'పండిత' కీ.శే. కూచి వీరభద్రశర్మ గారు తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం దగ్గర అయినాపురం గ్రామంలో స్మార్తవిద్యానిధి, పంచాంగకర్తలు శ్రీ కూచి సత్యనారాయణ శాస్త్రి, మహాలక్ష్మీ దంపతులకు జన్మించారు. కుమారాధ్యాపకంగా పితృ దేవదయా లబ్దమైన శైవస్మార్త ఆగమాది సర్వవిద్యలందు అశేష ప్రజ్ఞాధురీణులై, సరస్వతీ కటాక్షంతో శ్రీమాన్ పెద్దింటి సూర్యనారాయణ దీక్షితుల శుశ్రూషలో 'హరికథాకావతంశులై', భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 'సాయి గీత' గ్రంథకర్తగా కీర్తిగడించి.... మరుగున పడిన 'పాశుపత ప్రకరణ సహితమైన రుద్రాభిషేక విధిని అనితర సాధ్యంగా... శివ ప్రీత్యర్థం... నాటికీ, నేటికీ, శివాభిషేక ప్రకరణంలో మూల గ్రంథంగా.. స్వీయ 'సనాతన ధర్మ ప్రకాశక గ్రంథమాల' నుంచి వెలువరించారు. ఏతత్ గ్రంథోక్త పూర్వకముగా శివాభిషేకం నిర్వహించుటకు ఆంధ్రప్రదేశ్ లోని 6ఏ, 6బి, దేవాలయములలోని పండిత ప్రకాండులకు శ్రీ శర్మ గారిని శిక్షణాధికారిగా నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
శివాభిషేకమున అనితరసాధ్యమైన గ్రంథరాజముగా రుద్రాభిషేకమును రచించి... ఖండాంతర కీర్తిని పొందారు శ్రీ శర్మ గారు.
- 'పండిత' కూచి వీరభద్రశర్మ