శశికిరణ్ కొమాండూర్ 1979వ సంవత్సరంలో కరీంనగర్ జిల్లా (ప్రస్తుత రాజన్న సిరిసిల్ల) ఎగువమానేరు సమీప గ్రామమైన కొత్తపల్లిలో జన్మించారు. శ్రీమతి విజయ వరలక్ష్మి, శ్రీ కొమాండూర్ దేశికా చార్యులు వారి తల్లిదండ్రులు. శశికిరణ్ కొమాండూర్ కొత్తపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో పదవతరగతి వరకు చదువుకొని, కామారెడ్డి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యనభ్యసించి, ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని ఇంజనీరింగ్ కళాశాల నుండి 2000 సంవత్సరంలో సివిల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రులైనారు. 2002 నుండి 2007 వరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ప్రసార సంస్థ (ఏ.పి.ట్రాన్స్ కో)లో సహాయక ఇంజనీర్ గా పనిచేసి 2007 లో రాష్ట్ర ప్రభుత్వ గ్రూప్ 1 సేవలకు ఎంపికై వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు.
వివిధ అంశాలపై అనేక ప్రక్రియల్లో సాహిత్య సేవచేస్తూ గతంలో “తెలుగోడు” గేయకృతిని రచించి విమర్శకుల ప్రశంసలందుకున్నారు. - శ్రీమద్రామాయణం మహా కావ్యం ముందుగా వెలయించాలనే ఉద్దేశ్యంతో ఇతర రచనలు ముద్రించలేదు. అనేక అముద్రిత గ్రంథాలు త్వరలో వెలుగులోకి రానున్నాయి.
శశికిరణ్ కొమాండూర్ 1979వ సంవత్సరంలో కరీంనగర్ జిల్లా (ప్రస్తుత రాజన్న సిరిసిల్ల) ఎగువమానేరు సమీప గ్రామమైన కొత్తపల్లిలో జన్మించారు. శ్రీమతి విజయ వరలక్ష్మి, శ్రీ కొమాండూర్ దేశికా చార్యులు వారి తల్లిదండ్రులు. శశికిరణ్ కొమాండూర్ కొత్తపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో పదవతరగతి వరకు చదువుకొని, కామారెడ్డి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యనభ్యసించి, ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని ఇంజనీరింగ్ కళాశాల నుండి 2000 సంవత్సరంలో సివిల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రులైనారు. 2002 నుండి 2007 వరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ప్రసార సంస్థ (ఏ.పి.ట్రాన్స్ కో)లో సహాయక ఇంజనీర్ గా పనిచేసి 2007 లో రాష్ట్ర ప్రభుత్వ గ్రూప్ 1 సేవలకు ఎంపికై వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. వివిధ అంశాలపై అనేక ప్రక్రియల్లో సాహిత్య సేవచేస్తూ గతంలో “తెలుగోడు” గేయకృతిని రచించి విమర్శకుల ప్రశంసలందుకున్నారు. - శ్రీమద్రామాయణం మహా కావ్యం ముందుగా వెలయించాలనే ఉద్దేశ్యంతో ఇతర రచనలు ముద్రించలేదు. అనేక అముద్రిత గ్రంథాలు త్వరలో వెలుగులోకి రానున్నాయి.© 2017,www.logili.com All Rights Reserved.