"ఇక నావల్లకాదు వాత్సవసాబ్. ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను. చచ్చి మీ కడుపున పుడతాను సాబ్. నన్నోదిలేయండి."
ఆ మాటలు అంటూనే ఇక ఆ కొండగుట్ట ఎక్కలేక పక్కనే వున్న దేవదారు చెట్టు మొదట్లో అలాగే కూలబడిపోయాడు హకీంభాయ్.
అప్పటికి కొన్ని అడుగుల దూరంలో ముందు పోతున్నాడు వాత్సవ. హకీం పలుకులు వినగానే అక్కడే ఆగి తిరిగి చూశాడు.
హకీం అంతగా బాధపడుతున్నాడంటే అందులో ఆశ్చర్యపోవలసిందేమీ లేదు. ఒకపక్క కడుపును మెలిపెట్టే ఆకలి, మరోపక్క పిక్కుపోతున్న కాళ్ళు, నడిచి నడిచి ఎగవూపిరి దిగవూపిరిగా వుంది పరిస్థితి. పైన చుస్తే చండ్రనిప్పులు కురిపిస్తున్న సూర్యుడు. చెమటకు తడిసి ముద్దయిపోయాయి బట్టలు.
నిజానికి వాత్సవ పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీలేదు. అయినా పట్టుదల అతడ్ని ముందుకు సాగనిస్తోంది. హకీం మొండికేయటంతో తాత్కాలికంగా ఆ కొండగుట్ట ఎక్కే ప్రయత్నం విరమించుకొని వచ్చి చెట్టు నీడన హకీం దగ్గరలో భైఠాయించిన తన వాటర్ బాటిల్ వాడికి అందించి సిగరెట్ ముట్టించుకున్నాడు వాత్సవ.
వాళ్ళిద్దరూ వున్నది సాధారణ ప్రదేశం కాదు. చిక్కటి అడవులు, దట్టమైన లోయలు, క్రూరమృగాలకు నిలయమైన మణిపూర్ అడవుల లోతట్టు ప్రాంతం.
ఎటు చూసినా అడవి.
అడవితప్ప అక్కడ మరేమీ కన్పించటంలేదు.
హకీంతో కలిసి వాత్సవ ఆ అడవుల్లో అడుగుపెట్టి నాలుగురోజులయింది. రెండు రోజులక్రితమే జిప్ కీ' గుడ్ బై చెప్పక తప్పలేదు. కాలినడకన గొలుసు కొండల దిశగా సాగుతోంది వారి ప్రయాణం.
వారి ప్రయాణం ఆ అడవి ప్రాంతంలో ఎంతవరకూ కొనసాగుతోందో తెలుసుకోవాలంటే చదవండి ఆసక్తికరమైన నవల "ఘర్షణ".
"ఇక నావల్లకాదు వాత్సవసాబ్. ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను. చచ్చి మీ కడుపున పుడతాను సాబ్. నన్నోదిలేయండి." ఆ మాటలు అంటూనే ఇక ఆ కొండగుట్ట ఎక్కలేక పక్కనే వున్న దేవదారు చెట్టు మొదట్లో అలాగే కూలబడిపోయాడు హకీంభాయ్. అప్పటికి కొన్ని అడుగుల దూరంలో ముందు పోతున్నాడు వాత్సవ. హకీం పలుకులు వినగానే అక్కడే ఆగి తిరిగి చూశాడు. హకీం అంతగా బాధపడుతున్నాడంటే అందులో ఆశ్చర్యపోవలసిందేమీ లేదు. ఒకపక్క కడుపును మెలిపెట్టే ఆకలి, మరోపక్క పిక్కుపోతున్న కాళ్ళు, నడిచి నడిచి ఎగవూపిరి దిగవూపిరిగా వుంది పరిస్థితి. పైన చుస్తే చండ్రనిప్పులు కురిపిస్తున్న సూర్యుడు. చెమటకు తడిసి ముద్దయిపోయాయి బట్టలు. నిజానికి వాత్సవ పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీలేదు. అయినా పట్టుదల అతడ్ని ముందుకు సాగనిస్తోంది. హకీం మొండికేయటంతో తాత్కాలికంగా ఆ కొండగుట్ట ఎక్కే ప్రయత్నం విరమించుకొని వచ్చి చెట్టు నీడన హకీం దగ్గరలో భైఠాయించిన తన వాటర్ బాటిల్ వాడికి అందించి సిగరెట్ ముట్టించుకున్నాడు వాత్సవ. వాళ్ళిద్దరూ వున్నది సాధారణ ప్రదేశం కాదు. చిక్కటి అడవులు, దట్టమైన లోయలు, క్రూరమృగాలకు నిలయమైన మణిపూర్ అడవుల లోతట్టు ప్రాంతం. ఎటు చూసినా అడవి. అడవితప్ప అక్కడ మరేమీ కన్పించటంలేదు. హకీంతో కలిసి వాత్సవ ఆ అడవుల్లో అడుగుపెట్టి నాలుగురోజులయింది. రెండు రోజులక్రితమే జిప్ కీ' గుడ్ బై చెప్పక తప్పలేదు. కాలినడకన గొలుసు కొండల దిశగా సాగుతోంది వారి ప్రయాణం. వారి ప్రయాణం ఆ అడవి ప్రాంతంలో ఎంతవరకూ కొనసాగుతోందో తెలుసుకోవాలంటే చదవండి ఆసక్తికరమైన నవల "ఘర్షణ".
© 2017,www.logili.com All Rights Reserved.