'షట్చక్రాలు - జ్యోతిర్వైద్యం' అనే ఈ గ్రంథంలో చక్రాలకు అనుసంధానమైన వేరు వేరు అంతర, బాహిర వ్యవస్థలను స్పష్టంగా సూచనలు చేసినారు. ఏ పనుల ద్వారా చక్రశుద్ధి జరుగుతుందనే అంశాలను సమగ్రంగా చర్చించి, ఆయా వ్యవస్థలను నిరంతరం అంతరాయం లేని విధంగా పనిచేసే మార్గాలను నిర్దేశించారు. ఔషధాలు, దానాలు, జపాదులు, హోమాలు, దర్శించుకునే దైవాలు, ఆహారాదులవంటి వాటి విషయంలో ముందు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలో సూచనలు చేశారు రచయిత్రి ఈ గ్రంథంలో. ఇది ఒక నూతన ప్రయత్నం.
షట్చక్రాల విషయంలో ఇంతవరకు కేవలం ఆధ్యాత్మిక కోణంలో చర్చించిన ధోరణి నుండి ఒక వైద్య రూపంలో గమనించి ఆయా చక్రాలను శుద్ధి చేసుకునే ప్రయత్నాలను వేరు వేరు ఉదాహరణల ద్వారా సూచించి నూతన దృక్కోణాన్ని ఆవిష్కరించిన రచయిత్రి శ్రీమతి మాలతిగారు ధన్యులు. వారి ద్వారా మరిన్ని గ్రంథాలు ఇటువంటివి రావాలని, వారి వైజ్ఞానిక భావాలు ఇంకా సమాజానికి ఉపకరించాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభం భూయాత్.
- సాగి కమలాకర శర్మ
'షట్చక్రాలు - జ్యోతిర్వైద్యం' అనే ఈ గ్రంథంలో చక్రాలకు అనుసంధానమైన వేరు వేరు అంతర, బాహిర వ్యవస్థలను స్పష్టంగా సూచనలు చేసినారు. ఏ పనుల ద్వారా చక్రశుద్ధి జరుగుతుందనే అంశాలను సమగ్రంగా చర్చించి, ఆయా వ్యవస్థలను నిరంతరం అంతరాయం లేని విధంగా పనిచేసే మార్గాలను నిర్దేశించారు. ఔషధాలు, దానాలు, జపాదులు, హోమాలు, దర్శించుకునే దైవాలు, ఆహారాదులవంటి వాటి విషయంలో ముందు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలో సూచనలు చేశారు రచయిత్రి ఈ గ్రంథంలో. ఇది ఒక నూతన ప్రయత్నం. షట్చక్రాల విషయంలో ఇంతవరకు కేవలం ఆధ్యాత్మిక కోణంలో చర్చించిన ధోరణి నుండి ఒక వైద్య రూపంలో గమనించి ఆయా చక్రాలను శుద్ధి చేసుకునే ప్రయత్నాలను వేరు వేరు ఉదాహరణల ద్వారా సూచించి నూతన దృక్కోణాన్ని ఆవిష్కరించిన రచయిత్రి శ్రీమతి మాలతిగారు ధన్యులు. వారి ద్వారా మరిన్ని గ్రంథాలు ఇటువంటివి రావాలని, వారి వైజ్ఞానిక భావాలు ఇంకా సమాజానికి ఉపకరించాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభం భూయాత్. - సాగి కమలాకర శర్మ© 2017,www.logili.com All Rights Reserved.