ఒరేయ్ నివన్నీ అబద్ధాలురా. నాతో అన్నీ అబద్ధాలు చెప్పావ్ అన్నాడు రామచంద్రం.
నేనా ఎప్పుడు ఏ విషయంలో? - పెళ్ళి విషయంలో. ఆ రోజు ఏం చెప్పావో గుర్తుందా. పెళ్ళి చేసుకుంటే సుఖంగా ఉంటుందన్నావు. భార్యవస్తే సుఖపడతానన్నావు నీవన్నీ పచ్చి అబద్ధాలు. నన్ను దగాచేశావు. జీవితం గురించి ఎన్నో కలలు కన్నానురా. కానీ వాటిని అన్నింటినీ కల్లలుగానే చేసిందిరా ఆ సైతాన్! అన్నాడు సినీ పరిశ్రమలో పేరు మోసిన కెమరామన్ రామచంద్రం.
సినిమా చంద్రునికి ఆవలి వైపున చీకటేగాక ఒంటినిండా మచ్చలే. ఆ వెన్నల వెలుగులో కరిగిన హృదయాల రోదనలు వినేవారెవ్వరు.
రచనలు అందరూ చేస్తారు కాని కొందరి రచనలు మాత్రమే నిద్రపోయే వారిని తట్టి మేల్కొల్పుతాయి.
శ్రీమతి మాలతీ చందూర్ వ్రాసిన ప్రతి కధా, నవల, వ్యాసం, అన్నీ ఇంటింటికీ మామిడి తోరణాలై, మణిదిపాలై ప్రకాశిస్తుంటాయి, ఆమె కలం నుండి వెలువడిన మరో మణిపూస, కలల వెలుగు.
- మాలతీ చందూర్
ఒరేయ్ నివన్నీ అబద్ధాలురా. నాతో అన్నీ అబద్ధాలు చెప్పావ్ అన్నాడు రామచంద్రం. నేనా ఎప్పుడు ఏ విషయంలో? - పెళ్ళి విషయంలో. ఆ రోజు ఏం చెప్పావో గుర్తుందా. పెళ్ళి చేసుకుంటే సుఖంగా ఉంటుందన్నావు. భార్యవస్తే సుఖపడతానన్నావు నీవన్నీ పచ్చి అబద్ధాలు. నన్ను దగాచేశావు. జీవితం గురించి ఎన్నో కలలు కన్నానురా. కానీ వాటిని అన్నింటినీ కల్లలుగానే చేసిందిరా ఆ సైతాన్! అన్నాడు సినీ పరిశ్రమలో పేరు మోసిన కెమరామన్ రామచంద్రం. సినిమా చంద్రునికి ఆవలి వైపున చీకటేగాక ఒంటినిండా మచ్చలే. ఆ వెన్నల వెలుగులో కరిగిన హృదయాల రోదనలు వినేవారెవ్వరు. రచనలు అందరూ చేస్తారు కాని కొందరి రచనలు మాత్రమే నిద్రపోయే వారిని తట్టి మేల్కొల్పుతాయి. శ్రీమతి మాలతీ చందూర్ వ్రాసిన ప్రతి కధా, నవల, వ్యాసం, అన్నీ ఇంటింటికీ మామిడి తోరణాలై, మణిదిపాలై ప్రకాశిస్తుంటాయి, ఆమె కలం నుండి వెలువడిన మరో మణిపూస, కలల వెలుగు. - మాలతీ చందూర్© 2017,www.logili.com All Rights Reserved.