హాస్యం తియ్యగా ఉంటుంది! వ్యంగ్యం వగరుగా ఉంటుంది. రెండూ కలిపితే అది ఉగాది పచ్చడైనా అవుతుంది.. లేదా మా బాచి కార్టూనైనా అవుతుంది. ఆయన హాస్యంలోని తీపిని మధుమేహులు కూడా ఇష్టపడతారు. ఆయన వగరు వాస్తవమైతే, ఆయన హాస్యం దానిపై నుండే షుగర్ కోటింగ్. వెరసి అది ఆయన కార్టూను. వాస్తవానికి దగ్గరగా, ప్రపంచ గమనం నుండే వస్తాయి బాచి కార్టూన్లు. కాకపోతే అని ఆర్ట్ ఫిలిమ్స్ లాగా భయపెట్టవు. హాస్యం మనల్ని బెల్లాన్ని మరిగిన చీమల్ని చేస్తుంది. కానీ రుచి చూసిన తర్వాత వాస్తవం మనల్ని ఆలోచింపచేస్తుంది. మన హృదయాల్లో పేరుకొన్న దుమ్ము దులిపి మనని నవ్వించి, కవ్వించి గిలిగింతలు పెట్టి దేబిరి మొహాల్ని చిరునవ్వుతో నింపి మనం మనుషులమన్న స్పృహ కల్పించే కార్టూన్లు బాచీవి.
హాస్యం తియ్యగా ఉంటుంది! వ్యంగ్యం వగరుగా ఉంటుంది. రెండూ కలిపితే అది ఉగాది పచ్చడైనా అవుతుంది.. లేదా మా బాచి కార్టూనైనా అవుతుంది. ఆయన హాస్యంలోని తీపిని మధుమేహులు కూడా ఇష్టపడతారు. ఆయన వగరు వాస్తవమైతే, ఆయన హాస్యం దానిపై నుండే షుగర్ కోటింగ్. వెరసి అది ఆయన కార్టూను. వాస్తవానికి దగ్గరగా, ప్రపంచ గమనం నుండే వస్తాయి బాచి కార్టూన్లు. కాకపోతే అని ఆర్ట్ ఫిలిమ్స్ లాగా భయపెట్టవు. హాస్యం మనల్ని బెల్లాన్ని మరిగిన చీమల్ని చేస్తుంది. కానీ రుచి చూసిన తర్వాత వాస్తవం మనల్ని ఆలోచింపచేస్తుంది. మన హృదయాల్లో పేరుకొన్న దుమ్ము దులిపి మనని నవ్వించి, కవ్వించి గిలిగింతలు పెట్టి దేబిరి మొహాల్ని చిరునవ్వుతో నింపి మనం మనుషులమన్న స్పృహ కల్పించే కార్టూన్లు బాచీవి.© 2017,www.logili.com All Rights Reserved.