పురాణం బ్రహ్మ సమ్మితం అని భాగవతం చెబుతుంది. పురాణాలు వేద తుల్యాలు. సర్వశ్రేయస్సులు పురాణాలవల్ల లభిస్తాయి. అజ్ఞానాంధకారం తొలిగించే దీప కణిక పురాణం. భవరోగాలకు దివ్యౌషధం. మానవ జీవన విధానానికి దిక్సూచి. వేదాలు పురాణాలు అనాదులే. వేదాల ఆనుపూర్వి మారదు. పురాణాల ఆనుపుర్విలో అక్కడక్కడ మార్పులుంటాయి. ఇతిహాస పురాణాలతో వేదర్ధానికి పుష్టి కలుగుతుంది.
పురాణాలు అతి విస్తృతాలు - అనంత విషయ గర్భితాలు. వేదాలు ప్రభుసమ్మితంగా ఆజ్ఞాపిస్తాయి. పురాణాలు మిత్ర సమ్మితంగా సోదాహరణంగా విషయాన్ని విశదపరుస్తాయి. పురాణాలలో సృష్టిప్రళయాదులు ఖగోళ భూగోళాది విజ్ఞాన విషయాలు నీతిమంతమైన జీవన విధానం, వ్యవహారశైలి, పురుషార్ధ ప్రాప్తి సాధనాలు. భగవద్విభూతి మొదలైన ఎన్నో విషయాలు నిక్షిప్తమై ఉన్నాయి.
"సర్వేషాం శ్రేయసాం బీజం సత్కధా శ్రవణం నృణామ్"
సంస్కృత భాషలో రచింపబడిన పురాణాలు ఈనాటి సమాజానికి అంతగా అందుబాటులో లేవు. వాటి సారాన్ని సరళమైన తెలుగులో జన సామాన్యానికి అందించే ప్రయత్నమే ఈ గ్రంధాలు. సువిశాలమైన పురాణ సారస్వతాన్ని సంగ్రహంగా చెప్పడం అంత తేలిక పని కాదు. పాఠకుల సౌకర్యం మనసులో ఉంచుకొని ఈ గ్రంథ రచన సాగింది. ప్రధానంగా కధలను చెబుతూ కేవలం కధలకే పరిమితం కాకుండా అనేక దేవతా స్తుతులను యధాతధంగా అందించడం ఈ గ్రంథం ప్రత్యేకత. రచనాశైలి సరళం, సుబోధకం.
- విశ్వనాధ గోపాలకృష్ణశాస్త్రి.
అచతుర్వదనోబ్రహ్మా ద్విబాహు పరపో హరి
అఫాల లోచన శ్శంభు భగవాన్ బాదరాయణ
అని వ్యాసమహర్షిని త్రిమూర్తి స్వరూపంగా మహర్షులు స్తుతించారు. శ్రీమహావిష్ణువు తన నాలుగు చేతులతో ధర్మార్ధ కామ మొక్షాలనే పురుషార్ధాలను ప్రసాదిస్తే అపర విష్ణువు స్వరూపుడయిన వ్యాసుడు రెండు చేతులతోనే భాగవత, అష్టాదశ పురాణాలను రచించి, పాఠకులకు చతుర్విధ పురుషార్ధాలను ప్రసాదించాడు.
పరమాత్ముడయిన శివుడు తన మూడవ నేత్రంతో భక్తుల పాపాలను భస్మం చేస్తూ ఉంటే వ్యాసుడు తన పురాణాల ద్వారా భక్తుల పాపాలను దహింపచేస్తున్నాడు.
బ్రహ్మ సృష్టించిన నాలుగు వేదాలలోని ధర్మాలను వ్యాసుడు పురాణాలలో నిక్షిప్తం చేసాడు. ఈ విధంగా వ్యాస మహర్షి త్రిమూర్తి స్వరూపుడయి విరాజిల్లుచున్నాడు.
ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క పరమాత్మ తత్వాన్ని ప్రతిపాదించినా, భక్తజన రక్షణే ఆ గ్రంధాల ప్రధాన లక్ష్యం.
