టక్కున ఆగి కళ్ళు చిట్లించుకుని చూశాడు. సహజంగా దైర్యవంతుడైన నట్వర్ సింగ్. కానీ అప్పటికే ఆలస్యమయింది.
అతని చేతులు రైఫిల్ ను బలంగా పట్టుకుని పైకెత్తబోతుండగా అడవి దద్దరిల్లేట్టుగా గాండ్రించిన మేనీటర్ కుడిపక్కనుంచి అతనిపైకి దుమికింది. పాయింట్ బ్లెంక్ గా ట్రిగ్గర్ నొక్కడంతో తూటా ఓ చెట్టును రాసుకుపోయింది తప్ప పులి గమనాన్ని ఆపలేకపోయింది.
నేలపై వెల్లకిలా పడిన నట్వర్ సింగ్ కుడిజబ్బ పంజాదెబ్బతో వేరైపోయింది. తుపాకీ నేలపై పడింది.
"తులసి పారిపో...!" అదే నట్వర్ సింగ్ అన్న చివరిమాట. పెద్దపులి తులసిపై విరుచుకుపడే ప్రయత్నాన్ని నిరోధిస్తూ ఎడమచేతితో శక్తిని కూడగట్టుకుని పులి మెడని పట్టుకున్నాడు. మరుక్షణం అతడి కంఠము పదునైన పులిగోళ్ళ తాకిడికి చీలి రక్తం వాగులా బయటికి చిమ్మింది.
కొన్ని క్షణాల క్రితంవరకూ తనను సందిట బంధించిన అతని చేతులు నిర్జీవంగా నేలపై పడగానే... శవాన్ని నోట కరుచుకుని సమీపంలోని పొదల్లోకీ పులి దూసుకుపోతుంటే దిక్కుతోచనిదాన్లా నిలబడ్డ తులసి నిస్సహాయంగా అరణ్యరోదన చేసింది.
ఆ అర్ధరాత్రివేళ... అడవంతా గగ్గోలు పెడుతున్న పసికందు ఆక్రందనలా వినిపించినా పల్లె ప్రజలు పులి రక్కసి బారినుంచి నట్వర్ సింగ్ తమను రక్షించాడనుకున్నారు గానీ, పులిచేతనే అతడు వేటాడబడ్డాడని ఊహించలేకపోయారు.
చనిపోయిందని ఊపిరిపీల్చుకున్న గ్రామప్రజలకు మేనీటర్ బ్రతికే ఉందనే నిజం ఎలా తెలిసిందో, తర్వాత బలైనవారెవరో తెలియాలంటే చదవండి కొమ్మనాపల్లి గణపతిరావు 'అరణ్యకాండ'.
- కొమ్మనాపల్లి గణపతిరావు
టక్కున ఆగి కళ్ళు చిట్లించుకుని చూశాడు. సహజంగా దైర్యవంతుడైన నట్వర్ సింగ్. కానీ అప్పటికే ఆలస్యమయింది. అతని చేతులు రైఫిల్ ను బలంగా పట్టుకుని పైకెత్తబోతుండగా అడవి దద్దరిల్లేట్టుగా గాండ్రించిన మేనీటర్ కుడిపక్కనుంచి అతనిపైకి దుమికింది. పాయింట్ బ్లెంక్ గా ట్రిగ్గర్ నొక్కడంతో తూటా ఓ చెట్టును రాసుకుపోయింది తప్ప పులి గమనాన్ని ఆపలేకపోయింది. నేలపై వెల్లకిలా పడిన నట్వర్ సింగ్ కుడిజబ్బ పంజాదెబ్బతో వేరైపోయింది. తుపాకీ నేలపై పడింది. "తులసి పారిపో...!" అదే నట్వర్ సింగ్ అన్న చివరిమాట. పెద్దపులి తులసిపై విరుచుకుపడే ప్రయత్నాన్ని నిరోధిస్తూ ఎడమచేతితో శక్తిని కూడగట్టుకుని పులి మెడని పట్టుకున్నాడు. మరుక్షణం అతడి కంఠము పదునైన పులిగోళ్ళ తాకిడికి చీలి రక్తం వాగులా బయటికి చిమ్మింది. కొన్ని క్షణాల క్రితంవరకూ తనను సందిట బంధించిన అతని చేతులు నిర్జీవంగా నేలపై పడగానే... శవాన్ని నోట కరుచుకుని సమీపంలోని పొదల్లోకీ పులి దూసుకుపోతుంటే దిక్కుతోచనిదాన్లా నిలబడ్డ తులసి నిస్సహాయంగా అరణ్యరోదన చేసింది. ఆ అర్ధరాత్రివేళ... అడవంతా గగ్గోలు పెడుతున్న పసికందు ఆక్రందనలా వినిపించినా పల్లె ప్రజలు పులి రక్కసి బారినుంచి నట్వర్ సింగ్ తమను రక్షించాడనుకున్నారు గానీ, పులిచేతనే అతడు వేటాడబడ్డాడని ఊహించలేకపోయారు. చనిపోయిందని ఊపిరిపీల్చుకున్న గ్రామప్రజలకు మేనీటర్ బ్రతికే ఉందనే నిజం ఎలా తెలిసిందో, తర్వాత బలైనవారెవరో తెలియాలంటే చదవండి కొమ్మనాపల్లి గణపతిరావు 'అరణ్యకాండ'. - కొమ్మనాపల్లి గణపతిరావు
© 2017,www.logili.com All Rights Reserved.