చౌదరి తేజేశ్వరరావు గారి 85 సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో ఏడు దశాబ్దాలు కమ్యూనిస్టు ప్రజా ఉద్యమానికి అంకితమైంది. ఎదురుదెబ్బలు, సైద్ధాంతిక తప్పిదాలు, జైళ్లు, నిర్భందాలు... ఇవన్నీ కూడా ప్రజలపట్ల, ప్రజా ఉద్యమాల పట్ల ఆయన విశ్వాసాన్ని దెబ్బతీయలేకపోయాయి.
13 సంవత్సరాల 10 మాసాల పాటు సుదీర్ఘ జైలు నిర్భందానికి గురయ్యారు. రెండు సంవత్సరాలు అజ్ఞాత వాసం గడిపారు. రెండుసార్లు తృటిలో చావు నుండి తప్పించుకున్నారు. ఇవేవి విప్లవం పట్ల ఆయన నమ్మకాన్ని, కమ్యూనిస్టు ఉద్యమం పట్ల ఆయన విశ్వాసాన్ని దెబ్బతీయ లేకపోయాయి. ధైర్యంగా ఆత్మ విమర్శ జేసుకుని తప్పుల నుండి బయట పడడానికి ఆయన ఏనాడూ జంకలేదు. జైలు నుండి విడుదలైన తర్వాత మార్క్సిస్టు పార్టీ సభ్యత్వం తీసుకుని శ్రీకాకుళం జిల్లాలో ఉద్యమాభివృద్ధికి చురుకుగా కృషి చేశారు. ఆయన సతీమణి శ్రీమతి సంపూర్ణమ్మగారు కూడా ఆరు సంవత్సరాల జైలు జీవితం తర్వాత ప్రజా ఉద్యమానికి అంకితమయ్యారు. వీరిద్దరి జీవితానుభవాలు కొత్త తరానికి స్ఫూర్తిదాయకం.
తన అనుభవాలు, జ్ఞాపకాలతో తేజేశ్వరరావు గారు మన ముందుంచిన ఈ పుస్తకం ఆంధ్రలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని, దానిలోని కీలక సందర్భాలను అర్థం జేసుకోవడానికి ఒక ముఖ్య వనరుగా ఉపయోగపడుతుంది.
చౌదరి తేజేశ్వరరావు గారి 85 సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో ఏడు దశాబ్దాలు కమ్యూనిస్టు ప్రజా ఉద్యమానికి అంకితమైంది. ఎదురుదెబ్బలు, సైద్ధాంతిక తప్పిదాలు, జైళ్లు, నిర్భందాలు... ఇవన్నీ కూడా ప్రజలపట్ల, ప్రజా ఉద్యమాల పట్ల ఆయన విశ్వాసాన్ని దెబ్బతీయలేకపోయాయి. 13 సంవత్సరాల 10 మాసాల పాటు సుదీర్ఘ జైలు నిర్భందానికి గురయ్యారు. రెండు సంవత్సరాలు అజ్ఞాత వాసం గడిపారు. రెండుసార్లు తృటిలో చావు నుండి తప్పించుకున్నారు. ఇవేవి విప్లవం పట్ల ఆయన నమ్మకాన్ని, కమ్యూనిస్టు ఉద్యమం పట్ల ఆయన విశ్వాసాన్ని దెబ్బతీయ లేకపోయాయి. ధైర్యంగా ఆత్మ విమర్శ జేసుకుని తప్పుల నుండి బయట పడడానికి ఆయన ఏనాడూ జంకలేదు. జైలు నుండి విడుదలైన తర్వాత మార్క్సిస్టు పార్టీ సభ్యత్వం తీసుకుని శ్రీకాకుళం జిల్లాలో ఉద్యమాభివృద్ధికి చురుకుగా కృషి చేశారు. ఆయన సతీమణి శ్రీమతి సంపూర్ణమ్మగారు కూడా ఆరు సంవత్సరాల జైలు జీవితం తర్వాత ప్రజా ఉద్యమానికి అంకితమయ్యారు. వీరిద్దరి జీవితానుభవాలు కొత్త తరానికి స్ఫూర్తిదాయకం. తన అనుభవాలు, జ్ఞాపకాలతో తేజేశ్వరరావు గారు మన ముందుంచిన ఈ పుస్తకం ఆంధ్రలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని, దానిలోని కీలక సందర్భాలను అర్థం జేసుకోవడానికి ఒక ముఖ్య వనరుగా ఉపయోగపడుతుంది.
© 2017,www.logili.com All Rights Reserved.