ఐదు మహా సముద్రాల మధ్య నున్న ఆరు భూ ఖండాలు, వేలాది ద్విపాలలో జీవిస్తున్న 700 కోట్ల జనాభా 190 పై చిలుకు దేశాల నేర్పరచుకున్నారు. వీటిలో కొన్ని దేశాలు కొన్ని శతాబ్దాలక్రితమే ఏర్పడగా, మరి కొన్ని దేశాలు గత రెండు దశాబ్దాలలోనే ఏర్పడ్డాయి. అధికశాతం ప్రజాస్వామ్య దేశాలుగా చెలామణి అవుతున్నాయి. కొన్ని దేశాలను కమ్యునిస్టు ప్రభుత్వాలు పరిపాలిస్తుండగా కొన్నింటిని నియంతలు దశాబ్దాలుగా పాలిస్తున్నారు. కొన్ని దేశాలలో అధ్యక్షపాలన ఉండగా, మరికొన్ని దేశాలలో ప్రధానమంత్రి రాజకీయ అధికారాన్ని కలిగి ఉన్నారు. కొన్ని దేశాలలో సైన్యమే ప్రభుత్వాన్ని నిర్వహిస్తుండగా మిగతా దేశాలలో ప్రభుత్వాలే సైన్యాన్ని నిర్వహిస్తున్నాయి.
వైవిధ్యమయిన పాలనా నిర్మాణాలు, ప్రజాస్వామ్య నిర్మాణంలోనే రకరకాల పద్ధతులు, పార్లమెంట్ సభ్యులను ఎన్నుకునే పరిపరివిధానాలు, విభిన్నమయిన న్యాయ వ్యవస్థలు, ప్రభుత్వ పాలనా రీతులలో తేడాలు, కాలానుసారం మారుతున్న ప్రభుత్వ నిర్మాణాలు రాజనీతి శాస్త్రజ్ఞులకు నిత్యం పరిశీలించాల్సిన విషయాలయ్యాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ దేశాలలోని ప్రభుత్వ నిర్మాణ పాలనా వ్యవస్థలను సరళతరంగా తెలుగులో అందించాలనే సంకల్పంతో ఈ గ్రంథ రచన జరిగింది.
- దగ్గుబాటి వెంకటేశ్వరరావు
ఐదు మహా సముద్రాల మధ్య నున్న ఆరు భూ ఖండాలు, వేలాది ద్విపాలలో జీవిస్తున్న 700 కోట్ల జనాభా 190 పై చిలుకు దేశాల నేర్పరచుకున్నారు. వీటిలో కొన్ని దేశాలు కొన్ని శతాబ్దాలక్రితమే ఏర్పడగా, మరి కొన్ని దేశాలు గత రెండు దశాబ్దాలలోనే ఏర్పడ్డాయి. అధికశాతం ప్రజాస్వామ్య దేశాలుగా చెలామణి అవుతున్నాయి. కొన్ని దేశాలను కమ్యునిస్టు ప్రభుత్వాలు పరిపాలిస్తుండగా కొన్నింటిని నియంతలు దశాబ్దాలుగా పాలిస్తున్నారు. కొన్ని దేశాలలో అధ్యక్షపాలన ఉండగా, మరికొన్ని దేశాలలో ప్రధానమంత్రి రాజకీయ అధికారాన్ని కలిగి ఉన్నారు. కొన్ని దేశాలలో సైన్యమే ప్రభుత్వాన్ని నిర్వహిస్తుండగా మిగతా దేశాలలో ప్రభుత్వాలే సైన్యాన్ని నిర్వహిస్తున్నాయి. వైవిధ్యమయిన పాలనా నిర్మాణాలు, ప్రజాస్వామ్య నిర్మాణంలోనే రకరకాల పద్ధతులు, పార్లమెంట్ సభ్యులను ఎన్నుకునే పరిపరివిధానాలు, విభిన్నమయిన న్యాయ వ్యవస్థలు, ప్రభుత్వ పాలనా రీతులలో తేడాలు, కాలానుసారం మారుతున్న ప్రభుత్వ నిర్మాణాలు రాజనీతి శాస్త్రజ్ఞులకు నిత్యం పరిశీలించాల్సిన విషయాలయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ దేశాలలోని ప్రభుత్వ నిర్మాణ పాలనా వ్యవస్థలను సరళతరంగా తెలుగులో అందించాలనే సంకల్పంతో ఈ గ్రంథ రచన జరిగింది. - దగ్గుబాటి వెంకటేశ్వరరావు
© 2017,www.logili.com All Rights Reserved.