ఆనాడు రాజాంగణంలో కాలసూచిక అర్ధరాత్రిని సూచిస్తున్నది. ఎంతకూ అంతు తెగని ఆలోచనలు యువరాజు అంతరంగాన్ని కలచివేస్తున్నాయి.
ప్రక్కకు తిరిగి చూసిన సిద్ధార్థునికి మగత నిద్రలో తన పేరే పలవరిస్తున్న అర్ధాంగి యశోధర కనుపించింది. ఆమె ప్రక్కలోని శిశువు రాహులుడు కాళ్ళాడిస్తూ కేరింతలు కొడ్తున్నాడు.
అనిర్వచనీయమైన ఆవేదన ఏదో ఆయన మనసంతా నిండివుంది. అది ఏమిటో!... దేనిగురించో!... యిదమిత్థంగా తెలియటం లేదు. కనుపించిన దృశ్యాలు... తనను కలవరపరచిన సంఘటనలు... పదే పదే మదిలో కదులాడుతున్నాయి. మనసును వ్యధపరుస్తున్నాయి. ఆలోచనా తరంగాలు అతని అంతరంగాన్ని కృంగదీస్తున్నాయి. ఆశ్వాసనలేని ఆలోచనలు అతలాకుతలం జేస్తున్నాయి.................
తథాగతుని కథ గౌతమబుద్ధుని జీవిత చరిత్ర Life of Goutama Buddha ఆనాడు రాజాంగణంలో కాలసూచిక అర్ధరాత్రిని సూచిస్తున్నది. ఎంతకూ అంతు తెగని ఆలోచనలు యువరాజు అంతరంగాన్ని కలచివేస్తున్నాయి. ప్రక్కకు తిరిగి చూసిన సిద్ధార్థునికి మగత నిద్రలో తన పేరే పలవరిస్తున్న అర్ధాంగి యశోధర కనుపించింది. ఆమె ప్రక్కలోని శిశువు రాహులుడు కాళ్ళాడిస్తూ కేరింతలు కొడ్తున్నాడు. అనిర్వచనీయమైన ఆవేదన ఏదో ఆయన మనసంతా నిండివుంది. అది ఏమిటో!... దేనిగురించో!... యిదమిత్థంగా తెలియటం లేదు. కనుపించిన దృశ్యాలు... తనను కలవరపరచిన సంఘటనలు... పదే పదే మదిలో కదులాడుతున్నాయి. మనసును వ్యధపరుస్తున్నాయి. ఆలోచనా తరంగాలు అతని అంతరంగాన్ని కృంగదీస్తున్నాయి. ఆశ్వాసనలేని ఆలోచనలు అతలాకుతలం జేస్తున్నాయి.................© 2017,www.logili.com All Rights Reserved.