మన ప్రాచీన వాజ్మయంలో వేదాలకెంత ప్రాధాన్యత వుందో, ఉపనిషత్తులకీ అంతే ప్రాధాన్యం ఉంది. వేదాల తరువాత, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు వరుస క్రమంలో వేదంప్రతిపాదిత ధర్మాన్ని వివరిస్తాయి. 'ఉప' అనేది 'ని' ఉపసర్గతో చేరి, దానికి 'షద్' అనే ధాతువు, 'క్విప్' అనే ప్రత్యయం జతవగా 'ఉపనిషత్' అనే పదం ఏర్పడింది. ఉపనిషత్ అంటే అవిద్యానాశనం బ్రహ్మప్రాప్తి. గర్భనరకనివృత్తి కలిగించే విద్య అని అర్థం. మరొకరకంగా కూడా ఉపనిషత్ కి అర్థం చెప్పవచ్చు. 'ఉప' అనగా సమీపంలో 'నిషద్' అనగా కూర్చునేది.
దీని భావం ఏమిటంటే పరమతత్త్వమైన బ్రహ్మజ్ఞానానికి సమీపంగా కూర్చొనే జ్ఞానమే 'ఉపనిషత్తు' అని. అలాగే ఉపనిషద్ అనే పదాన్ని 'ఉప' అనగా వ్యవధాన రహితమైన, 'ని' అనగా సంపూర్ణ, 'షద్' అనగా జ్ఞానాన్ని ఇచ్చేది. అనగా 'వ్యవధానరహితమైన సంపూర్ణ జ్ఞానాన్ని ఇచ్చేది అని కూడా నిర్వచించుకోవచ్చు. బ్రహ్మజ్ఞానాన్ని పరిపూర్ణంగా వివరించే ఉపనిషత్తులన్నీ శ్రవణాత్మకాలు అనగా వినతగినవని పండితులు చెప్తారు. ఈ పుస్తకంలో మొత్తం 108 ఉపనిషత్తుల గురించి తెలియజేశారు.
మన ప్రాచీన వాజ్మయంలో వేదాలకెంత ప్రాధాన్యత వుందో, ఉపనిషత్తులకీ అంతే ప్రాధాన్యం ఉంది. వేదాల తరువాత, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు వరుస క్రమంలో వేదంప్రతిపాదిత ధర్మాన్ని వివరిస్తాయి. 'ఉప' అనేది 'ని' ఉపసర్గతో చేరి, దానికి 'షద్' అనే ధాతువు, 'క్విప్' అనే ప్రత్యయం జతవగా 'ఉపనిషత్' అనే పదం ఏర్పడింది. ఉపనిషత్ అంటే అవిద్యానాశనం బ్రహ్మప్రాప్తి. గర్భనరకనివృత్తి కలిగించే విద్య అని అర్థం. మరొకరకంగా కూడా ఉపనిషత్ కి అర్థం చెప్పవచ్చు. 'ఉప' అనగా సమీపంలో 'నిషద్' అనగా కూర్చునేది. దీని భావం ఏమిటంటే పరమతత్త్వమైన బ్రహ్మజ్ఞానానికి సమీపంగా కూర్చొనే జ్ఞానమే 'ఉపనిషత్తు' అని. అలాగే ఉపనిషద్ అనే పదాన్ని 'ఉప' అనగా వ్యవధాన రహితమైన, 'ని' అనగా సంపూర్ణ, 'షద్' అనగా జ్ఞానాన్ని ఇచ్చేది. అనగా 'వ్యవధానరహితమైన సంపూర్ణ జ్ఞానాన్ని ఇచ్చేది అని కూడా నిర్వచించుకోవచ్చు. బ్రహ్మజ్ఞానాన్ని పరిపూర్ణంగా వివరించే ఉపనిషత్తులన్నీ శ్రవణాత్మకాలు అనగా వినతగినవని పండితులు చెప్తారు. ఈ పుస్తకంలో మొత్తం 108 ఉపనిషత్తుల గురించి తెలియజేశారు.© 2017,www.logili.com All Rights Reserved.