నిద్రలేచింది మొదలు పడుకోబోయే వరకు రకరకాల కట్టుబాట్లు - అలవాట్లు - ఆచార సంప్రదాయాలను, నీతిని, ధర్మాన్ని శాస్త్రం నిర్దేశించింది. చంచలమైన మనస్సును మన చెప్పచేతల్లో ఉండేలా చేయడమే వీటిలోని ఉద్దేశ్యం. ప్రతినిత్యం ఆచార సంప్రదాయాలను పాటించడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ఏడాదిలో కనీసం కొద్దిరోజులైనా సంప్రదాయకంగా, సత్ప్రవర్తనతో నడచుకుంటూ, తోటివారికి సహాయపడేలా, పదిమందితో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా గడపాలని, మతసామరస్యంతో మెలగాలని, సంఘజీవనంలోని ఆనందాన్ని అనుభవించాలని, పెళ్లి చేసుకుని ఏనాడో అత్తారింటికీ వెళ్లిపోయిన ఆడపడచులను అప్పుడప్పుడు పుట్టింటికి పిలవాలని, కుటుంబజీవనంలోని మాధుర్యాన్ని అనుభవించాలని పెద్దలు వివిధ తరతరాల హిందూ సంప్రదాయ పండుగలు, పర్వదినాలు, నోములు, వ్రతాలను నిర్దేశించారు. అయితే ఆయా ఆచార వ్యవహారాలను పాటించే సందర్భంలో కొన్ని సందేహాలు తలెత్తవచ్చు లేదా అసలు వాటిని ఎలా అనుసరించాలో తెలియకపోవచ్చు.తరతరాల హిందూ సంప్రదాయ వేడుకలు తెలియకపోవచ్చు. అటువంటి అనుమానాలను నివృత్తి చేసుకోవాలనుకున్నవారికి, ఆయా ఆచార సంప్రదాయాలను తెలుసుకోవాలనుకున్న వారికి ఈ పుస్తకం కొంత్తెనా సాయపడుతుందని విశ్వసిస్తున్నాను.
ఈ పుస్తకంలో శ్లోకములు, బారసాల సందర్భమున జరుపు వేడుకలు, ముదిమనవ సంతానము అయితే, బొమ్మల కొలువు, భోగి పండ్లు, గొబ్బెమ్మలు, ఓణిలు, పంచెలు ఇచ్చినపుడు జరపవలసినది, పుష్పవతి వేడుకలు, నిశ్చయ తాంబూలం, పసుపు కొట్టుట, వెంకటేశ్వర స్వామికి ఎదురు నడుచుట, పెండ్లికూతుర్ని,పెండ్లికొడుకును చేయుట, పెండ్లి పెట్టె, ఒడికట్టు బియ్యం, తలంబ్రాల బియ్యం, మంగళ సూత్రం, వరపూజ, వివాహముకు కావలసినవి, అప్పగింతలు, గృహప్రవేశం, వ్రతాలు, గర్భము వచ్చినప్పుడు, శంకుస్థాపన, పండగలు గురించి, అన్ని సందర్భాల్లో పడవలసిన పాటలు, వివిధ రకాల పచళ్ళు గురించి, చిట్కాలు, ఇంకా అనేక విషయాలను ఈ పుస్తకాన్ని ఆచరించటం ద్వారా మీరు తెలుసుకోవచ్చు.
1. మణిద్వీప వర్ణన
2. ప్రార్ధన శ్లోకములు
3. గోవు పాట
4. వివిధ గాయత్రీ మంత్రములు
5. శ్రీ ఆదిత్య హృదయ సోత్రం
6. నిత్య సోత్ర రత్నావళి
7. హిందూ సాంప్రదాయ వేడుకలు
8. నోములు
9. పాటలు
10. గొబ్బిళ్ళ పాటలు
11. పచళ్ళు
ఈ పుస్తకంలో తరతరాల హిందూ సంప్రాదాయా వేడుకలు తెలుసుకోవచ్చు. వాటిని ఆచరించవచ్చు. ఆచరించటం ద్వారా, మన సాంప్రదాయ విలువల్ని తరతరాలు పాటించవచ్చు. మన హిందూ సంప్రాదాయాలు కాపాడుకోవచ్చు.
