బ్రహ్మ శ్రీ గొల్లపూడి సుబ్రహ్మణ్య శర్మ గారిచే గాయత్రీ తత్వరహస్య మానెడు గ్రంధము రచింపబడినది. ఈ గ్రంధమును నేను సమగ్రముగా చూచితిని. దీనిలో ప్రణవ విషయము, గాయత్రీ విషయము సప్రమాణముగా నిరూపించబడినది. ఉపనిషత్తులు భారత , రామాయణము మొదలగు శ్రుతిస్మృతులు పై విషయముల యొక్క నిరూపణములో ప్రమాణములుగా నిరూపింపబడినవి. ఉపనిషత్తుల యొక్క అనువాదము గూడ గొంతవరకు చేయబడియున్నది. ఈ గ్రంధము గాయత్ర్యు పాసకులకు, ప్రాణపోపాసకుల కత్యంతోపయోగకర మైనదని నతాత్పర్యము, ప్రణవస్వరూప నిరూపణము అనేక విధములుగా నిరూపింపబడియున్నది. అద్వైత సిద్ధాంతమున కేవిధమైన భంగము లేకయే ప్రణవ నిరూపణము చేయబడినది. జ్ఞానదేవతు కైవల్యమనెడు సిద్ధాంతమునకు ఉపాసన యెటుల అంతరంగ సాధనమో ఆ విషయము చక్కగా నిరూపింపబడినది . సంధ్యాంగముగాచేయు గాయత్రీ జపము నిర్గుణస్వరూప ధ్యానముగా నిరూపింపబడినది.