"ఎవడ్రా నువ్వు?"
"ఎంకడ్ని సార్"
"ఇక్కడికేందుకోచ్చావు?"
"ఆ సోక్కలు, ఆ బట్టలు ఆయన్నీ మీవా సార్?"
"అవున్రా, ఈ కొట్టు మాదే"
"సార్ సార్! ఆ బొమ్మల చొక్కా కూడా తీసుకుపోతున్నారా సార్" ఆ మాట అడుగుతుంటే వెంకడి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. వాడి గొంతు బొంగురు పోయింది.
"ఏం అలా అడుగుతున్నావు?" ఇద్దరిలో చిన్నవాడు ప్రశ్నించాడు.
వెంకడు, తను ఆ చొక్కా కొనుక్కోడం కోసం నెలల తరబడి డబ్బు కూడబెట్టిన సంగతి చెప్పాడు.
............
............
పోలీసు స్టేషన్లో లాటీ దెబ్బలు తింటున్న వెంకడి ఎముకలు పటపట విరగ సాగాయి. కాలువ నీటిలో పడ్డ చవుకబారు బొమ్మల చొక్కా రంగులు కరిగి ఆ మురుగు నీటితో మురికివాడాంత పారసాగాయి.
'ఈ రోజుల్లో దేన్నీ, ఎవర్నీ నమ్మడానికి లేదు. అంతా మోసం... అన్నీ మోసం అనుకున్నాడు' ఆ దారినే పోతున్న అమాయకుడు ఒకడు ఆ రంగుల్ని చూసి.
-(బొమ్మల చొక్కా కధ నుంచి)
తెలుగు సాహిత్య ప్రపంచంలో ద్వివేదుల విశాలాక్షి సముచిత స్థానం ఉంది. వీరు ఎన్నో ప్రసిద్ధ కధలు, నవలలు రచించారు. వీరు రచించిన కధల సంపుటే ఈ పుస్తకం.
"ఎవడ్రా నువ్వు?" "ఎంకడ్ని సార్" "ఇక్కడికేందుకోచ్చావు?" "ఆ సోక్కలు, ఆ బట్టలు ఆయన్నీ మీవా సార్?" "అవున్రా, ఈ కొట్టు మాదే" "సార్ సార్! ఆ బొమ్మల చొక్కా కూడా తీసుకుపోతున్నారా సార్" ఆ మాట అడుగుతుంటే వెంకడి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. వాడి గొంతు బొంగురు పోయింది. "ఏం అలా అడుగుతున్నావు?" ఇద్దరిలో చిన్నవాడు ప్రశ్నించాడు. వెంకడు, తను ఆ చొక్కా కొనుక్కోడం కోసం నెలల తరబడి డబ్బు కూడబెట్టిన సంగతి చెప్పాడు. ............ ............ పోలీసు స్టేషన్లో లాటీ దెబ్బలు తింటున్న వెంకడి ఎముకలు పటపట విరగ సాగాయి. కాలువ నీటిలో పడ్డ చవుకబారు బొమ్మల చొక్కా రంగులు కరిగి ఆ మురుగు నీటితో మురికివాడాంత పారసాగాయి. 'ఈ రోజుల్లో దేన్నీ, ఎవర్నీ నమ్మడానికి లేదు. అంతా మోసం... అన్నీ మోసం అనుకున్నాడు' ఆ దారినే పోతున్న అమాయకుడు ఒకడు ఆ రంగుల్ని చూసి. -(బొమ్మల చొక్కా కధ నుంచి) తెలుగు సాహిత్య ప్రపంచంలో ద్వివేదుల విశాలాక్షి సముచిత స్థానం ఉంది. వీరు ఎన్నో ప్రసిద్ధ కధలు, నవలలు రచించారు. వీరు రచించిన కధల సంపుటే ఈ పుస్తకం.© 2017,www.logili.com All Rights Reserved.