కథలంటే ఇష్టపడని వారెవరూ ఉండరు. ‘ఇంకా చెప్పండి’ లేదా ‘పుస్తకాలుంటే ఇవ్వండి, చదివిస్తాం’ అనే వారే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా సాహిత్యసృష్టి ఏర్పడిన నాటినుంచీ కథలు గాథలు ప్రతి ఇంట్లో చోటు చేసుకునే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ కథలంటే ఓ కాల్పనిక ప్రపంచ విహారమనే అభిప్రాయమే ఉంది, ఉంటుంది. మనదేశంలో బృహత్కథామంజరి, కథా సరిత్సాగరం, రామాయణ భారత, భాగవతాలు, పురాణాలు, మిగిలిన కథలన్నింటికీ మూలాలుగా భావిస్తారు. విదేశీయులు మన దేశాన్ని పాలించడం మొదలయ్యాక వారి కథాసాహిత్యమంతా మనకూ విస్తరించింది. అరేబియన్ నైట్స్ అనే 1001 కథలు బహుళప్రాచుర్యాన్ని పొందాయి. అలాంటివే ప్రఖ్యాతి వహించిన అరేబియన్ కథలే గులేబకావళీ, లైలామజ్నూ, రుస్తుంసొహరాబ్, హాతింతాయి మొదలయిన కథలు.
అరబ్బు వీరుడు హాతిం