Modern Library వారి 20 వ శతాబ్దపు 100 అత్యుత్తమ ప్రపంచ నవలల జాబితాలో మూడవది జేమ్స్ జాయిస్ మొట్టమొదటి నవల 'ఏ పోర్ర్టయిట్ అఫ్ ది ఆర్టిస్ట్ యాజ్ ఏ యంగ్ మాన్', ఈ నవలని ప్రముఖ రచయిత, కవి, అనువాదకులు చింతపట్ల సుదర్శన్ 'యువకళాకారుని ఆత్మగీతం' పేరుతో రమణీయమైన రీతిలో తెలుగులోకి అనువాదం చేశారు.
బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టే క్రమంలో ఒక యువ కళాకారుడు సాధించిన మానసిక పరిపక్వత, కళాత్మక అంతర్దృష్టిని ఈ నవల చిత్రిస్తుంది. పాక్షికంగా జాయిస్ స్వీయ జీవన చిత్రమైన ఈ నవలలో ప్రధాన పాత్ర మనస్సుకి దృష్టికి యథాతథంగా అక్షరరూపం యివ్వగలిగిన భావ ప్రకటన (audible thinking), వాక్య నిర్మాణం, దృశ్యాల పేర్పు, ఒక కొత్త వచన రచనగా (చైతన్య స్రవంతి) ఆవిష్కృతమైంది. వందేళ్ళు పై బడిన ఈ నవల నేటితరం పాఠకుల్ని సైతం ఆసక్తికరంగా చదివిస్తుంది.
- చింతపట్ల సుదర్శన్