'పారిజాతాపహరణము' ముక్కు తిమ్మన్నగారు వ్రాసిన రసవత్క్రుతి. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములో అష్టదిగ్గజములను కవులు ఉండేవారని అందురు. ఇంకను చాలామంది కవులు కృష్ణరాయల ఆశ్రయమును పొంది ఆయన యుగము స్వర్ణయుగమందురు గదా! అందులో రాయలవారు ప్రతి సంవత్సరము చేయు వసంతోత్సవమున ఎందరో ప్రతిభావంతులైన కవులు వచ్చేవారని గ్రంథ సాక్ష్యమున్నది. అట్టి పరిస్థితిలో రాయలు కృతి గొన్నదీ పారిజాతపహరనమును, పెద్దన గారి మనుచరిత్రను మాత్రమే.
తిమ్మన ఈ గ్రంథము కృష్ణదేవరాయల వారికి అంకితమీయగా - రాయలు సంతసించి అగ్రహారమును ఇచ్చినట్లు తన కావ్యములోనే చెప్పుకున్నాడు. ఈ కావ్యములో ప్రధానముగా వివిధ ప్రకృతులు గల మనుష్యుల స్వభావములు, లోకపు తీరు, కార్యానుకూలతకు తగిన యుక్తులు, చతురోక్తులు, అచ్చ తెలుగు పదములతో ముద్దులు మూట గట్టుచుండెను.
'పారిజాతాపహరణము' ముక్కు తిమ్మన్నగారు వ్రాసిన రసవత్క్రుతి. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములో అష్టదిగ్గజములను కవులు ఉండేవారని అందురు. ఇంకను చాలామంది కవులు కృష్ణరాయల ఆశ్రయమును పొంది ఆయన యుగము స్వర్ణయుగమందురు గదా! అందులో రాయలవారు ప్రతి సంవత్సరము చేయు వసంతోత్సవమున ఎందరో ప్రతిభావంతులైన కవులు వచ్చేవారని గ్రంథ సాక్ష్యమున్నది. అట్టి పరిస్థితిలో రాయలు కృతి గొన్నదీ పారిజాతపహరనమును, పెద్దన గారి మనుచరిత్రను మాత్రమే. తిమ్మన ఈ గ్రంథము కృష్ణదేవరాయల వారికి అంకితమీయగా - రాయలు సంతసించి అగ్రహారమును ఇచ్చినట్లు తన కావ్యములోనే చెప్పుకున్నాడు. ఈ కావ్యములో ప్రధానముగా వివిధ ప్రకృతులు గల మనుష్యుల స్వభావములు, లోకపు తీరు, కార్యానుకూలతకు తగిన యుక్తులు, చతురోక్తులు, అచ్చ తెలుగు పదములతో ముద్దులు మూట గట్టుచుండెను.© 2017,www.logili.com All Rights Reserved.