'అమరం చదవని వానికి నేను అమరను' అని సరస్వతి దేవి వచనంగా ప్రచారంలో ఉన్న 'నామా లింగాను శాసనం' అనే నిఘంటువు సుమారు రెండు వేల సంవత్సరాలకు పైగా భారత భూమిలో ప్రచారంలో ఉన్నది. సంస్కృతం నేర్చుకునే ప్రతి విద్యార్థి అమరం వల్లెవేయడం ప్రాథమికమని భావించబడిన మహా గ్రంథం ఇది ఆయుర్వేద మహా శాస్త్రవేత్త ధన్వంతరి కూడా ఈ నిఘంటువు మీద ఆధారపడి తన ధన్వంతరి కోశమనే ఆయుర్వేద నిఘంటువును రచించాడంటే ఈ నామాలింగానుశాసనం యొక్క విశిష్టతను తెలుసుకోవచ్చు.
నామలింగానుశాసనం రచించిన అమరసింహుని పేరు మీదనే ఈ నిఘంటువు అమరకోశం అని ప్రాచుర్యం పొందింది. పదిహేను వందల సంవత్సరాల కిందటే చైనా భాషలోకి కూడా అనువాదం పొందిన నిఘంటువు ఇది. ఈ అమరకోశం తనకు పూర్వం రచించబడిన నిఘంటువుల నడుమ మహోజ్వలమై నాటికీ నేటికి ప్రకాశించే కోశరత్నం. ఈనాటికి ప్రతి సంస్కృత విద్యార్థి 'యస్య జ్ఞాన దయా సింధీ' అనే ప్రార్థన శ్లోకంతో మొదలు పెట్టి సంస్కృత అద్యనాన్నిప్రారంభిస్తున్నారు. ఈ విధంగా అమరకోశం సంస్కృత వాజ్మయంలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న విషయం యదార్థం.
అలాంటి అమరకోశాన్ని లింగాభట్టీయం అనే టీకా సర్వస్వంతో కలిపి ఉన్న గురుబాల ప్రభోదిక వ్యాఖ్యతో ప్రస్తుతం సమర్పిస్తున్నాము.
-పబ్లిషర్స్.
'అమరం చదవని వానికి నేను అమరను' అని సరస్వతి దేవి వచనంగా ప్రచారంలో ఉన్న 'నామా లింగాను శాసనం' అనే నిఘంటువు సుమారు రెండు వేల సంవత్సరాలకు పైగా భారత భూమిలో ప్రచారంలో ఉన్నది. సంస్కృతం నేర్చుకునే ప్రతి విద్యార్థి అమరం వల్లెవేయడం ప్రాథమికమని భావించబడిన మహా గ్రంథం ఇది ఆయుర్వేద మహా శాస్త్రవేత్త ధన్వంతరి కూడా ఈ నిఘంటువు మీద ఆధారపడి తన ధన్వంతరి కోశమనే ఆయుర్వేద నిఘంటువును రచించాడంటే ఈ నామాలింగానుశాసనం యొక్క విశిష్టతను తెలుసుకోవచ్చు. నామలింగానుశాసనం రచించిన అమరసింహుని పేరు మీదనే ఈ నిఘంటువు అమరకోశం అని ప్రాచుర్యం పొందింది. పదిహేను వందల సంవత్సరాల కిందటే చైనా భాషలోకి కూడా అనువాదం పొందిన నిఘంటువు ఇది. ఈ అమరకోశం తనకు పూర్వం రచించబడిన నిఘంటువుల నడుమ మహోజ్వలమై నాటికీ నేటికి ప్రకాశించే కోశరత్నం. ఈనాటికి ప్రతి సంస్కృత విద్యార్థి 'యస్య జ్ఞాన దయా సింధీ' అనే ప్రార్థన శ్లోకంతో మొదలు పెట్టి సంస్కృత అద్యనాన్నిప్రారంభిస్తున్నారు. ఈ విధంగా అమరకోశం సంస్కృత వాజ్మయంలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న విషయం యదార్థం. అలాంటి అమరకోశాన్ని లింగాభట్టీయం అనే టీకా సర్వస్వంతో కలిపి ఉన్న గురుబాల ప్రభోదిక వ్యాఖ్యతో ప్రస్తుతం సమర్పిస్తున్నాము. -పబ్లిషర్స్.
© 2017,www.logili.com All Rights Reserved.