ఈ గ్రంథం విషయ వివరణ దృష్టితో చుస్తే కూచిపూడి నాట్య విషయ సర్వస్వం. కూచిపూడికీ సంబంధించిన సమాలోచిస్తే ఆధునిక కళాక్షేత్ర మహాత్మ్యం, నాట్య సంప్రదాయ వికాస దృష్టితో గమనిస్తే ఒక కళయొక్క సమగ్ర అభివృద్ధి వికాసం. ప్రక్రియాపరంగా సమీక్షిస్తే కూచిపూడి నాట్య సంప్రదాయ సంబంధులైన దేశి - మార్గ ప్రక్రియల సోదాహరణ చరిత్ర, కళాకారుల దుష్ట్యా భావిస్తే కూచిపూడి కళా వికాసానికి తోడ్పడిన, కృషి చేసిన ప్రయోక్తల పరిచయ సంచిక, వంశ వృక్షాలను గమనిస్తే ఇది ఒక ఐతిహాసికోద్యానవనం. మొత్తం గ్రంథం డాక్టర్ రామనాధంగారి కళాదర్శనం.
ఈ గ్రంధాన్ని కధగా వ్రాసి ఉండవచ్చు. కొన్ని అంశాల చిత్రీకరణగా సంపుటీకరించి ఉండవచ్చు. నచ్చిన అంశాలలో పొగడుతూ, నచ్చని వాటిని తెగడుతూ ఆత్మాశ్రయంగా సాగించి ఉండవచ్చు. లేదా విషయ సామాగ్రి సంగ్రహంగా సంగ్రంధించి వుండవచ్చు. డాక్టర్ చింతా రామనాధంగారు శిల్పజ్ఞులైన రచయిత కాబట్టి, పైన పేర్కొన్న పాక్షిక విధానాల జోలికి పోకుండా ఒక నిండైన, ఇంపైన రచనను సంతరించారు. శాస్త్రీయతను మన్నించారు. విశ్లేషణను సాధించారు, వివేచనను వ్యక్తీకరించారు, సమన్వయాన్ని సంతరించారు చదివే వారికీ విసుగుపుట్టని, స్పష్టమైన, సరళమైన సరళిలో వ్యక్తీకరించారు. ఆధునికులైన పఠీతలకు అన్నివిధాల సంతృప్తిపరచే రచనను వెలయించారు.
కూచిపూడి నాట్యంలోని అత్యంత ప్రాచీన దశలను ఎంత ప్రామాణికంగా చిత్రించారో తరువాతి పరిణామదశలను శ్రీ వేదాంతం లక్ష్మినారాయణశాస్త్రి, శ్రీ వెంపటి చినసత్యం, శ్రీ వేదాంతం సత్యనారాయణశర్మగారల ఆధునిక ప్రయోగాలను గురించి కూడా అంత నిబ్బరంతో నిర్వహించారు. భావనలో ప్రతిపాదనలో రామనాధంగారు ఒక సరితూకంతో కూడిన ఔచిత్యాన్ని రచనలో జీవింపజేశారు.
- జి.వి. సుబ్రహ్మణ్యం
చింతా రామనాధం (గ్రంధకర్త పరిచయం) :
కూచిపూడి భాగవతులు కొన్ని వందల సంవత్సరాల నుండి కూచిపూడి నాట్య కళాజ్యోతులను ఆరనీయకుండా నేటివరకు ఆ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ వచ్చారు. వారి కృషి ఫలితంగా నేడు కూచిపూడి నాట్యం ప్రపంచ ప్రఖ్యాతి నొందింది. ఎందరో కూచిపూడి భాగవతులు తమ జీవితాలను నాట్యకళామతల్లికీ నైవేద్యమొనర్చి కళాజగత్తులో ధృవతారలుగా నిలిచిపోయారు. అలాంటి కుటుంబంలో జన్మించిన శ్రీ చింతా రామనాధంగారు తాతతండ్రుల మార్గంలోనే తన పయనాన్ని కొనసాగించారు. 1948వ సంవత్సరంలో సీతారావమ్మ, శ్రీ చింతా కృష్ణమూర్తి గార్లకు కూచిపూడి గడ్డపై జన్మించారు. వీరు ప్రాధమిక విద్యాభ్యాసం శ్రీ తూములూరి ఆంజనేయశాస్త్రిగారు, మహంకాళి లక్ష్మినరసింహశాస్త్రి గారి వద్ద అభ్యసించారు. నాట్య గురువులు, నృత్య వాచస్పతి శ్రీ వేదాంతం పార్వతీశం, ప్రపంచ పరమేష్టి శ్రీ వెంపటి చినసత్యం గార్ల వద్ద అచిరకాలంలోనే నాట్యవిద్యను ఔపోసన పట్టారు. తరువాత పరిశోధన దిశగా తన దృష్టిని సారించి గురువన్వేషణలో జాతీయాచార్యులు శ్రీ యస్వీ జోగారావు గారిని పరిశోధనా పర్యవేక్షకులుగా ఎంచుకొని, కూచిపూడి నాట్యరంగంలో మొట్టమొదటిగా 'కూచిపూడి యక్షగాన సాహిత్యము సంప్రదాయము ప్రయోగము' అనే సిద్దాంత గ్రంధాన్ని సమర్పించి 1979లో పిహెచ్.డి. పట్టాను పొందారు.
