అవదాన అనేమాటకు ధర్మాన్ని బోధించటం ద్వారా మనస్సుని పరిశుద్ధం చేసే పవిత్రగాధ, ఇతిహాసం, కర్మవృత్తం, మొదలైన అర్ధాలున్నాయి. వినేవారి హృదయాన్ని తాకి, వారి మనస్సుల్లో ధర్మపరివర్తన కలిగేటట్లుగా ప్రఖ్యాత పురుషుల జీవనఘట్టాలను వర్ణించటం దీని ప్రధాన లక్ష్యం.
ఈ దృష్టితో చూసినపుడు అశోకవదానం తన లక్ష్యాన్ని పూర్తిగా సాధించిందని చెప్పవచ్చును. కాళ్ళు, చేతులూ నరికివేయబడి శ్మశానంలో వాసవదత్త చనిపోవటానికి కొంతముందు ఉపగుప్తుడు అమెవద్దకు పోయి ఆమెలో మార్పు తెచ్చినతీరు, దిగ్ర్బాంతిని కలిగించే వీతశోకుని మరణం, కంటతడి పెట్టించే కునాలుని ఉదంతం, చివరిరోజుల్లో దారిద్ర్యంలోకి నెట్టబడి చివరికి తనవద్ద మిగిలిన సగం ఉసిరికాయను సంఘానికి పంపుతూ అశోకుడు పలికిన మాటలు ఎవరి హృదయాన్ని కదిలించవు! అవదాన కల్పలతలో ఉన్నట్లుగా ఇందులో సుదీర్ఘమైన వర్ణనలు లేవు. రచయిత చిన్న చిన్న వాక్యాల్లో సరళంగా విషయాన్ని వివరించాడు.
దివ్యవదానం అనబడే పెద్ద అవదాన గ్రంధంలో ప్రస్తుతరూపంలో ఉన్న అశోకావదానం ఒక భాగం.