గిడుగు వెంకటరామమూర్తి (12.08.1863 - 22.01.1940) గిడుగు పిడుగుగా ప్రసిధ్ధులు. రావుబహదూర్ బిరుదాంచితులు. వ్యావహారిక భాషోద్యమ పితామహులు. గత శతాబ్దంలో తెలుగుభాష ఆధునికీకరణ ప్రక్రియలో అగ్రగాములు. సంప్రదాయ గ్రాంధికవాద పండితులవాదంలోని డొల్లతనాన్నీ, వారి గ్రంధాలలోని లక్షణ విరుద్ధప్రయోగాలనూ ఎండగట్టిన పండితుడు. తెలుగుభాషకు అపారమైన సేవచేసిన మహానుభావుడు.
తెలుగులో తొలి ఆధునిక భాషాశాస్త్రవేత్తగా చెప్పుకోదగిన గిడుగు రామమూర్తిగారు సవరభాషకు చేసిన సేవ ఎనలేనిది. ఆంధ్రపండిత భిషక్కులభాషా భేషజము, బాలకవిశరణ్యము, సవర - ఇంగ్లీషు నిఘంటువు, సవర రీడర్లు, ఎ మేమురాండమ్ ఆన్ మోడ్నర్ తెలుగు, ఎ మాన్యువల్ ఆఫ్ సవర లాంగ్వేజ్, సూర్యరాయాంధ్ర నిఘంటు విమర్శనము, గద్యచింతామణి మొదలైనవి గిడుగువారి మఖ్యమైన రచనలు.
గిడుగు రామమూర్తిగారు ఎంతో కష్టించి సవరభాష నేర్చుకున్నారు. సవరల అభివృద్ధి కోసం కృషిచేశారు. 1900 కు ముందే సవరకోసం బడులు పెట్టారు. సవర భాషకు తాను చేసిన కృషికి ప్రభుత్వం బహుమానమిస్తామంటే ఆ సవరలకోసం బడులు పెట్టండి అదే నాకు బహుమానమన్న వ్యక్తీ ఆయన.
ఈ కధల్లో కొన్ని కొన్ని పంచతంత్ర కధలు వున్నవి.
- గిడుగు వెంకట రామమూర్తి
గిడుగు వెంకటరామమూర్తి (12.08.1863 - 22.01.1940) గిడుగు పిడుగుగా ప్రసిధ్ధులు. రావుబహదూర్ బిరుదాంచితులు. వ్యావహారిక భాషోద్యమ పితామహులు. గత శతాబ్దంలో తెలుగుభాష ఆధునికీకరణ ప్రక్రియలో అగ్రగాములు. సంప్రదాయ గ్రాంధికవాద పండితులవాదంలోని డొల్లతనాన్నీ, వారి గ్రంధాలలోని లక్షణ విరుద్ధప్రయోగాలనూ ఎండగట్టిన పండితుడు. తెలుగుభాషకు అపారమైన సేవచేసిన మహానుభావుడు. తెలుగులో తొలి ఆధునిక భాషాశాస్త్రవేత్తగా చెప్పుకోదగిన గిడుగు రామమూర్తిగారు సవరభాషకు చేసిన సేవ ఎనలేనిది. ఆంధ్రపండిత భిషక్కులభాషా భేషజము, బాలకవిశరణ్యము, సవర - ఇంగ్లీషు నిఘంటువు, సవర రీడర్లు, ఎ మేమురాండమ్ ఆన్ మోడ్నర్ తెలుగు, ఎ మాన్యువల్ ఆఫ్ సవర లాంగ్వేజ్, సూర్యరాయాంధ్ర నిఘంటు విమర్శనము, గద్యచింతామణి మొదలైనవి గిడుగువారి మఖ్యమైన రచనలు. గిడుగు రామమూర్తిగారు ఎంతో కష్టించి సవరభాష నేర్చుకున్నారు. సవరల అభివృద్ధి కోసం కృషిచేశారు. 1900 కు ముందే సవరకోసం బడులు పెట్టారు. సవర భాషకు తాను చేసిన కృషికి ప్రభుత్వం బహుమానమిస్తామంటే ఆ సవరలకోసం బడులు పెట్టండి అదే నాకు బహుమానమన్న వ్యక్తీ ఆయన. ఈ కధల్లో కొన్ని కొన్ని పంచతంత్ర కధలు వున్నవి. - గిడుగు వెంకట రామమూర్తి© 2017,www.logili.com All Rights Reserved.