భూమి ఆకారం యెలా వుంటుంది? వింత ప్రశ్న, కదూ? భూమి గోళం. గుండ్రంగా వుంది. మనకి యీ విషయం స్పష్టంగా తెలుసు. మనం యిరవయ్యవ శతాబ్దం వాళ్లం. గడ్డి ఆకుపచ్చగా వుంది. ఆకాశం నీలంగా వుంది. భూమి గుండ్రంగా వుంది. మనకీ విషయం చిన్న పిల్లలుగా వున్నప్పటినుంచి తెలుసు. కాని నిజానికి యిది అంత స్పష్టంగా వుందా?
పల్లెటూరికి వెళ్ళండి. పెద్ద పొలం మధ్యకంటా వెళ్ళండి. చుట్టూతా కనుచూపుమేరంతా గడ్డీ, పువ్వులూ కనిపించేలా మధ్యలోకి వెళ్ళండి. గుండ్రంగా కనిపిస్తోందా? వొంపు వున్నట్టు కనిపిస్తోందా? లేదే. చదునుగా చపాతీలాగా చుట్టుతా యెటు చూసినా కనిపిస్తుంది. ప్రతి కొమ్మ రెమ్మ, ప్రతి చిన్న గుట్ట స్పష్టంగా కనిపిస్తాయి. మరి భూమి గుండ్రంగా వుందని యెవళ్ళన్నారు?
ఉపగ్రహాలు అందించిన సమాచారం ఆసరా చేసుకుని భూమి ఉపరితలాన్ని కొలిచారు. యిలా కొలవడానికి కంప్యూటర్ల ని వాడేరు. మన భూమి ఆకారం అంత కచ్చితంగా గుండ్రంగా లేదని తేలింది. కొంచెంగా జీడిమామిడిపండు వాటం వున్నట్టు తేలింది. ఉత్తరార్ధగోళంలో కొంచెం ధృవం వేపు సాగి వుంది. దక్షిణార్ధగోళం లోపలికి తోసుకొచ్చింది. ఉపరితలంమీద మిట్ట పల్లాలున్నాయి. భూమధ్యరేఖ గుండా భూగోళాన్ని కోసినట్టయితే నూటికి నూరు పాళ్ళూ వృత్తంగా వున్నట్టు కనిపించదు. కొంచెం వంపు తిరిగి వుంటుంది. ఈ ఆకారాన్ని యేమని పిలవాలి?
యింతా చేసి తేలింది యేమిటయ్య అంటే నిజానికి "భూమిలాగా" వుంది అని. వాస్తవానికి భూమి అంత పూర్ణ గోళంగా లేదు. యీ విషయాన్ని జనం కనిపెట్టిన తీరు ఆసక్తికరంగా వుంటుంది. యీ పుస్తకం ఆ విషయం గురించే అంతా చెప్తుంది.
- అనతోలీ తొమీలిన్
భూమి ఆకారం యెలా వుంటుంది? వింత ప్రశ్న, కదూ? భూమి గోళం. గుండ్రంగా వుంది. మనకి యీ విషయం స్పష్టంగా తెలుసు. మనం యిరవయ్యవ శతాబ్దం వాళ్లం. గడ్డి ఆకుపచ్చగా వుంది. ఆకాశం నీలంగా వుంది. భూమి గుండ్రంగా వుంది. మనకీ విషయం చిన్న పిల్లలుగా వున్నప్పటినుంచి తెలుసు. కాని నిజానికి యిది అంత స్పష్టంగా వుందా? పల్లెటూరికి వెళ్ళండి. పెద్ద పొలం మధ్యకంటా వెళ్ళండి. చుట్టూతా కనుచూపుమేరంతా గడ్డీ, పువ్వులూ కనిపించేలా మధ్యలోకి వెళ్ళండి. గుండ్రంగా కనిపిస్తోందా? వొంపు వున్నట్టు కనిపిస్తోందా? లేదే. చదునుగా చపాతీలాగా చుట్టుతా యెటు చూసినా కనిపిస్తుంది. ప్రతి కొమ్మ రెమ్మ, ప్రతి చిన్న గుట్ట స్పష్టంగా కనిపిస్తాయి. మరి భూమి గుండ్రంగా వుందని యెవళ్ళన్నారు? ఉపగ్రహాలు అందించిన సమాచారం ఆసరా చేసుకుని భూమి ఉపరితలాన్ని కొలిచారు. యిలా కొలవడానికి కంప్యూటర్ల ని వాడేరు. మన భూమి ఆకారం అంత కచ్చితంగా గుండ్రంగా లేదని తేలింది. కొంచెంగా జీడిమామిడిపండు వాటం వున్నట్టు తేలింది. ఉత్తరార్ధగోళంలో కొంచెం ధృవం వేపు సాగి వుంది. దక్షిణార్ధగోళం లోపలికి తోసుకొచ్చింది. ఉపరితలంమీద మిట్ట పల్లాలున్నాయి. భూమధ్యరేఖ గుండా భూగోళాన్ని కోసినట్టయితే నూటికి నూరు పాళ్ళూ వృత్తంగా వున్నట్టు కనిపించదు. కొంచెం వంపు తిరిగి వుంటుంది. ఈ ఆకారాన్ని యేమని పిలవాలి? యింతా చేసి తేలింది యేమిటయ్య అంటే నిజానికి "భూమిలాగా" వుంది అని. వాస్తవానికి భూమి అంత పూర్ణ గోళంగా లేదు. యీ విషయాన్ని జనం కనిపెట్టిన తీరు ఆసక్తికరంగా వుంటుంది. యీ పుస్తకం ఆ విషయం గురించే అంతా చెప్తుంది. - అనతోలీ తొమీలిన్I bought this book in 1987. As a 5 years old kid then, i was so impressed with this book that i stored this book till date 2015. This is a excellent book for kids which gives them great enthusiasm and a great spirit of inquiry in to scientific questions. eg: today i am a SCIENTIST.
© 2017,www.logili.com All Rights Reserved.