అష్టాదశ శక్తిపీఠాల ఆవిర్భావం వాటి నేపథ్యం గురించి శివ మహాపురాణ౦లో సవివరంగా చెప్పబడింది. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు తొమ్మిదిమంది ప్రజాపతులను సృష్టించాడు. వీరిలో ఒకడు దక్ష ప్రజాపతి. ఇతనికి ఐదుగురు పుత్రులు, యాభైమంది పుత్రికలు వారిలో సతీదేవి (దక్షాయని) జేష్ఠ పుత్రిక.
ఈమెను పరమశివుడు దక్షుని అభిమతాన్ని తిరస్కరించి వివాహం చేసుకున్నాడు. ఒకసారి దక్షుడు మహాయజ్ఞాన్ని ప్రారంభించి దేవతలందరినీ ఆహ్వానించాడు. యజ్ఞం ప్రారంభించడానికిముందు దక్షుడు యాగశాలకు వచ్చినప్పుడు శివుడు తప్ప దేవతలందరూ లేచి స్వాగతం పలికారు.
కొందరు 108 శక్తి పీఠాలన్నారు. 'శివచరిత్ర' ననుసరించి 52 శక్తి పీఠాలే కాక 26 ఉపమహా పీఠాలున్నాయి. బెంగాలులో 'నిశుద్ధ సిద్ధాంతపంకజ' పురాణంలో కూడా 52 శక్తిపీఠాలు పేర్కొనబడినాయి. కొన్నిచోట్ల 51 శక్తిపీఠాలు పేర్కొనబడ్డాయి.
ఏదిఏమైనా ఇలా శక్తిపీఠాలు ఉన్నప్పటికీ అష్టాదశ శక్తిపీఠాలు అన్నిటికన్నా మహిమాన్వితమైనవి అన్న ఖ్యాతి లోకంలో నిలిచిపోయింది. మన జీవితకాలంలో కనీసం ఒకసారైనా శక్తి పీఠాల సందర్శన చేస్తే ఐహికాముష్మిక ఫలాలు లభిస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు.
అష్టాదశ శక్తిపీఠాల ఆవిర్భావం వాటి నేపథ్యం గురించి శివ మహాపురాణ౦లో సవివరంగా చెప్పబడింది. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు తొమ్మిదిమంది ప్రజాపతులను సృష్టించాడు. వీరిలో ఒకడు దక్ష ప్రజాపతి. ఇతనికి ఐదుగురు పుత్రులు, యాభైమంది పుత్రికలు వారిలో సతీదేవి (దక్షాయని) జేష్ఠ పుత్రిక. ఈమెను పరమశివుడు దక్షుని అభిమతాన్ని తిరస్కరించి వివాహం చేసుకున్నాడు. ఒకసారి దక్షుడు మహాయజ్ఞాన్ని ప్రారంభించి దేవతలందరినీ ఆహ్వానించాడు. యజ్ఞం ప్రారంభించడానికిముందు దక్షుడు యాగశాలకు వచ్చినప్పుడు శివుడు తప్ప దేవతలందరూ లేచి స్వాగతం పలికారు. కొందరు 108 శక్తి పీఠాలన్నారు. 'శివచరిత్ర' ననుసరించి 52 శక్తి పీఠాలే కాక 26 ఉపమహా పీఠాలున్నాయి. బెంగాలులో 'నిశుద్ధ సిద్ధాంతపంకజ' పురాణంలో కూడా 52 శక్తిపీఠాలు పేర్కొనబడినాయి. కొన్నిచోట్ల 51 శక్తిపీఠాలు పేర్కొనబడ్డాయి. ఏదిఏమైనా ఇలా శక్తిపీఠాలు ఉన్నప్పటికీ అష్టాదశ శక్తిపీఠాలు అన్నిటికన్నా మహిమాన్వితమైనవి అన్న ఖ్యాతి లోకంలో నిలిచిపోయింది. మన జీవితకాలంలో కనీసం ఒకసారైనా శక్తి పీఠాల సందర్శన చేస్తే ఐహికాముష్మిక ఫలాలు లభిస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు.© 2017,www.logili.com All Rights Reserved.