ఆంధ్రప్రదేశ్ లో పరాశర పధ్ధతి పునరజ్జీవన కారకులు పండిత త్రయము.
1)టి.యన్.సి.వరదాచార్యులుగారు, 2)గణపతి కదిరప్పగారు 3)వేరే కొండప్పగారు.
ఇప్పటికి నేను పరాశర పద్ధతిలో జాతకభాగము మరియు ప్రశ్న భాగము రచించుట జరిగినది. కాని పరాశర పధ్ధతి ప్రకారం ముహూర్తభాగము లేకపోవుట వలన పరాశర పద్ధతిలో ముహూర్తములు నిర్ణయించుట దైవజ్ఞులకు కష్టముగా ఉన్నది. ఆలోపమును తొలగించుటకే ముహూర్త భాగమును రచించుచున్నాను. ముహుర్తభాగములో తారాబలము చంద్రబలము ప్రధాన పాత్ర వహించుచున్నది. ప్రాచీనకాలము నుండి వస్తున్న తారాబలంలో ఏ మాత్రం నిజము లేక పోవుటచేత, పరాశర పధ్ధతి ప్రకారం తారాబలము చంద్రబలమును రచించుచున్నాను. ప్రాచీన శాస్త్రంలో విపత్తార విపత్తును కల్గించుటలేదు. క్షేమతార క్షేమమును కల్గించుటలేదు. నైధనతార నైధనమును కల్గించుటలేదు.
ఇందులోని సత్యాసత్యములు ప్రయోగపూర్వకముగా పరిశోధన చేసిన తరువాత ప్రాచీనకాలపు తారాబలము, చంద్రబలములో నిజము లేదని గమనించి పరాశర పధ్ధతి ప్రకారం తారాబల చంద్రబలమును రచించుచున్నాను. ఇందుకు పరాశర పద్ధతియే ప్రామాణికము దీనిని ఉపయోగించుకోన్నచో దైవజ్ఞులు ప్రజలకు ఎంతో మేలు చేయగలరు. ఒక పని కోసం ఎన్నిసార్లు తిరగకుండా తారాబలము చూచుకొని ఏరోజు పని జరుగునో ఆరోజు మాత్రమే వెళ్ళుట వలన అనవసర ప్రయాస ధన వ్యయము తగ్గును. మరియు ప్రయాణములలో ప్రమాదములు, పెళ్ళిళ్ళలో ప్రమాదములు, పుణ్యక్షేత్రములకు వెళ్ళినపుడు ప్రమాదములు తప్పి పోవును.
- వేరే కొండప్ప
ఆంధ్రప్రదేశ్ లో పరాశర పధ్ధతి పునరజ్జీవన కారకులు పండిత త్రయము. 1)టి.యన్.సి.వరదాచార్యులుగారు, 2)గణపతి కదిరప్పగారు 3)వేరే కొండప్పగారు. ఇప్పటికి నేను పరాశర పద్ధతిలో జాతకభాగము మరియు ప్రశ్న భాగము రచించుట జరిగినది. కాని పరాశర పధ్ధతి ప్రకారం ముహూర్తభాగము లేకపోవుట వలన పరాశర పద్ధతిలో ముహూర్తములు నిర్ణయించుట దైవజ్ఞులకు కష్టముగా ఉన్నది. ఆలోపమును తొలగించుటకే ముహూర్త భాగమును రచించుచున్నాను. ముహుర్తభాగములో తారాబలము చంద్రబలము ప్రధాన పాత్ర వహించుచున్నది. ప్రాచీనకాలము నుండి వస్తున్న తారాబలంలో ఏ మాత్రం నిజము లేక పోవుటచేత, పరాశర పధ్ధతి ప్రకారం తారాబలము చంద్రబలమును రచించుచున్నాను. ప్రాచీన శాస్త్రంలో విపత్తార విపత్తును కల్గించుటలేదు. క్షేమతార క్షేమమును కల్గించుటలేదు. నైధనతార నైధనమును కల్గించుటలేదు. ఇందులోని సత్యాసత్యములు ప్రయోగపూర్వకముగా పరిశోధన చేసిన తరువాత ప్రాచీనకాలపు తారాబలము, చంద్రబలములో నిజము లేదని గమనించి పరాశర పధ్ధతి ప్రకారం తారాబల చంద్రబలమును రచించుచున్నాను. ఇందుకు పరాశర పద్ధతియే ప్రామాణికము దీనిని ఉపయోగించుకోన్నచో దైవజ్ఞులు ప్రజలకు ఎంతో మేలు చేయగలరు. ఒక పని కోసం ఎన్నిసార్లు తిరగకుండా తారాబలము చూచుకొని ఏరోజు పని జరుగునో ఆరోజు మాత్రమే వెళ్ళుట వలన అనవసర ప్రయాస ధన వ్యయము తగ్గును. మరియు ప్రయాణములలో ప్రమాదములు, పెళ్ళిళ్ళలో ప్రమాదములు, పుణ్యక్షేత్రములకు వెళ్ళినపుడు ప్రమాదములు తప్పి పోవును. - వేరే కొండప్ప
© 2017,www.logili.com All Rights Reserved.