వీరులు, ధీరులు, రాజకీయ దురంధరులే కాక అనేకమంది విప్లవకారులు, వీరమాతలు, కవులు, పండితులు, కళాకారులు, కర్షకులకు కాణాచియైన తెలంగాణా గడ్డపై జన్మించాడు. భారత రాజకీయ గగనతలంపై ధ్రువతారగా వెలిగిన మహానాయకుడు. మహాపురుషుడు. డా మఱ్ఱి చెన్నారెడ్డి. త్యాగపురుషుడూ, వీర పురుషుడూ కూడా! మేధావి, అనుభవశాలి, ఆలోచనాపరుడూను! ప్రజల నాడిని అర్థం చేసుకోగల గొప్ప శక్తి ఆయనలో ఉండేది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చెన్నారెడ్డికి ప్రత్యేకస్థానం ఉంది. చిరస్మరణీయుడు. భారతీయ విశ్వాసాల పట్ల, సాంస్కృతిక సంపదపట్ల అపారమైన గౌరవం కలవాడు.
స్నేహానికి అంతరాలనెప్పుడూ అవరోధం కానీయని సహృదయుడాయన. ప్రత్యేక తెలంగాణాను కోరినప్పటికీ చెన్నారెడ్డి మొత్తం రాష్ట్రాభివృద్ధిని ఆకాంక్షించేవారు. గొప్ప పాలనాదక్షుడు మఱ్ఱి చెన్నారెడ్డి. మంత్రివర్గ సమావేశాలకు ప్రజా సంబంధాల అధికారిని అనుమతించిన తొట్టతొలి ముఖ్యమంత్రి కూడా వీరే! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండు దఫాలు పనిచేశారు. సదా స్మరణీయుడు. ఆ మహనీయుని గురించి కొన్ని విషయాలు తెలుసుకొందాం.
- ఎర్రదొడ్డి సుభాషిణి
వీరులు, ధీరులు, రాజకీయ దురంధరులే కాక అనేకమంది విప్లవకారులు, వీరమాతలు, కవులు, పండితులు, కళాకారులు, కర్షకులకు కాణాచియైన తెలంగాణా గడ్డపై జన్మించాడు. భారత రాజకీయ గగనతలంపై ధ్రువతారగా వెలిగిన మహానాయకుడు. మహాపురుషుడు. డా మఱ్ఱి చెన్నారెడ్డి. త్యాగపురుషుడూ, వీర పురుషుడూ కూడా! మేధావి, అనుభవశాలి, ఆలోచనాపరుడూను! ప్రజల నాడిని అర్థం చేసుకోగల గొప్ప శక్తి ఆయనలో ఉండేది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చెన్నారెడ్డికి ప్రత్యేకస్థానం ఉంది. చిరస్మరణీయుడు. భారతీయ విశ్వాసాల పట్ల, సాంస్కృతిక సంపదపట్ల అపారమైన గౌరవం కలవాడు. స్నేహానికి అంతరాలనెప్పుడూ అవరోధం కానీయని సహృదయుడాయన. ప్రత్యేక తెలంగాణాను కోరినప్పటికీ చెన్నారెడ్డి మొత్తం రాష్ట్రాభివృద్ధిని ఆకాంక్షించేవారు. గొప్ప పాలనాదక్షుడు మఱ్ఱి చెన్నారెడ్డి. మంత్రివర్గ సమావేశాలకు ప్రజా సంబంధాల అధికారిని అనుమతించిన తొట్టతొలి ముఖ్యమంత్రి కూడా వీరే! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండు దఫాలు పనిచేశారు. సదా స్మరణీయుడు. ఆ మహనీయుని గురించి కొన్ని విషయాలు తెలుసుకొందాం. - ఎర్రదొడ్డి సుభాషిణి© 2017,www.logili.com All Rights Reserved.