- గొల్లపూడి
నిద్రలేచింది మొదలు పడుకోబోయే వరకు రకరకాల కట్టుబాట్లు - అలవాట్లు - ఆచార సంప్రదాయాలను, నీతిని, ధర్మాన్ని శాస్త్రం నిర్దేశించింది. చంచలమైన మనస్సును మన చెప్పచేతల్లో ఉండేలా చేయడమే వీటిలోని ఉద్దేశ్యం. ప్రతినిత్యం ఆచార సంప్రదాయాలను పాటించడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ఏడాదిలో కనీసం కొద్దిరోజులైనా సంప్రదాయకంగా, సత్ప్రవర్తనతో నడచుకుంటూ, తోటివారికి సహాయపడేలా, పదిమందితో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా గడపాలని, మతసామరస్యంతో మెలగాలని, సంఘజీవనంలోని ఆనందాన్ని అనుభవించాలని, పెళ్లి చేసుకుని ఏనాడో అత్తారింటికీ వెళ్లిపోయిన ఆడపడచులను అప్పుడప్పుడు పుట్టింటికి పిలవాలని, కుటుంబజీవనంలోని మాధుర్యాన్ని అనుభవించాలని పెద్దలు వివిధ తరతరాల హిందూ సంప్రదాయ పండుగలు, పర్వదినాలు, నోములు, వ్రతాలను నిర్దేశించారు. అయితే ఆయా ఆచార వ్యవహారాలను పాటించే సందర్భంలో కొన్ని సందేహాలు తలెత్తవచ్చు లేదా అసలు వాటిని ఎలా అనుసరించాలో తెలియకపోవచ్చు.తరతరాల హిందూ సంప్రదాయ వేడుకలు తెలియకపోవచ్చు. అటువంటి అనుమానాలను నివృత్తి చేసుకోవాలనుకున్నవారికి, ఆయా ఆచార సంప్రదాయాలను తెలుసుకోవాలనుకున్న వారికి ఈ పుస్తకం కొంత్తెనా సాయపడుతుందని విశ్వసిస్తున్నాను. ఈ పుస్తకంలో శ్లోకములు, బారసాల సందర్భమున జరుపు వేడుకలు, ముదిమనవ సంతానము అయితే, బొమ్మల కొలువు, భోగి పండ్లు, గొబ్బెమ్మలు, ఓణిలు, పంచెలు ఇచ్చినపుడు జరపవలసినది, పుష్పవతి వేడుకలు, నిశ్చయ తాంబూలం, పసుపు కొట్టుట, వెంకటేశ్వర స్వామికి ఎదురు నడుచుట, పెండ్లికూతుర్ని,పెండ్లికొడుకును చేయుట, పెండ్లి పెట్టె, ఒడికట్టు బియ్యం, తలంబ్రాల బియ్యం, మంగళ సూత్రం, వరపూజ, వివాహముకు కావలసినవి, అప్పగింతలు, గృహప్రవేశం, వ్రతాలు, గర్భము వచ్చినప్పుడు, శంకుస్థాపన, పండగలు గురించి, అన్ని సందర్భాల్లో పడవలసిన పాటలు, వివిధ రకాల పచళ్ళు గురించి, చిట్కాలు, ఇంకా అనేక విషయాలను ఈ పుస్తకాన్ని ఆచరించటం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. 1. మణిద్వీప వర్ణన 2. ప్రార్ధన శ్లోకములు 3. గోవు పాట 4. వివిధ గాయత్రీ మంత్రములు 5. శ్రీ ఆదిత్య హృదయ సోత్రం 6. నిత్య సోత్ర రత్నావళి 7. హిందూ సాంప్రదాయ వేడుకలు 8. నోములు 9. పాటలు 10. గొబ్బిళ్ళ పాటలు 11. పచళ్ళు ఈ పుస్తకంలో తరతరాల హిందూ సంప్రాదాయా వేడుకలు తెలుసుకోవచ్చు. వాటిని ఆచరించవచ్చు. ఆచరించటం ద్వారా, మన సాంప్రదాయ విలువల్ని తరతరాలు పాటించవచ్చు. మన హిందూ సంప్రాదాయాలు కాపాడుకోవచ్చు. - గొల్లపూడి
© 2017,www.logili.com All Rights Reserved.