అపారమైన సంపద, పేరు ప్రతిష్టలున్న కుటుంబంలో రాజీవ్ గాంధీ పుట్టారు. దేశంలో అత్యంత శక్తిమంతమైన పదవీ ఆయనను ఆయాచితంగానే వరించింది. సంక్షుభితమైన అయిదేళ్లు భారత ప్రధానిగా వ్యవహరించారు తర్వాత 44 ఏళ్ళ పిన్న వయస్సులోనే ఆయన మరణించారు. ఇదంతా చరిత్రగర్భంలో కలిసిపోయింది.
కానీ ఆయన ఎటువంటి మనిషి? అద్భుతమైన కేకులు(నాము రొట్టెలు) తయారుచేసే కేంబ్రిడ్జ్ విద్యార్ధి; మృత్యు నీడల్లో నడుస్తూనే భయాన్ని అసహ్యించుకునే వ్యక్తీ; హాస్య ప్రియుడు; కుటుంబాన్ని ప్రేమించిన మనిషి.
రాజీవ్ గాంధీ చదివిన స్కూలులో, కాలేజిలో మణిశంకర్ అయ్యర్ కూడా చదివారు. ప్రభుత్వాధికారిగా ఆయనతో పనిచేశారు. అనంతరం సివిల్ సర్వీసు నుంచి రాజీనామా చేసి రాజకీయాలలో రాజీవ్ సహచరుడిగా చేరారు. ఆదర్శజీవిగా, పరుగులు తీస్తున్న నాయకుడిగా, అహింసా సిద్ధాంతాన్ని విశ్వసించే వ్యక్తిగా, అన్నీ ఏ రకమైన లోటుపాట్లూ లేకుండా సవ్యంగా, సక్రమంగా ఉండాలన్న పట్టుదల గల మనిషిగా రాజీవ్ ని రకరకాల మానసిక స్థితులలో సన్నిహితంగా గమనించి, అరుదైన కోణాలు ఆవిష్కరించి గ్రహించిన విషయాలు ఆధారంగా రాసిన పుస్తకం ఇది.
మణిశంకర్ అయ్యర్(రచయిత గురించి):
మణిశంకర్ అయ్యర్ (జననం - 1941) బాల్యం దేశ విభజనకు పూర్వం లాహోర్ లోనూ, అనంతరం డిల్లీలోనూ గడిచింది. కేంబ్రిడ్జ్ లోని ట్రినిటీ హాల్ (ఇంగ్లాండ్) లో చదువుకున్నారు. దౌత్యవేత్తగా 26సంవత్సరాలు పనిచేశారు. 1991లో తమిళనాడులోని మయిలాదుతురై నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికైనారు. సునిశితమైన చమత్కారంతో జాగ్రత్తగా అల్లిన ఘాటైన రాజకీయ వ్యాఖ్యానాలను వివిధ వార్తాపత్రికలకూ, మేగజైన్లకూ రాస్తున్నారు.
- మణిశంకర్ అయ్యర్
అపారమైన సంపద, పేరు ప్రతిష్టలున్న కుటుంబంలో రాజీవ్ గాంధీ పుట్టారు. దేశంలో అత్యంత శక్తిమంతమైన పదవీ ఆయనను ఆయాచితంగానే వరించింది. సంక్షుభితమైన అయిదేళ్లు భారత ప్రధానిగా వ్యవహరించారు తర్వాత 44 ఏళ్ళ పిన్న వయస్సులోనే ఆయన మరణించారు. ఇదంతా చరిత్రగర్భంలో కలిసిపోయింది. కానీ ఆయన ఎటువంటి మనిషి? అద్భుతమైన కేకులు(నాము రొట్టెలు) తయారుచేసే కేంబ్రిడ్జ్ విద్యార్ధి; మృత్యు నీడల్లో నడుస్తూనే భయాన్ని అసహ్యించుకునే వ్యక్తీ; హాస్య ప్రియుడు; కుటుంబాన్ని ప్రేమించిన మనిషి. రాజీవ్ గాంధీ చదివిన స్కూలులో, కాలేజిలో మణిశంకర్ అయ్యర్ కూడా చదివారు. ప్రభుత్వాధికారిగా ఆయనతో పనిచేశారు. అనంతరం సివిల్ సర్వీసు నుంచి రాజీనామా చేసి రాజకీయాలలో రాజీవ్ సహచరుడిగా చేరారు. ఆదర్శజీవిగా, పరుగులు తీస్తున్న నాయకుడిగా, అహింసా సిద్ధాంతాన్ని విశ్వసించే వ్యక్తిగా, అన్నీ ఏ రకమైన లోటుపాట్లూ లేకుండా సవ్యంగా, సక్రమంగా ఉండాలన్న పట్టుదల గల మనిషిగా రాజీవ్ ని రకరకాల మానసిక స్థితులలో సన్నిహితంగా గమనించి, అరుదైన కోణాలు ఆవిష్కరించి గ్రహించిన విషయాలు ఆధారంగా రాసిన పుస్తకం ఇది. మణిశంకర్ అయ్యర్(రచయిత గురించి): మణిశంకర్ అయ్యర్ (జననం - 1941) బాల్యం దేశ విభజనకు పూర్వం లాహోర్ లోనూ, అనంతరం డిల్లీలోనూ గడిచింది. కేంబ్రిడ్జ్ లోని ట్రినిటీ హాల్ (ఇంగ్లాండ్) లో చదువుకున్నారు. దౌత్యవేత్తగా 26సంవత్సరాలు పనిచేశారు. 1991లో తమిళనాడులోని మయిలాదుతురై నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికైనారు. సునిశితమైన చమత్కారంతో జాగ్రత్తగా అల్లిన ఘాటైన రాజకీయ వ్యాఖ్యానాలను వివిధ వార్తాపత్రికలకూ, మేగజైన్లకూ రాస్తున్నారు. - మణిశంకర్ అయ్యర్© 2017,www.logili.com All Rights Reserved.