మహామహిమోపెతమైన రామనామాన్ని అనుక్షణం జపిస్తూ, స్వయంగా రాముణ్ణి సేవించి, రామదూతగా ప్రఖ్యాతివహించి, ఆ తరువాత రామనామ, రూప, గుణ, కథాగానం చేస్తూ, తానే భగవంతుడై భక్తులకు అభీష్టాలను అనుగ్రహిస్తూ, భక్తరక్షణదక్షుడై, సంకటమోచనుడై, భవిష్య బ్రహ్మగా, సర్వజనారాధ్యుడుగా నిలిచిన శ్రీ ఆంజనేయ స్వామి వైభవాన్ని తెలిపే గ్రంథమిది.
రాముడు రాజ్యపాలనం చేసేటప్పుడు ప్రజలు నిరంతరం రామా, రామా అంటూ ఆయన నామాన్నే స్మరించేవారట. ఆయన కథలనే ఒకరికొకరు చెప్పుకుంటూ ఉండేవారట. అప్పుడు జగత్తంతా రామమయం అయిందట. అటువంటి రాముడి చరితమే రామాయణం. అది సాక్షాత్తు వేదమే. రామాయణం వేదమైతే రాముడు వేదవేద్యుడు. అందుకే ఆయన్ని ఋషులు కన్నుల పండువుగా దర్శించి కృతార్థులయ్యారు. గుహుడు, శబరీ, జటాయువు, సుగ్రీవాది వానరవీరులు, విభీషణుడు ఆయన్ని సేవించి ధన్యులయ్యారు. ఆయన భక్తకోటిలో శ్రీఆంజనేయస్వామి అగ్రగణ్యుడు. శ్రీరామ భక్తిసామ్రాజ్యానికి అధినేత.
మహామహిమోపెతమైన రామనామాన్ని అనుక్షణం జపిస్తూ, స్వయంగా రాముణ్ణి సేవించి, రామదూతగా ప్రఖ్యాతివహించి, ఆ తరువాత రామనామ, రూప, గుణ, కథాగానం చేస్తూ, తానే భగవంతుడై భక్తులకు అభీష్టాలను అనుగ్రహిస్తూ, భక్తరక్షణదక్షుడై, సంకటమోచనుడై, భవిష్య బ్రహ్మగా, సర్వజనారాధ్యుడుగా నిలిచిన శ్రీ ఆంజనేయ స్వామి వైభవాన్ని తెలిపే గ్రంథమిది. రాముడు రాజ్యపాలనం చేసేటప్పుడు ప్రజలు నిరంతరం రామా, రామా అంటూ ఆయన నామాన్నే స్మరించేవారట. ఆయన కథలనే ఒకరికొకరు చెప్పుకుంటూ ఉండేవారట. అప్పుడు జగత్తంతా రామమయం అయిందట. అటువంటి రాముడి చరితమే రామాయణం. అది సాక్షాత్తు వేదమే. రామాయణం వేదమైతే రాముడు వేదవేద్యుడు. అందుకే ఆయన్ని ఋషులు కన్నుల పండువుగా దర్శించి కృతార్థులయ్యారు. గుహుడు, శబరీ, జటాయువు, సుగ్రీవాది వానరవీరులు, విభీషణుడు ఆయన్ని సేవించి ధన్యులయ్యారు. ఆయన భక్తకోటిలో శ్రీఆంజనేయస్వామి అగ్రగణ్యుడు. శ్రీరామ భక్తిసామ్రాజ్యానికి అధినేత.© 2017,www.logili.com All Rights Reserved.