'Face is the Index of Mind' - అని ఆంగ్లంలో ఒక నానుడి ఉంది. దీని భావం మనం తెలుగులో చెప్పుకోవాలంటే 'వదనం అంతర్గత భావాలకు దర్పణం'. అలాగే ఏ పుస్తకానికైనా ముఖచిత్రం లోపలి అంశాలకు సూచిక. అలాగే ముఖచిత్రం ద్వారా పుస్తకంలోని వివరాలను సంక్షిప్తంగా సూచించడం మా 'గౌరువాస్తు' సాంప్రదాయం. 'గౌరువాస్తు రత్నాకరం' అనే ఈ గ్రంథం వాస్తు శాస్త్ర ఉద్గ్రంథమని ముఖచిత్రం ద్వారా సూచించే ప్రయత్నం చేశాం. ప్రపంచం యావత్తుకు వాస్తుశాస్త్రాన్ని వరదానంగా అందించినది భారతదేశమే. ఆ వాస్తుశాస్త్రాన్ని విశ్వవ్యాప్తం చేసిన 'గౌరువాస్తు' తన విజయబావుటాను అనంత ఆకాశంలో ఎగురువేసిందని వాస్తుశాస్త్ర పరిచితులందరికీ సుపరిచితమే. ముఖచిత్రం పై మధ్యలోగల భూగోళం, పతాకం ఆ విషయాన్నే సూచిస్తాయి.
ఇక వాస్తుశాస్త్రం పూర్తిగా పంచభూతాలపై ఆధారపడిందని గతంలో పదేపదే చెప్పడమేకాక, పలుమార్లు రుజువుచేసింది 'గౌరువాస్తు'. అందువల్లనే ముఖచిత్రం పై పంచభూతాలకు రూపకల్పనాచేశాం. ఆపద మొక్కులవాడైన తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయానికి నాలుగువైపులా రోడ్లు ఉన్నాయి. ఈశాన్యంలో కోనేరు, పూర్తి ఈశాన్యంలో జలధారగా పాప వినాశం ఉంది. ఈ ఆలయం దిక్సూచి కి అనుగుణంగా నిర్మించారు. కాబట్టి శ్రీవారిని ముఖచిత్రంపై చూపించాము.
'Face is the Index of Mind' - అని ఆంగ్లంలో ఒక నానుడి ఉంది. దీని భావం మనం తెలుగులో చెప్పుకోవాలంటే 'వదనం అంతర్గత భావాలకు దర్పణం'. అలాగే ఏ పుస్తకానికైనా ముఖచిత్రం లోపలి అంశాలకు సూచిక. అలాగే ముఖచిత్రం ద్వారా పుస్తకంలోని వివరాలను సంక్షిప్తంగా సూచించడం మా 'గౌరువాస్తు' సాంప్రదాయం. 'గౌరువాస్తు రత్నాకరం' అనే ఈ గ్రంథం వాస్తు శాస్త్ర ఉద్గ్రంథమని ముఖచిత్రం ద్వారా సూచించే ప్రయత్నం చేశాం. ప్రపంచం యావత్తుకు వాస్తుశాస్త్రాన్ని వరదానంగా అందించినది భారతదేశమే. ఆ వాస్తుశాస్త్రాన్ని విశ్వవ్యాప్తం చేసిన 'గౌరువాస్తు' తన విజయబావుటాను అనంత ఆకాశంలో ఎగురువేసిందని వాస్తుశాస్త్ర పరిచితులందరికీ సుపరిచితమే. ముఖచిత్రం పై మధ్యలోగల భూగోళం, పతాకం ఆ విషయాన్నే సూచిస్తాయి. ఇక వాస్తుశాస్త్రం పూర్తిగా పంచభూతాలపై ఆధారపడిందని గతంలో పదేపదే చెప్పడమేకాక, పలుమార్లు రుజువుచేసింది 'గౌరువాస్తు'. అందువల్లనే ముఖచిత్రం పై పంచభూతాలకు రూపకల్పనాచేశాం. ఆపద మొక్కులవాడైన తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయానికి నాలుగువైపులా రోడ్లు ఉన్నాయి. ఈశాన్యంలో కోనేరు, పూర్తి ఈశాన్యంలో జలధారగా పాప వినాశం ఉంది. ఈ ఆలయం దిక్సూచి కి అనుగుణంగా నిర్మించారు. కాబట్టి శ్రీవారిని ముఖచిత్రంపై చూపించాము.© 2017,www.logili.com All Rights Reserved.