ఓ వైపు 'భారతీయ విద్యాభవన్' హైదరాబాదులో నాట్య గురువుగా బాధ్యతలను నిర్వర్తిస్తూ, మరోవైపు రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. వీరి రచనలు కూచిపూడి నాట్యకళ, కూచిపూడి నృత్య మూర్తిత్రయం, కావ్య సౌరభాలు - భామాకలాపం, కూచిపూడి నాట్యభారతి, కూచిపూడి నాట్యచార్యులు చరిత్ర పుటలు, కూచిపూడి నాట్య విశిష్టత మొదలైనవి.
1996లో కూచిపూడి గ్రామంలోని 'శ్రీ సిద్దేంద్రయోగి కళాపీఠానికీ' ప్రధాన ఉపాధ్యాయులుగా బాధ్యతలను స్వీకరించి, దాని అభివృద్ధికీ ఎంతగానో పాటుపడ్డారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో అంతర్భాగమైన కళాపీటం అప్పటి ఉపాధ్యక్షుల సహకారంతో నూతన భవన నిర్మాణానికి అహర్నిశలు శ్రమించారు. ఆ శ్రమ ఫలితమే నేడు కూచిపూడి గ్రామంలో అతి సుందరమైన, విశాలమైన భవనం నిర్మించబడటం అందుకు నిదర్శనం.
ఎందరో శిష్యులు తీర్చిదిద్ది దేశం నలుమూలలా పండిత పామర జనరంజకంగా ప్రదర్శనలిచ్చి, ఎన్నో సన్మానాలు, సత్కారాలు పొందిన గురువులు శ్రీ చింతా రామనాధం గారు 2005, మే 5వ తేదిన పరమపదించారు.
ఈ గ్రంథం విషయ వివరణ దృష్టితో చుస్తే కూచిపూడి నాట్య విషయ సర్వస్వం. కూచిపూడికీ సంబంధించిన సమాలోచిస్తే ఆధునిక కళాక్షేత్ర మహాత్మ్యం, నాట్య సంప్రదాయ వికాస దృష్టితో గమనిస్తే ఒక కళయొక్క సమగ్ర అభివృద్ధి వికాసం. ప్రక్రియాపరంగా సమీక్షిస్తే కూచిపూడి నాట్య సంప్రదాయ సంబంధులైన దేశి - మార్గ ప్రక్రియల సోదాహరణ చరిత్ర, కళాకారుల దుష్ట్యా భావిస్తే కూచిపూడి కళా వికాసానికి తోడ్పడిన, కృషి చేసిన ప్రయోక్తల పరిచయ సంచిక, వంశ వృక్షాలను గమనిస్తే ఇది ఒక ఐతిహాసికోద్యానవనం. మొత్తం గ్రంథం డాక్టర్ రామనాధంగారి కళాదర్శనం. ఈ గ్రంధాన్ని కధగా వ్రాసి ఉండవచ్చు. కొన్ని అంశాల చిత్రీకరణగా సంపుటీకరించి ఉండవచ్చు. నచ్చిన అంశాలలో పొగడుతూ, నచ్చని వాటిని తెగడుతూ ఆత్మాశ్రయంగా సాగించి ఉండవచ్చు. లేదా విషయ సామాగ్రి సంగ్రహంగా సంగ్రంధించి వుండవచ్చు. డాక్టర్ చింతా రామనాధంగారు శిల్పజ్ఞులైన రచయిత కాబట్టి, పైన పేర్కొన్న పాక్షిక విధానాల జోలికి పోకుండా ఒక నిండైన, ఇంపైన రచనను సంతరించారు. శాస్త్రీయతను మన్నించారు. విశ్లేషణను సాధించారు, వివేచనను వ్యక్తీకరించారు, సమన్వయాన్ని సంతరించారు చదివే వారికీ విసుగుపుట్టని, స్పష్టమైన, సరళమైన సరళిలో వ్యక్తీకరించారు. ఆధునికులైన పఠీతలకు అన్నివిధాల సంతృప్తిపరచే రచనను వెలయించారు. కూచిపూడి నాట్యంలోని అత్యంత ప్రాచీన దశలను ఎంత ప్రామాణికంగా చిత్రించారో తరువాతి పరిణామదశలను శ్రీ వేదాంతం లక్ష్మినారాయణశాస్త్రి, శ్రీ వెంపటి చినసత్యం, శ్రీ వేదాంతం సత్యనారాయణశర్మగారల ఆధునిక ప్రయోగాలను గురించి కూడా అంత నిబ్బరంతో నిర్వహించారు. భావనలో ప్రతిపాదనలో రామనాధంగారు ఒక సరితూకంతో కూడిన ఔచిత్యాన్ని రచనలో జీవింపజేశారు. - జి.