కలియుగ దైవం శ్రీనివాసుడు. ప్రపంచంలో అత్యధిక రాబడి కలిగిన దేవాలయాల్లో తిరుమల తిరుపతి ఒకటి. ప్రపంచ వ్యాప్తముగా అనేక భక్తులను ఆనాటి నుండి ఈనాటి వరకు ఆకర్షిస్తూ, అనుగ్రహిస్తూ, నిత్యనూతనముగా వెలుగొందుతున్న అపురూపమైన దేవాలయం తిరుమలి. అటువంటి దేవాలయం యొక్క విశేషములు, తెలియని విషయములు, పూర్వకాలము నుండి జరుగుచున్న సాంప్రదాయములు, ఉత్సవములు గురించి, పూజలు, సేవలు, ప్రత్యేక కార్యక్రమాలు భక్తులందరికీ తెలియ చేయాలని ఒక సత్ సంకల్పంతో తేలికైన తెలుగు భాషలో అందించిన పుస్తకరాజమే ఈ 'శ్రీనివాస నిధి'.
శ్రీనివాస నిధి పుస్తకములో అనేక అంశములు పొందుపరచబడి ఉన్నవి. దీనిలో అంశములు కొన్ని మనకు తెలియవచ్చును, తెలియకపోవచ్చును. వీటి అన్నింటిని ఒక సమగ్ర రూపములో భక్తి తత్వానికి ఒక ప్రతీకగా శ్రీనివాస అనుగ్రహాని పాత్రులు కావడానికి అందచేయబడినది. ఒక క్షేత్రముపై ఇన్ని అంశములలో ఒక పుస్తకమును ఈ విధముగా విడుదల చేయడము ఒక సాహసమే. ఈ ప్రయత్నమునకు నాకు వెన్ను దన్నుగా నిలిచిన గొల్లపూడి వీరాస్వామి సన్ వారికి శ్రీనివాసుని అపార కృపా కటాక్షములు కలగాలి.
కలియుగ దైవం శ్రీనివాసుడు. ప్రపంచంలో అత్యధిక రాబడి కలిగిన దేవాలయాల్లో తిరుమల తిరుపతి ఒకటి. ప్రపంచ వ్యాప్తముగా అనేక భక్తులను ఆనాటి నుండి ఈనాటి వరకు ఆకర్షిస్తూ, అనుగ్రహిస్తూ, నిత్యనూతనముగా వెలుగొందుతున్న అపురూపమైన దేవాలయం తిరుమలి. అటువంటి దేవాలయం యొక్క విశేషములు, తెలియని విషయములు, పూర్వకాలము నుండి జరుగుచున్న సాంప్రదాయములు, ఉత్సవములు గురించి, పూజలు, సేవలు, ప్రత్యేక కార్యక్రమాలు భక్తులందరికీ తెలియ చేయాలని ఒక సత్ సంకల్పంతో తేలికైన తెలుగు భాషలో అందించిన పుస్తకరాజమే ఈ 'శ్రీనివాస నిధి'. శ్రీనివాస నిధి పుస్తకములో అనేక అంశములు పొందుపరచబడి ఉన్నవి. దీనిలో అంశములు కొన్ని మనకు తెలియవచ్చును, తెలియకపోవచ్చును. వీటి అన్నింటిని ఒక సమగ్ర రూపములో భక్తి తత్వానికి ఒక ప్రతీకగా శ్రీనివాస అనుగ్రహాని పాత్రులు కావడానికి అందచేయబడినది. ఒక క్షేత్రముపై ఇన్ని అంశములలో ఒక పుస్తకమును ఈ విధముగా విడుదల చేయడము ఒక సాహసమే. ఈ ప్రయత్నమునకు నాకు వెన్ను దన్నుగా నిలిచిన గొల్లపూడి వీరాస్వామి సన్ వారికి శ్రీనివాసుని అపార కృపా కటాక్షములు కలగాలి.© 2017,www.logili.com All Rights Reserved.