే సంగీతం లేదు. సంగీతానికీ సాహిత్యానికే అవిభావన సంబంధం, శాస్త్రీయ సంగీతమంటే భక్తీ ప్రాధాన్యమే. త్యాగరాజు, పురందరదాసు, రామదాసు, శ్యామశాస్త్రి గార్ల కీర్తనలు స్వరరాగ బద్ధమై, తాళజతిగతులతో, రాగాల్లో ఇమిడే గమకాలతో పాడుకునే సాహిత్యం. కానీ పామరజనరంజకంగా, రాగచ్చాయాల్లో, భావప్రాధాన్యంగా అనుభూతిని సంతరించుకున్నవి - లలితాగీతాలు. ఇలాంటి పాటలు రాయటానికి భాషలో పాండిత్యం అవసరంలేదు, దానిలోని లాలిత్యం తెలిస్తేచాలు. చిన్నపువ్వునో, చిగురునో, వానచినుకునో చూసి పరవశించే మనసు కావాలి. అలా ఉన్నప్పుడు, ఆ పరవశంలోనే భావాలు చిమ్ముకుని వస్తాయి. వాటంతటవే అందంగా రాగాల్లో ఒదిగిపోతాయి. లలితాగీతాలౌతాయి. నాగలక్ష్మి "వాన చినుకుల్లో" పైన చెప్పినవన్నీ పుష్కలంగా ఉన్నాయనిపించింది.© 2017,www.logili.com All Rights Reserved.