పంచాంగం శ్రౌతస్మార్తాది సకల సత్కర్మానుష్టానములకు ఆధారభూతమైనది. జటిల గణిత సాధ్యమైన పంచాంగ గణనము బహుప్రాచీన కాలము నుండి పంచాంగ కర్తలచే వారివారి సంప్రదాయమును అనుసరించి చేయబడుచున్నది. కాగా కొన్ని పంచాంగములందు గ్రహణాది ప్రత్యక్ష గోచరములు కూడా తప్పిపోయెడి ప్రమాదమేర్పడుట మనం చూచుచున్నాము.
ఇట్టి విషయములపై శ్రీ మఠం పరాపర గురువుల కాలం నుండి పంచాంగ పండిత సదస్సును నిర్వహించి తగు నిర్ణయములు తీసుకొనుటకు దోహదము చేయుచూ వచ్చుచున్నది.
ఈ సంవత్సరం కూడా చాతుర్మాస్యములలో అట్టి జ్యోతిష్య పంచాంగ పండిత సదస్సును శ్రీ మఠం యందలి నిర్వహించ బడినది.
తెలంగాణ నల్గొండ జిల్లా ఆలేరు గ్రామవాస్తవ్యులు శ్రీ దైవజ్ఞ సుబ్రహ్మణ్య సిద్దాంతి గారు ప్రతి సంవత్సరము వెలువరించుచూ వచ్చుచున్న "కాలనిర్ణయ పంచాంగం" రాబోవు మన్మథ నామ సంవత్సరమునకు కూడా వెలువరింపనున్నారని, అందు పండుగల యొక్క మౌడ్య, పుష్కర, సంక్రమణ, గ్రహసంచార, గ్రహణముల నిర్నయములన్ని శ్రీ మఠమున జరిగిన పై జ్యోతిశాస్త్ర సదస్సు నిర్ణయములను అనుసరించి సశాస్త్రీయముగా చేసినారని తెలుసుకుని ఎంతయో సంతసించినాము.
చాంద్రమానులందరూ తమ తమ నిత్యకర్మలయందు ఈ 'కాలనిర్ణయ పంచాంగము'ను వినియోగించుకుని కర్మానుష్టాన ఫలితమును పరిపూర్ణముగా పొందగలరు అని నారాయణస్మృతి పూర్వకముగా ఆశీర్వదించుచున్నాము.
- ఇతి నారాయణస్మృతి
పంచాంగం శ్రౌతస్మార్తాది సకల సత్కర్మానుష్టానములకు ఆధారభూతమైనది. జటిల గణిత సాధ్యమైన పంచాంగ గణనము బహుప్రాచీన కాలము నుండి పంచాంగ కర్తలచే వారివారి సంప్రదాయమును అనుసరించి చేయబడుచున్నది. కాగా కొన్ని పంచాంగములందు గ్రహణాది ప్రత్యక్ష గోచరములు కూడా తప్పిపోయెడి ప్రమాదమేర్పడుట మనం చూచుచున్నాము. ఇట్టి విషయములపై శ్రీ మఠం పరాపర గురువుల కాలం నుండి పంచాంగ పండిత సదస్సును నిర్వహించి తగు నిర్ణయములు తీసుకొనుటకు దోహదము చేయుచూ వచ్చుచున్నది. ఈ సంవత్సరం కూడా చాతుర్మాస్యములలో అట్టి జ్యోతిష్య పంచాంగ పండిత సదస్సును శ్రీ మఠం యందలి నిర్వహించ బడినది. తెలంగాణ నల్గొండ జిల్లా ఆలేరు గ్రామవాస్తవ్యులు శ్రీ దైవజ్ఞ సుబ్రహ్మణ్య సిద్దాంతి గారు ప్రతి సంవత్సరము వెలువరించుచూ వచ్చుచున్న "కాలనిర్ణయ పంచాంగం" రాబోవు మన్మథ నామ సంవత్సరమునకు కూడా వెలువరింపనున్నారని, అందు పండుగల యొక్క మౌడ్య, పుష్కర, సంక్రమణ, గ్రహసంచార, గ్రహణముల నిర్నయములన్ని శ్రీ మఠమున జరిగిన పై జ్యోతిశాస్త్ర సదస్సు నిర్ణయములను అనుసరించి సశాస్త్రీయముగా చేసినారని తెలుసుకుని ఎంతయో సంతసించినాము. చాంద్రమానులందరూ తమ తమ నిత్యకర్మలయందు ఈ 'కాలనిర్ణయ పంచాంగము'ను వినియోగించుకుని కర్మానుష్టాన ఫలితమును పరిపూర్ణముగా పొందగలరు అని నారాయణస్మృతి పూర్వకముగా ఆశీర్వదించుచున్నాము. - ఇతి నారాయణస్మృతిPanchangM
© 2017,www.logili.com All Rights Reserved.