తెలంగాణా జనజీవనం, నిజాంపాలన నాటి తదనంతర రైతాంగ పోరాటం, నాటి సామాజిక, సాంస్కృతిక, ఆర్ధిక అంశాల నేపధ్యంలో దాశరధి రంగాచార్య రూపు కట్టించినట్టు మరే రచయిత చిత్రించలేదన్నది సత్యం. చారిత్రకంగా జరిగిన సామాజిక పరిణామ దశల్లో జన శ్రేణులు ఎలా స్పందించిందీ, తమ సాంస్కృతిక స్వేచ్చ కోసం ఎలా నిరసన తెల్పిందీ, రాజకీయ అస్తిత్వం కోసం ఎలా ఆందోళన, తిరుగుబాటు, ప్రతిఘటనలు చేసింది - చివరకు భూమి కోసం, భుక్తి కోసం, భాష కోసం, వెట్టిచాకిరి అంతం కోసం, నిజాం పాలనను తుదముట్టించటం కోసం ఎలా సంఘటించి పోరాడింది దాశరధి రంగాచార్య రచనలు నేటి తరానికి కాళ్ళ ముందు కదలాడేలా చేస్తాయి.
చిల్లర దేవుళ్ళు, మాయాజలతారు, మోదుగుపూలు, జానపదం వంటి నవలలు - చరిత్ర నిర్మాతలు జనం - అన్న సత్యాన్ని వెల్లడిస్తాయి. జనం భాషలో గుండెలను పలకరిస్తూ, మెదళ్ళ ను పదునుబెడ్తాయి. వీరి రచనలు అనేకం ఇతర భారతీయ భాషల్లోకి వెళ్ళాయి. చలన చిత్రాలుగా కూడా వచ్చాయి.
సాంప్రదాయ పునాదుల మీద ఆకాశమంత ఎత్తుగా ఎదిగిన అభ్యుదయ సారస్వత గోపురం దాశరధి రంగాచార్య సాహిత్యం.
తెలంగాణా జనజీవనం, నిజాంపాలన నాటి తదనంతర రైతాంగ పోరాటం, నాటి సామాజిక, సాంస్కృతిక, ఆర్ధిక అంశాల నేపధ్యంలో దాశరధి రంగాచార్య రూపు కట్టించినట్టు మరే రచయిత చిత్రించలేదన్నది సత్యం. చారిత్రకంగా జరిగిన సామాజిక పరిణామ దశల్లో జన శ్రేణులు ఎలా స్పందించిందీ, తమ సాంస్కృతిక స్వేచ్చ కోసం ఎలా నిరసన తెల్పిందీ, రాజకీయ అస్తిత్వం కోసం ఎలా ఆందోళన, తిరుగుబాటు, ప్రతిఘటనలు చేసింది - చివరకు భూమి కోసం, భుక్తి కోసం, భాష కోసం, వెట్టిచాకిరి అంతం కోసం, నిజాం పాలనను తుదముట్టించటం కోసం ఎలా సంఘటించి పోరాడింది దాశరధి రంగాచార్య రచనలు నేటి తరానికి కాళ్ళ ముందు కదలాడేలా చేస్తాయి. చిల్లర దేవుళ్ళు, మాయాజలతారు, మోదుగుపూలు, జానపదం వంటి నవలలు - చరిత్ర నిర్మాతలు జనం - అన్న సత్యాన్ని వెల్లడిస్తాయి. జనం భాషలో గుండెలను పలకరిస్తూ, మెదళ్ళ ను పదునుబెడ్తాయి. వీరి రచనలు అనేకం ఇతర భారతీయ భాషల్లోకి వెళ్ళాయి. చలన చిత్రాలుగా కూడా వచ్చాయి. సాంప్రదాయ పునాదుల మీద ఆకాశమంత ఎత్తుగా ఎదిగిన అభ్యుదయ సారస్వత గోపురం దాశరధి రంగాచార్య సాహిత్యం.Its a excellent and marvellous book for ever in telugu.
© 2017,www.logili.com All Rights Reserved.