"చిరస్మరణ" నవల రచనకు సంబంధించి ఈ సందర్భంలో ఒకటి రెండు మాటలు వ్రాయడం అప్రస్తుత మనిపించదు. భారతదేశ శ్రమజీవులు కొనసాగిస్తూ వచ్చిన వర్గ సమారా ఇతిహాసం సుదీర్ఘమయింది. దాని గగుర్పాటు కలిగించే ఒక అధ్యాయం కేరళలోని కయ్యూరు రైతుల పోరాటం. అదే 'చిరస్మరణ' రచనకు ప్రేరణ. ఆ ఇతివృత్తం నా మనస్సును తాకినది, తట్టినది నా విద్యార్థి దశలో.
"చిరస్మరణ" లోని అనేక పాత్రలు వాస్తవ జీవితం నుంచే నవల పుటలకు నడిచి వచ్చాయి. అయితే అవి ఇక్కడ పాత్ర నిర్వహణ కోసం రంగ ప్రసాదన వేష భూషణాలను నిరాకరించలేదు. మాస్టర్ పాత్రకు మాధవన్ - మాధవేట్టన్ - స్ఫూర్తి, ప్రభుపాత్రకు కామత్. మరికొన్ని పాత్రల విషయంలో జనాభా లెక్కలు చెప్పమొగం వేయవచ్చు. కాని అలాంటివారు ఉండి ఉండరు - అని ఖరాఖండిగా చెప్పడం కష్టం. "చిరస్మరణ" జయప్రియతను సంపాదించాకపోయినా, అల్ప సంఖ్యాకులైన పాఠకులకు చాలా ఇష్టమయిందనితోస్తుంది.
- తిరుమల రామచంద్ర
"చిరస్మరణ" నవల రచనకు సంబంధించి ఈ సందర్భంలో ఒకటి రెండు మాటలు వ్రాయడం అప్రస్తుత మనిపించదు. భారతదేశ శ్రమజీవులు కొనసాగిస్తూ వచ్చిన వర్గ సమారా ఇతిహాసం సుదీర్ఘమయింది. దాని గగుర్పాటు కలిగించే ఒక అధ్యాయం కేరళలోని కయ్యూరు రైతుల పోరాటం. అదే 'చిరస్మరణ' రచనకు ప్రేరణ. ఆ ఇతివృత్తం నా మనస్సును తాకినది, తట్టినది నా విద్యార్థి దశలో. "చిరస్మరణ" లోని అనేక పాత్రలు వాస్తవ జీవితం నుంచే నవల పుటలకు నడిచి వచ్చాయి. అయితే అవి ఇక్కడ పాత్ర నిర్వహణ కోసం రంగ ప్రసాదన వేష భూషణాలను నిరాకరించలేదు. మాస్టర్ పాత్రకు మాధవన్ - మాధవేట్టన్ - స్ఫూర్తి, ప్రభుపాత్రకు కామత్. మరికొన్ని పాత్రల విషయంలో జనాభా లెక్కలు చెప్పమొగం వేయవచ్చు. కాని అలాంటివారు ఉండి ఉండరు - అని ఖరాఖండిగా చెప్పడం కష్టం. "చిరస్మరణ" జయప్రియతను సంపాదించాకపోయినా, అల్ప సంఖ్యాకులైన పాఠకులకు చాలా ఇష్టమయిందనితోస్తుంది. - తిరుమల రామచంద్ర© 2017,www.logili.com All Rights Reserved.