కామ్రేడ్ ధర్మబిక్షం గారు 90 సంవత్సరాల జీవితంలో 70 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఎంతోమంది అభిమానులను, శిష్యులను, సహచరులను సంపాదించుకున్నారు. ప్రజల గౌరవాన్ని పొందారు. వారి రాజకీయ శిష్యులలో ఒకనిగా 60 సంవత్సరాల పాటు ఉద్యమంలో వారితోపాటు పనిచేశాను. నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆ తర్వాత హైదరాబాదు క్వార్టర్సులోనూ వారితో కలిసి వున్నాను, కలిసి తిన్నాను. ఆయన భావాలు, అభిప్రాయాలు, అలవాట్లు, ఆలోచనలు వ్యక్తిగత జీవితం దగ్గరగా వుండి తెలుసుకున్నాను. ధర్మబిక్షం గారు తుదిశ్వాస విడిచేవరకూ వారితో సంబంధం వున్నది.
త్యాగశీలి, ఆదర్శ కమ్యూనిస్టు, మానవతావాది, తెలంగాణా సాయుధ సమారాయోధుడు, స్వర్గీయ ధర్మబిక్షంగారికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాల సంకలనం మీ ముందుంచుతున్నాను. ఇందులో అన్ని విషయాలు, వివరాలు లేకపోవచ్చు. వారి అభిమానులు, వారి గురించి తెలిసినవారు అదనపు విషయాలు తెలియచేస్తే భవిష్యత్తులో ధర్మబిక్షంగారి సమగ్ర జీవిత చరిత్ర రూపొందుతుందని భావిస్తూ...
- కందిమళ్ళ ప్రతాపరెడ్డి
కామ్రేడ్ ధర్మబిక్షం గారు 90 సంవత్సరాల జీవితంలో 70 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఎంతోమంది అభిమానులను, శిష్యులను, సహచరులను సంపాదించుకున్నారు. ప్రజల గౌరవాన్ని పొందారు. వారి రాజకీయ శిష్యులలో ఒకనిగా 60 సంవత్సరాల పాటు ఉద్యమంలో వారితోపాటు పనిచేశాను. నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆ తర్వాత హైదరాబాదు క్వార్టర్సులోనూ వారితో కలిసి వున్నాను, కలిసి తిన్నాను. ఆయన భావాలు, అభిప్రాయాలు, అలవాట్లు, ఆలోచనలు వ్యక్తిగత జీవితం దగ్గరగా వుండి తెలుసుకున్నాను. ధర్మబిక్షం గారు తుదిశ్వాస విడిచేవరకూ వారితో సంబంధం వున్నది. త్యాగశీలి, ఆదర్శ కమ్యూనిస్టు, మానవతావాది, తెలంగాణా సాయుధ సమారాయోధుడు, స్వర్గీయ ధర్మబిక్షంగారికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాల సంకలనం మీ ముందుంచుతున్నాను. ఇందులో అన్ని విషయాలు, వివరాలు లేకపోవచ్చు. వారి అభిమానులు, వారి గురించి తెలిసినవారు అదనపు విషయాలు తెలియచేస్తే భవిష్యత్తులో ధర్మబిక్షంగారి సమగ్ర జీవిత చరిత్ర రూపొందుతుందని భావిస్తూ... - కందిమళ్ళ ప్రతాపరెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.