పవిత్రతకు ప్రశాంతతకు కొలువైనది మన భారతదేశం. భూలోకమున ప్రతి జీవరాశిలోను మానవులు గుణవంతులై, నీతిమంతులై, నియమబద్దులై, భక్తిశ్రద్ధలకు వారసులై జీవిస్తున్నారు. అట్టి ఉన్నతమైన ఈ భూమి మీద గల భరత ఖండము మహోన్నతమైన సంపదలకు ఆలవాలము. వేదం విజ్ఞానానికి నిలయము. మానవుని మనోజ్ఞమైన ధర్మజీవితానికి ఆదర్శదేశము మన భారతదేశము.
యజ్ఞాలు, వ్రతాలు మరియు పుణ్య కార్యాలతో సమస్త లోక కళ్యాణానికై పరిశ్రమించు పుణ్యభూమి. భక్తికి, జ్ఞానానికి, వైరాగ్యానికి, నిర్మలమైన కర్మలకు నిలయమైనది. పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో, నదీనదులలో, నిధినిక్షేపాలతో, పాడిపంటలతో, సాటిలేని మేటి దేశమై నిత్యం ప్రశాంతంగా విరజిల్లుతున్న పవిత్ర భూమి మన భారతభూమి. ప్రతియుగంలోను అనురాగాల వల్లకాని, ద్వేషాలవల్లకాని, అధికారాల వల్లకాని, బలదర్పముల వల్లకాని, దుర్మార్గులవల్లకాని - ప్రజలకూ, ప్రపంచానికి కొన్ని కొన్ని సమస్యలు సంభవించడం సకల లోకరక్షకుడైన పరమాత్మ భూలోకంలో అవతరించి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తుండటం జరుగుతూనే ఉంటుంది.
పవిత్రతకు ప్రశాంతతకు కొలువైనది మన భారతదేశం. భూలోకమున ప్రతి జీవరాశిలోను మానవులు గుణవంతులై, నీతిమంతులై, నియమబద్దులై, భక్తిశ్రద్ధలకు వారసులై జీవిస్తున్నారు. అట్టి ఉన్నతమైన ఈ భూమి మీద గల భరత ఖండము మహోన్నతమైన సంపదలకు ఆలవాలము. వేదం విజ్ఞానానికి నిలయము. మానవుని మనోజ్ఞమైన ధర్మజీవితానికి ఆదర్శదేశము మన భారతదేశము. యజ్ఞాలు, వ్రతాలు మరియు పుణ్య కార్యాలతో సమస్త లోక కళ్యాణానికై పరిశ్రమించు పుణ్యభూమి. భక్తికి, జ్ఞానానికి, వైరాగ్యానికి, నిర్మలమైన కర్మలకు నిలయమైనది. పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో, నదీనదులలో, నిధినిక్షేపాలతో, పాడిపంటలతో, సాటిలేని మేటి దేశమై నిత్యం ప్రశాంతంగా విరజిల్లుతున్న పవిత్ర భూమి మన భారతభూమి. ప్రతియుగంలోను అనురాగాల వల్లకాని, ద్వేషాలవల్లకాని, అధికారాల వల్లకాని, బలదర్పముల వల్లకాని, దుర్మార్గులవల్లకాని - ప్రజలకూ, ప్రపంచానికి కొన్ని కొన్ని సమస్యలు సంభవించడం సకల లోకరక్షకుడైన పరమాత్మ భూలోకంలో అవతరించి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తుండటం జరుగుతూనే ఉంటుంది.© 2017,www.logili.com All Rights Reserved.