ఈ పుస్తకం "శ్రీకృష్ణాలహరీ". కృష్ణానది పై స్తోత్రం. ఈ స్తోత్ర రచయిత శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామీజీ (టెంబే స్వామీ). ఈయన సాక్షాత్ దత్తాత్రేయ అవతారము. శ్రీ టెంబే స్వామి సంస్కృతంలో శ్రీగురుచరిత్ర రచించారు. అనేక భారతీయ భాషలలో లభ్యం అవుతున్న వచన గురుచరిత్రలకు ఆధారం శ్రీ టెంబే స్వామి సంస్కృత మూలగ్రంథమే. చాతుర్మాస దీక్షలో భాగంగా శ్రీటెంబే స్వామీజీ కృష్ణానది ఒడ్డున నిలుచుని ఆశువుగా కృష్ణానదిని స్తుతించారు. శ్రీ కృష్ణవేణీ నదీమతల్లి ప్రత్యేక్షమై "సంతోషించాను, చాలు ఇక ఆపు" అనడంతో స్తోత్రం 52 శ్లోకములతో ముగిసింది. ఆ 52 శ్లోకముల స్తోత్రమే "శ్రీకృష్ణాలహరీ".
రెండు తెలుగు రాష్ట్రాలు - తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ - ఏర్పాటైన శుభతరుణంలో వస్తున్న మొదటి కృష్ణాపుష్కరాలకు "శ్రీక్రిష్ణాలహరీ"ని ప్రాచుర్యంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము. కృష్ణమ్మ ఒడిలో పెరిగిన ఋణం తీర్చుకొనే మా ఈ చిరు సాహసాన్ని పాఠకలోకం ఆదరిస్తుందని నమ్ముతున్నాము.
- వి వి బాలకృష్ణ
ఈ పుస్తకం "శ్రీకృష్ణాలహరీ". కృష్ణానది పై స్తోత్రం. ఈ స్తోత్ర రచయిత శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామీజీ (టెంబే స్వామీ). ఈయన సాక్షాత్ దత్తాత్రేయ అవతారము. శ్రీ టెంబే స్వామి సంస్కృతంలో శ్రీగురుచరిత్ర రచించారు. అనేక భారతీయ భాషలలో లభ్యం అవుతున్న వచన గురుచరిత్రలకు ఆధారం శ్రీ టెంబే స్వామి సంస్కృత మూలగ్రంథమే. చాతుర్మాస దీక్షలో భాగంగా శ్రీటెంబే స్వామీజీ కృష్ణానది ఒడ్డున నిలుచుని ఆశువుగా కృష్ణానదిని స్తుతించారు. శ్రీ కృష్ణవేణీ నదీమతల్లి ప్రత్యేక్షమై "సంతోషించాను, చాలు ఇక ఆపు" అనడంతో స్తోత్రం 52 శ్లోకములతో ముగిసింది. ఆ 52 శ్లోకముల స్తోత్రమే "శ్రీకృష్ణాలహరీ". రెండు తెలుగు రాష్ట్రాలు - తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ - ఏర్పాటైన శుభతరుణంలో వస్తున్న మొదటి కృష్ణాపుష్కరాలకు "శ్రీక్రిష్ణాలహరీ"ని ప్రాచుర్యంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము. కృష్ణమ్మ ఒడిలో పెరిగిన ఋణం తీర్చుకొనే మా ఈ చిరు సాహసాన్ని పాఠకలోకం ఆదరిస్తుందని నమ్ముతున్నాము. - వి వి బాలకృష్ణ© 2017,www.logili.com All Rights Reserved.