వి. సుబ్రహ్మణ్యం చింతా రామనాధం (గ్రంధకర్త పరిచయం) : కూచిపూడి భాగవతులు కొన్ని వందల సంవత్సరాల నుండి కూచిపూడి నాట్య కళాజ్యోతులను ఆరనీయకుండా నేటివరకు ఆ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ వచ్చారు. వారి కృషి ఫలితంగా నేడు కూచిపూడి నాట్యం ప్రపంచ ప్రఖ్యాతి నొందింది. ఎందరో కూచిపూడి భాగవతులు తమ జీవితాలను నాట్యకళామతల్లికీ నైవేద్యమొనర్చి కళాజగత్తులో ధృవతారలుగా నిలిచిపోయారు. అలాంటి కుటుంబంలో జన్మించిన శ్రీ చింతా రామనాధంగారు తాతతండ్రుల మార్గంలోనే తన పయనాన్ని కొనసాగించారు. 1948వ సంవత్సరంలో సీతారావమ్మ, శ్రీ చింతా కృష్ణమూర్తి గార్లకు కూచిపూడి గడ్డపై జన్మించారు. వీరు ప్రాధమిక విద్యాభ్యాసం శ్రీ తూములూరి ఆంజనేయశాస్త్రిగారు, మహంకాళి లక్ష్మినరసింహశాస్త్రి గారి వద్ద అభ్యసించారు. నాట్య గురువులు, నృత్య వాచస్పతి శ్రీ వేదాంతం పార్వతీశం, ప్రపంచ పరమేష్టి శ్రీ వెంపటి చినసత్యం గార్ల వద్ద అచిరకాలంలోనే నాట్యవిద్యను ఔపోసన పట్టారు. తరువాత పరిశోధన దిశగా తన దృష్టిని సారించి గురువన్వేషణలో జాతీయాచార్యులు శ్రీ యస్వీ జోగారావు గారిని పరిశోధనా పర్యవేక్షకులుగా ఎంచుకొని, కూచిపూడి నాట్యరంగంలో మొట్టమొదటిగా 'కూచిపూడి యక్షగాన సాహిత్యము సంప్రదాయము ప్రయోగము' అనే సిద్దాంత గ్రంధాన్ని సమర్పించి 1979లో పిహెచ్.డి. పట్టాను పొందారు. ఓ వైపు 'భారతీయ విద్యాభవన్' హైదరాబాదులో నాట్య గురువుగా బాధ్యతలను నిర్వర్తిస్తూ, మరోవైపు రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. వీరి రచనలు కూచిపూడి నాట్యకళ, కూచిపూడి నృత్య మూర్తిత్రయం, కావ్య సౌరభాలు - భామాకలాపం, కూచిపూడి నాట్యభారతి, కూచిపూడి నాట్యచార్యులు చరిత్ర పుటలు, కూచిపూడి నాట్య విశిష్టత మొదలైనవి. 1996లో కూచిపూడి గ్రామంలోని 'శ్రీ సిద్దేంద్రయోగి కళాపీఠానికీ' ప్రధాన ఉపాధ్యాయులుగా బాధ్యతలను స్వీకరించి, దాని అభివృద్ధికీ ఎంతగానో పాటుపడ్డారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో అంతర్భాగమైన కళాపీటం అప్పటి ఉపాధ్యక్షుల సహకారంతో నూతన భవన నిర్మాణానికి అహర్నిశలు శ్రమించారు. ఆ శ్రమ ఫలితమే నేడు కూచిపూడి గ్రామంలో అతి సుందరమైన, విశాలమైన భవనం నిర్మించబడటం అందుకు నిదర్శనం. ఎందరో శిష్యులు తీర్చిదిద్ది దేశం నలుమూలలా పండిత పామర జనరంజకంగా ప్రదర్శనలిచ్చి, ఎన్నో సన్మానాలు, సత్కారాలు పొందిన గురువులు శ్రీ చింతా రామనాధం గారు 2005, మే 5వ తేదిన పరమపదించారు.© 2017,www.logili.com All Rights Reserved.