సంస్కృత సాహిత్యంలో విస్తృతంగా ఉన్న పురాణ వాజ్మయాన్ని చి.డా. పి.వి. మురళీకృష్ణ, సంగ్రహించి సరళ శైలిలో తెలుగు పాఠకులకు అందించడానికి చేసిన ప్రయత్నం అభినందనీయం. "పురాణంలోని ఒక్క శ్లోకాన్ని చదివినా ఆ పురాణం అంతా చదివిన ఫలితం లభిస్తుందని పండితుల అభిప్రాయం. ఈ గ్రంథం కధాభాగంతో బాటుగా ఆయాయా సందర్బాలలో వచ్చి స్తుతులను ఉటంకించడం వలన పాఠకులకి ఆ పురాణం చదివిన ఫలితం దక్కుతుంది. గ్రంథ రచనలో రచయిత చేసిన ఈ ప్రయత్నం ముదావహం.
- ప్రో. జ్యోసుల సూర్యప్రకాశరావు
అష్టాదశ పురాణములు అనే ఈ పుస్తకాలు మూడుపుస్తకముల సంపుటి.
ప్రధమ సంపుటములో: శ్రీస్కాందపురాణము, శ్రీభాగవతపురాణము, శ్రీబ్రహ్మాండపురాణము.
ద్వితీయ సంపుటములో: శివపురాణము, లింగపురాణము, పద్మపురాణము, బ్రహ్మవైవర్త పురాణము, వామన పురాణము, భవిష్య పురాణము గురించి సరళమైన భాషలో తెలియజేశారు.
తృతీయ సంపుటములో: బ్రహ్మపురాణము, విష్ణుపురాణము, నారద పురాణము, అగ్నిపురాణము, మార్కండేయపురాణము, మత్స్య పురాణము, కుర్మపురాణము, వరాహపురాణము, గరుడపురాణముల గురించి చాలా చక్కగా వివరించారు.
పురాణం బ్రహ్మ సమ్మితం అని భాగవతం చెబుతుంది. పురాణాలు వేద తుల్యాలు. సర్వశ్రేయస్సులు పురాణాలవల్ల లభిస్తాయి. అజ్ఞానాంధకారం తొలిగించే దీప కణిక పురాణం. భవరోగాలకు దివ్యౌషధం. మానవ జీవన విధానానికి దిక్సూచి. వేదాలు పురాణాలు అనాదులే. వేదాల ఆనుపూర్వి మారదు. పురాణాల ఆనుపుర్విలో అక్కడక్కడ మార్పులుంటాయి. ఇతిహాస పురాణాలతో వేదర్ధానికి పుష్టి కలుగుతుంది. పురాణాలు అతి విస్తృతాలు - అనంత విషయ గర్భితాలు. వేదాలు ప్రభుసమ్మితంగా ఆజ్ఞాపిస్తాయి. పురాణాలు మిత్ర సమ్మితంగా సోదాహరణంగా విషయాన్ని విశదపరుస్తాయి. పురాణాలలో సృష్టిప్రళయాదులు ఖగోళ భూగోళాది విజ్ఞాన విషయాలు నీతిమంతమైన జీవన విధానం, వ్యవహారశైలి, పురుషార్ధ ప్రాప్తి సాధనాలు. భగవద్విభూతి మొదలైన ఎన్నో విషయాలు నిక్షిప్తమై ఉన్నాయి. "సర్వేషాం శ్రేయసాం బీజం సత్కధా శ్రవణం నృణామ్" సంస్కృత భాషలో రచింపబడిన పురాణాలు ఈనాటి సమాజానికి అంతగా అందుబాటులో లేవు. వాటి సారాన్ని సరళమైన తెలుగులో జన సామాన్యానికి అందించే ప్రయత్నమే ఈ గ్రంధాలు. సువిశాలమైన పురాణ సారస్వతాన్ని సంగ్రహంగా చెప్పడం అంత తేలిక పని కాదు. పాఠకుల సౌకర్యం మనసులో ఉంచుకొని ఈ గ్రంథ రచన సాగింది. ప్రధానంగా కధలను చెబుతూ కేవలం కధలకే పరిమితం కాకుండా అనేక దేవతా స్తుతులను యధాతధంగా అందించడం ఈ గ్రంథం ప్రత్యేకత. రచనాశైలి సరళం, సుబోధకం. - విశ్వనాధ గోపాలకృష్ణశాస్త్రి. అచతుర్వదనోబ్రహ్మా ద్విబాహు పరపో హరి అఫాల లోచన శ్శంభు భగవాన్ బాదరాయణ అని వ్యాసమహర్షిని త్రిమూర్తి స్వరూపంగా మహర్షులు స్తుతించారు. శ్రీమహావిష్ణువు తన నాలుగు చేతులతో ధర్మార్ధ కామ మొక్షాలనే పురుషార్ధాలను ప్రసాదిస్తే అపర విష్ణువు స్వరూపుడయిన వ్యాసుడు రెండు చేతులతోనే భాగవత, అష్టాదశ పురాణాలను రచించి, పాఠకులకు చతుర్విధ పురుషార్ధాలను ప్రసాదించాడు. పరమాత్ముడయిన శివుడు తన మూడవ నేత్రంతో భక్తుల పాపాలను భస్మం చేస్తూ ఉంటే వ్యాసుడు తన పురాణాల ద్వారా భక్తుల పాపాలను దహింపచేస్తున్నాడు. బ్రహ్మ సృష్టించిన నాలుగు వేదాలలోని ధర్మాలను వ్యాసుడు పురాణాలలో నిక్షిప్తం చేసాడు. ఈ విధంగా వ్యాస మహర్షి త్రిమూర్తి స్వరూపుడయి విరాజిల్లుచున్నాడు. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క పరమాత్మ తత్వాన్ని ప్రతిపాదించినా, భక్తజన రక్షణే ఆ గ్రంధాల ప్రధాన లక్ష్యం. సంస్కృత సాహిత్యంలో విస్తృతంగా ఉన్న పురాణ వాజ్మయాన్ని చి.డా. పి.వి. మురళీకృష్ణ, సంగ్రహించి సరళ శైలిలో తెలుగు పాఠకులకు అందించడానికి చేసిన ప్రయత్నం అభినందనీయం. "పురాణంలోని ఒక్క శ్లోకాన్ని చదివినా ఆ పురాణం అంతా చదివిన ఫలితం లభిస్తుందని పండితుల అభిప్రాయం. ఈ గ్రంథం కధాభాగంతో బాటుగా ఆయాయా సందర్బాలలో వచ్చి స్తుతులను ఉటంకించడం వలన పాఠకులకి ఆ పురాణం చదివిన ఫలితం దక్కుతుంది. గ్రంథ రచనలో రచయిత చేసిన ఈ ప్రయత్నం ముదావహం. - ప్రో. జ్యోసుల సూర్యప్రకాశరావు అష్టాదశ పురాణములు అనే ఈ పుస్తకాలు మూడుపుస్తకముల సంపుటి. ప్రధమ సంపుటములో: శ్రీస్కాందపురాణము, శ్రీభాగవతపురాణము, శ్రీబ్రహ్మాండపురాణము. ద్వితీయ సంపుటములో: శివపురాణము, లింగపురాణము, పద్మపురాణము, బ్రహ్మవైవర్త పురాణము, వామన పురాణము, భవిష్య పురాణము గురించి సరళమైన భాషలో తెలియజేశారు. తృతీయ సంపుటములో: బ్రహ్మపురాణము, విష్ణుపురాణము, నారద పురాణము, అగ్నిపురాణము, మార్కండేయపురాణము, మత్స్య పురాణము, కుర్మపురాణము, వరాహపురాణము, గరుడపురాణముల గురించి చాలా చక్కగా వివరించారు.© 2017,www.logili.com All Rights Reserved.