మహాకవి శ్రీశ్రీని పలకరించిన అనుభూతి
ప్రపంచ సాహిత్యం మరచిపోని, మరుపురాని మహాకవి శ్రీశ్రీ మహనీయుడి గూర్చి విశ్వవ్యాపితంగా వివిధ భాషల్లో అనేకానేక పుస్తకాలు వస్తున్నాయి. దేన్ని సమగ్రంగా వచ్చిందని భావించడానికి వీల్లేని వ్యక్తి మహాకవిత్వ శక్తి శ్రీశ్రీ. ఈ తరాన్నే కాదు రాబోయే తరాలకు ప్రభావితం చేయగల రచనలు చేసిన చైతన్యదీప్తి శ్రీశ్రీ. మనిషిని, మనిషి శ్రమను, శ్రమ దోపిడిని వర్తమాన సమాజంలో తన కవిత్వంతో పలకరించి, పలవరించిన దార్శనికుడు శ్రీశ్రీ. శ్రీశ్రీ గూర్చి తెలియని కవులు భారతీయ సాహిత్యంలో ఉండకపోవచ్చు. మహాకవి శ్రీశ్రీ శ్రమైక జీవనాన్ని అక్షరమక్షరం కవిత్వమయం చేసిన కవితాయోధుడు. శ్రీశ్రీ అంటే మహాప్రస్థానం మాత్రమే చెప్పడం విడ్డూరం. కాని మహాప్రస్థానమే కాక శ్రీశ్రీ లోతైన కవిత్వ సొగసులను వస్తుశిల్ప సౌందర్యాలను, అభివ్యక్తి ఎత్తుగడలను యతిప్రాసల మువ్వల సవ్వడులను మరో ప్రస్థానం, సిప్రాలిలలోనూ చూడొచ్చు.
అటువంటి మహాకవి జీవితాన్ని స్పృశిస్తూ ఈ 'మహాకవి శ్రీశ్రీ - అంతరాత్మ పుస్తకం తీసుకురావడం చూస్తుంటే కవి సవ్వప్ప గారి ఈరన్న గారిని మనసారా అభినందించాల్సిందే. ఇదొక సాహసోపేతమైన చర్య ప్రగతిశీల భావుకత కల్గిన మహాకవి శ్రీశ్రీపై అన్ని సాహిత్య ప్రక్రియలపై భిన్న భావజాలం మధ్యన జీవిస్తున్న కవి సవ్వప్పగారి ఈరన్న గారు రాయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఈ పుస్తకం ఇలా రావడానికి ప్రధాన సవప్ప గారి ఈరన్న...........
మహాకవి శ్రీశ్రీని పలకరించిన అనుభూతి ప్రపంచ సాహిత్యం మరచిపోని, మరుపురాని మహాకవి శ్రీశ్రీ మహనీయుడి గూర్చి విశ్వవ్యాపితంగా వివిధ భాషల్లో అనేకానేక పుస్తకాలు వస్తున్నాయి. దేన్ని సమగ్రంగా వచ్చిందని భావించడానికి వీల్లేని వ్యక్తి మహాకవిత్వ శక్తి శ్రీశ్రీ. ఈ తరాన్నే కాదు రాబోయే తరాలకు ప్రభావితం చేయగల రచనలు చేసిన చైతన్యదీప్తి శ్రీశ్రీ. మనిషిని, మనిషి శ్రమను, శ్రమ దోపిడిని వర్తమాన సమాజంలో తన కవిత్వంతో పలకరించి, పలవరించిన దార్శనికుడు శ్రీశ్రీ. శ్రీశ్రీ గూర్చి తెలియని కవులు భారతీయ సాహిత్యంలో ఉండకపోవచ్చు. మహాకవి శ్రీశ్రీ శ్రమైక జీవనాన్ని అక్షరమక్షరం కవిత్వమయం చేసిన కవితాయోధుడు. శ్రీశ్రీ అంటే మహాప్రస్థానం మాత్రమే చెప్పడం విడ్డూరం. కాని మహాప్రస్థానమే కాక శ్రీశ్రీ లోతైన కవిత్వ సొగసులను వస్తుశిల్ప సౌందర్యాలను, అభివ్యక్తి ఎత్తుగడలను యతిప్రాసల మువ్వల సవ్వడులను మరో ప్రస్థానం, సిప్రాలిలలోనూ చూడొచ్చు. అటువంటి మహాకవి జీవితాన్ని స్పృశిస్తూ ఈ 'మహాకవి శ్రీశ్రీ - అంతరాత్మ పుస్తకం తీసుకురావడం చూస్తుంటే కవి సవ్వప్ప గారి ఈరన్న గారిని మనసారా అభినందించాల్సిందే. ఇదొక సాహసోపేతమైన చర్య ప్రగతిశీల భావుకత కల్గిన మహాకవి శ్రీశ్రీపై అన్ని సాహిత్య ప్రక్రియలపై భిన్న భావజాలం మధ్యన జీవిస్తున్న కవి సవ్వప్పగారి ఈరన్న గారు రాయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఈ పుస్తకం ఇలా రావడానికి ప్రధాన సవప్ప గారి ఈరన్న...........© 2017,www.logili.com All Rights Reserved.