Title | Price | |
Sri Devi Bhagavatham | Rs.600 | In Stock |
దేవిపూజ, దేవి ఉపాసన అనూచానంగా సాంప్రదాయపరంగా యావత్ భారతదేశంలో సంరభంతో జరుగుతూనే ఉన్నాయి. శ్రీ దేవి భాగవతంలో దేవి విశిష్టత మనోజ్ఞంగా చెప్పబడింది. శ్రీ దేవి భాగవతం వేదముల, పురాణముల తంత్ర మంత్ర శాస్త్ర సమ్మిళితంమై, దేవి వీరోచిత గాథలతో విశ్వవ్యాప్త తేజో పరిభూతమై అలరారుతున్నది. గాయత్రి వైశిష్ట్యము, మంత్రం ప్రాశస్త్యముతో బీజాక్షర సంపుటితో విరాజిల్లుతున్నది. ఆఖ్యాన ఉపాఖ్యానా పరంపర ఈ భాగవతానికి మనోరంజకత్వాన్ని వైశిష్ట్యాన్ని సమాకూర్చుతున్నది. అన్ని కథలలో దేవి ఔన్నత్యం మూలమై అన్ని భేద భావములకు ఒక సమన్వయత్వమును ఆపాదించుచున్నది. అందరిలో భక్తి ప్రపత్తులకు ఒక మహా పురాణంగా భాసిల్లుతున్నది.
ఇందులో
. శౌనక ప్రశ్న
. పురూరవ చరిత్ర
. దేవియజ్ఞ విధి
. శుక్రుడు జయంతి
. దేవి మహిష సంవాదం
. వృత్రుడు దేవతల నోడించుట
. రేవతి వివాహ వృత్తాంతం
. మేరునగ వర్ణనం
. నానావిధ నరకకూపాలు
............. ఇలా ఎన్నో వృత్తాంతాలను గురునాథరావు గారు అద్భతంగా వివరించారు. మూలములో శ్రీ దేవి భాగవతంలో మంత్రయోగ, వేదాంతాది శాస్త్ర రహస్యములున్నవి. శ్రీ గురునాధరావు గారు ఈ శ్రీ దేవి భాగవతంలో వాటినన్నిటిని సందర్భ శుద్దితో మూలమునకు భిన్నము కాని రీతిని సరళముగా తెలుగులో అనువదించారు.
-ఐనంపూడి గురునాథరావు.
దేవిపూజ, దేవి ఉపాసన అనూచానంగా సాంప్రదాయపరంగా యావత్ భారతదేశంలో సంరభంతో జరుగుతూనే ఉన్నాయి. శ్రీ దేవి భాగవతంలో దేవి విశిష్టత మనోజ్ఞంగా చెప్పబడింది. శ్రీ దేవి భాగవతం వేదముల, పురాణముల తంత్ర మంత్ర శాస్త్ర సమ్మిళితంమై, దేవి వీరోచిత గాథలతో విశ్వవ్యాప్త తేజో పరిభూతమై అలరారుతున్నది. గాయత్రి వైశిష్ట్యము, మంత్రం ప్రాశస్త్యముతో బీజాక్షర సంపుటితో విరాజిల్లుతున్నది. ఆఖ్యాన ఉపాఖ్యానా పరంపర ఈ భాగవతానికి మనోరంజకత్వాన్ని వైశిష్ట్యాన్ని సమాకూర్చుతున్నది. అన్ని కథలలో దేవి ఔన్నత్యం మూలమై అన్ని భేద భావములకు ఒక సమన్వయత్వమును ఆపాదించుచున్నది. అందరిలో భక్తి ప్రపత్తులకు ఒక మహా పురాణంగా భాసిల్లుతున్నది. ఇందులో . శౌనక ప్రశ్న . పురూరవ చరిత్ర . దేవియజ్ఞ విధి . శుక్రుడు జయంతి . దేవి మహిష సంవాదం . వృత్రుడు దేవతల నోడించుట . రేవతి వివాహ వృత్తాంతం . మేరునగ వర్ణనం . నానావిధ నరకకూపాలు ............. ఇలా ఎన్నో వృత్తాంతాలను గురునాథరావు గారు అద్భతంగా వివరించారు. మూలములో శ్రీ దేవి భాగవతంలో మంత్రయోగ, వేదాంతాది శాస్త్ర రహస్యములున్నవి. శ్రీ గురునాధరావు గారు ఈ శ్రీ దేవి భాగవతంలో వాటినన్నిటిని సందర్భ శుద్దితో మూలమునకు భిన్నము కాని రీతిని సరళముగా తెలుగులో అనువదించారు. -ఐనంపూడి గురునాథరావు.© 2017,www.logili.com All Rights Reserved.