వేదమున విధించబడిన నిత్యశ్రౌతస్మార్తాది సకల సత్కారమనుష్టానమునకు తగిన కాలము నిర్ణయించుట జ్యోతిశ్శాస్త్రపు ముఖ్యప్రయోజనము. జాటిల గణిత సాధ్యమైన తిథివార నక్షత్ర యోగాకరనాదుల నిర్ణయము బహుప్రాచీన కాలము నుండి అట్టి గణనమునందు నిష్ణాతులైన మనపంచాంగకర్తలు చేయుచూ వచ్చుచున్నారు. కాగా కొన్ని పంచాంగములయందు గ్రహణాది ప్రత్యేక్ష గోచరములు కూడా తప్పిపోయెడి పొరపాట్లు దోర్లుచున్నవి.
ఇట్టి ప్రమాదములను పరిహరించుటకు, తగు నిర్ణయములు తీసుకొనుటకు దోహదముగా శ్రీమఠం పరాపర గురువుల కాలము నుండి పంచాంగ పండిత సదస్సులు నిర్వహించుచున్నది. ఈ సంవత్సరము కూడా ఆగస్ట్ 11 వ తారీఖు నుండి మూడు దినములు ఈ సదస్సు జరిగినది. ఆస్తికులందరూ ఈ పంచాంగమును తమ అనుష్టానములలో ఉపయోగించుకొని ఫలితములను పరిపూర్ణముగా పొందగలరు గాక యనియు, పంచాంగకర్తకు సకల శ్రేయోభివృద్ధి కలుగగలదనియు నారాయణస్మృతి పూర్వకముగా ఆశీర్వదించుచున్నాము.
వేదమున విధించబడిన నిత్యశ్రౌతస్మార్తాది సకల సత్కారమనుష్టానమునకు తగిన కాలము నిర్ణయించుట జ్యోతిశ్శాస్త్రపు ముఖ్యప్రయోజనము. జాటిల గణిత సాధ్యమైన తిథివార నక్షత్ర యోగాకరనాదుల నిర్ణయము బహుప్రాచీన కాలము నుండి అట్టి గణనమునందు నిష్ణాతులైన మనపంచాంగకర్తలు చేయుచూ వచ్చుచున్నారు. కాగా కొన్ని పంచాంగములయందు గ్రహణాది ప్రత్యేక్ష గోచరములు కూడా తప్పిపోయెడి పొరపాట్లు దోర్లుచున్నవి. ఇట్టి ప్రమాదములను పరిహరించుటకు, తగు నిర్ణయములు తీసుకొనుటకు దోహదముగా శ్రీమఠం పరాపర గురువుల కాలము నుండి పంచాంగ పండిత సదస్సులు నిర్వహించుచున్నది. ఈ సంవత్సరము కూడా ఆగస్ట్ 11 వ తారీఖు నుండి మూడు దినములు ఈ సదస్సు జరిగినది. ఆస్తికులందరూ ఈ పంచాంగమును తమ అనుష్టానములలో ఉపయోగించుకొని ఫలితములను పరిపూర్ణముగా పొందగలరు గాక యనియు, పంచాంగకర్తకు సకల శ్రేయోభివృద్ధి కలుగగలదనియు నారాయణస్మృతి పూర్వకముగా ఆశీర్వదించుచున్నాము.© 2017,www.logili.com All Rights Reserved.