"మోహన్ రుషి కవిత్వం దేన్నీ ప్రతిపాదించదు సిద్దాంతికరించిన రాద్దాంతం చేయదు. అది చదవరుల సేన్సిబిలిటిని స్పృశిస్తుంది, హృదయాన్ని తాకుతుంది. తన నొప్పిని స్వీయ చేతన ద్వారా పాఠకునికి బదిలీ చేస్తాడు కవి."
"మోహన్ రుషి కవిగా దుఃఖితుడు. అందుకే దుఃఖ వివసత్వం అతని కవిత్వం నిండా పరుచుకుని ఉంటుంది. విషాదపు జీర అతని కవిత్వాన్ని పట్టి ఇస్తుంది. కృష్ణ శాస్త్రిలాగానేవిషాదంలో దాక్కున్న కవి ఇతడు. ఆపుకోలేని పాటను ఎదలో మననం చేసుకుంటూ నిరంతరాయంగా 'ప్రవాస యాత్రా రతి' సాగిస్తున్నాడు. పబ్లిక్ డిమాండ్ జోలికి పోకుండా సొంత వెతలను ధైర్యంగా పుక్కిట పడుతున్నాడు. లోలోతుల్లో మెలిపెడుతున్న మేలంకిలిని, చెప్పారాని బాధను లోకానికి జడవకుండా వెల్లడిస్తున్న ధిశాలి ఈ కవి."
-అంబటి సురేంద్రరాజు.
"మోహన్ రుషి కవిత్వం దేన్నీ ప్రతిపాదించదు సిద్దాంతికరించిన రాద్దాంతం చేయదు. అది చదవరుల సేన్సిబిలిటిని స్పృశిస్తుంది, హృదయాన్ని తాకుతుంది. తన నొప్పిని స్వీయ చేతన ద్వారా పాఠకునికి బదిలీ చేస్తాడు కవి." "మోహన్ రుషి కవిగా దుఃఖితుడు. అందుకే దుఃఖ వివసత్వం అతని కవిత్వం నిండా పరుచుకుని ఉంటుంది. విషాదపు జీర అతని కవిత్వాన్ని పట్టి ఇస్తుంది. కృష్ణ శాస్త్రిలాగానేవిషాదంలో దాక్కున్న కవి ఇతడు. ఆపుకోలేని పాటను ఎదలో మననం చేసుకుంటూ నిరంతరాయంగా 'ప్రవాస యాత్రా రతి' సాగిస్తున్నాడు. పబ్లిక్ డిమాండ్ జోలికి పోకుండా సొంత వెతలను ధైర్యంగా పుక్కిట పడుతున్నాడు. లోలోతుల్లో మెలిపెడుతున్న మేలంకిలిని, చెప్పారాని బాధను లోకానికి జడవకుండా వెల్లడిస్తున్న ధిశాలి ఈ కవి." -అంబటి సురేంద్రరాజు.© 2017,www.logili.com All Rights Reserved.