కంచి కామకోటి పీఠానికి 68 వ పీఠాధిపతి. 1907 నుండి 1994 వరకు పీఠాధిపత్యం వహించారు. పరమాచార్య, మహాస్వామి, మహా పెరియవర్ గా ప్రసిద్ధులు. ఇటీవలికాలంలో భారతదేశంలో అతి గొప్ప సాధుపురుషుడుగా ప్రఖ్యాతి గడించి సర్వజన గౌరవాన్ని పొందిన మహావ్యక్తి. సన్యాసాన్ని అతి నియమనిష్టలతో పాటించి, వేదాలను, హిందూ ధర్మాన్ని పరిరక్షించడమే ఏకైక ధ్యేయంగా కృషిచేసిన పరమాచార్య స్వామి బహుశాస్త్ర కోవిదులు. ఆయన అసంఖ్యాక ప్రసంగాలు చేశారు. ఇవి సుమారు 6 వేల పుటల్లో ఆంగ్లంలోకి అనువదితమై ప్రచురితమయ్యాయి. వైదిక ధర్మం గురించి, హిందువుల ఆచార వ్యవహారాల గురించి, సమాజ సేవ గురించి, మన కర్తవ్యాల గురించి ఆయన చెప్పిన వాక్కులు ఆదరణీయాలు, అనుసరణీయాలు.
కంచి కామకోటి పీఠానికి 68 వ పీఠాధిపతి. 1907 నుండి 1994 వరకు పీఠాధిపత్యం వహించారు. పరమాచార్య, మహాస్వామి, మహా పెరియవర్ గా ప్రసిద్ధులు. ఇటీవలికాలంలో భారతదేశంలో అతి గొప్ప సాధుపురుషుడుగా ప్రఖ్యాతి గడించి సర్వజన గౌరవాన్ని పొందిన మహావ్యక్తి. సన్యాసాన్ని అతి నియమనిష్టలతో పాటించి, వేదాలను, హిందూ ధర్మాన్ని పరిరక్షించడమే ఏకైక ధ్యేయంగా కృషిచేసిన పరమాచార్య స్వామి బహుశాస్త్ర కోవిదులు. ఆయన అసంఖ్యాక ప్రసంగాలు చేశారు. ఇవి సుమారు 6 వేల పుటల్లో ఆంగ్లంలోకి అనువదితమై ప్రచురితమయ్యాయి. వైదిక ధర్మం గురించి, హిందువుల ఆచార వ్యవహారాల గురించి, సమాజ సేవ గురించి, మన కర్తవ్యాల గురించి ఆయన చెప్పిన వాక్కులు ఆదరణీయాలు, అనుసరణీయాలు.© 2017,www.logili.com All Rights Reserved.