"విద్వాసు శ్రుతి రుత్క్రుష్టా, తత్ర రుద్రైకాదశినీ స్మృతా!
తత్ర పంచాక్షరి తస్యాం శివ ఇత్యక్షర ద్వయం" !!
విద్యలన్నింటిలో వేదం గొప్పది. దానిలో రుద్రైకాదశినీ అనబడే నమక - చమకములు గొప్పవి. ఆ నమకములో మేరుపూసవంటి 'నమః శివాయ' అన్న పంచాక్షరి మంత్రము చాలా శ్రేష్టమైనది. ఆ పంచాక్షరిలోని 'శివ' అనేది ఇంకా గొప్పది. శివ అనే రెండక్షరాలు జీవాత్మ అనే హింసకు రెండు రెక్కల వంటివి. కనుక జీవుని తరింపచేయడానికి అత్యంత సులభమైన ఉపాయము శ్రీ పాసుపత రుద్రాభిషేకము. అది సర్వపాపహారమే కాక, సర్వాభీష్ట ఫలప్రదము. అందుకే "వేదేషు శతరుద్రీయం, దేవతాసు మహేశ్వరః" అన్న సూక్తి ఏర్పడింది. ఇందులోని 366 పాసుపత తంత్రాలను శ్రద్ధాభక్తులతో అర్చిస్తే అవి పాసుపతాస్త్రాలుగా పనిచేసే అభీష్టసిద్దులనిపిస్తాయి.
ఇంతటి మహోపకారం చేస్తున్న శ్రీ మధుసూదన సరస్వతిగారి ఋణం తీర్చుకోలేనిది. వారు ధన్య జీవులు! వారి మార్గాన్ని అనుసరించి మనమూ ధన్యులమవుదాము!
శుభం భూయాత్
- హరి శివకుమార్
"విద్వాసు శ్రుతి రుత్క్రుష్టా, తత్ర రుద్రైకాదశినీ స్మృతా! తత్ర పంచాక్షరి తస్యాం శివ ఇత్యక్షర ద్వయం" !! విద్యలన్నింటిలో వేదం గొప్పది. దానిలో రుద్రైకాదశినీ అనబడే నమక - చమకములు గొప్పవి. ఆ నమకములో మేరుపూసవంటి 'నమః శివాయ' అన్న పంచాక్షరి మంత్రము చాలా శ్రేష్టమైనది. ఆ పంచాక్షరిలోని 'శివ' అనేది ఇంకా గొప్పది. శివ అనే రెండక్షరాలు జీవాత్మ అనే హింసకు రెండు రెక్కల వంటివి. కనుక జీవుని తరింపచేయడానికి అత్యంత సులభమైన ఉపాయము శ్రీ పాసుపత రుద్రాభిషేకము. అది సర్వపాపహారమే కాక, సర్వాభీష్ట ఫలప్రదము. అందుకే "వేదేషు శతరుద్రీయం, దేవతాసు మహేశ్వరః" అన్న సూక్తి ఏర్పడింది. ఇందులోని 366 పాసుపత తంత్రాలను శ్రద్ధాభక్తులతో అర్చిస్తే అవి పాసుపతాస్త్రాలుగా పనిచేసే అభీష్టసిద్దులనిపిస్తాయి. ఇంతటి మహోపకారం చేస్తున్న శ్రీ మధుసూదన సరస్వతిగారి ఋణం తీర్చుకోలేనిది. వారు ధన్య జీవులు! వారి మార్గాన్ని అనుసరించి మనమూ ధన్యులమవుదాము! శుభం భూయాత్ - హరి శివకుమార్
© 2017,www.logili.com All Rights Reserved.