కొందరు శాస్త్రజ్ఞులు, తాత్వికులు గొప్ప విషయాలు చెప్పారు. ప్రపంచంలో ఒకవైపు మతాలు, మూఢ విశ్వాసాలు విజ్రంభించి మనుషులను ఆకట్టుకుని వెనక్కు నడిపిస్తున్నాయి. అటువంటి అంధకార ప్రపంచంలో వెలుగునిస్తున్నది వైజ్ఞానిక దృష్టి శాస్త్రీయ పంధా మాత్రమే. నాటికీ నేటికి ముందు కాలాలకు కూడా మానవులకు అన్ని విధాల ఉపయోగపడే శాస్త్రీయ దృక్పథం, వైజ్ఞానికంగా కనుగొన్నని మాత్రమే.
పరస్పర భావ సంఘర్షణల మధ్య ప్రపంచం సాగిపోతుండగా మతస్థుల తాము సృష్టించిన అబద్ధాల దేవుళ్ళ ఉనికిని సమర్ధించుకోవడానికి మరికొన్ని అబద్ధాలు ఆడారు. అలంటి వాటిని గ్రంధస్థం చేసి పవిత్ర గ్రంధాలనేపేరిట నమ్మకస్తులను కట్టిపడేశారు.
మతం, మూఢనమ్మకం, పవిత్ర గ్రంధాల పేరిట విశ్వాసాలు అన్నీ వంశపారంపర్యం చేశారు. అందుకే మతాలు బతికి బట్టకడుతున్నాయి. మతాల మనుగడకు అనేక ఆకర్శణియ వ్యాపార లక్షణాలను ప్రవేశపెట్టి విశ్వాసపరులను కట్టిపడేస్తున్నారు. క్రమేణ మతాలు రాజ్యాలలోకి, పాలకులు మతాలలోకి ప్రవేశించి ప్రభుత్వాలకు, మతాలకు తేడాలేకుండా చేస్తున్నారు.
చాలా మంది మానవవాదులు, హేతువాదులు, నాస్తికులు స్పష్టత లేని కారణంగా తడబడుతున్నారు. ఈ విషయాలు ఒక క్రమబద్ధంగా విడమరచి విశ్లేషించి చెప్పే రీతులు అవసరం. లోగడ ఎం.ఎన్.రాయ్, కార్ల్ సేగన్, జూలియన్ హక్సలి వంటి వారు అలంటి కృషి చేశారు. మనకు లభిస్తున్న సాహిత్యాన్ని, శాస్త్రీయ ఆధారాలను దృష్టిలో పెట్టుకుని, అన్ని మతాలు చేసే స్పష్టమైన అసత్య ప్రచారాన్ని ఎదుర్కోవడానికి ఒక ప్రణాళిక కావాలి. అలాంటిది రిచర్డ్ డాకిన్స్ 'ది గాడ్ డెల్యూషన్' పుస్తకంలో సమకూర్చారు.
- నరిశెట్టి ఇన్నయ్య
కొందరు శాస్త్రజ్ఞులు, తాత్వికులు గొప్ప విషయాలు చెప్పారు. ప్రపంచంలో ఒకవైపు మతాలు, మూఢ విశ్వాసాలు విజ్రంభించి మనుషులను ఆకట్టుకుని వెనక్కు నడిపిస్తున్నాయి. అటువంటి అంధకార ప్రపంచంలో వెలుగునిస్తున్నది వైజ్ఞానిక దృష్టి శాస్త్రీయ పంధా మాత్రమే. నాటికీ నేటికి ముందు కాలాలకు కూడా మానవులకు అన్ని విధాల ఉపయోగపడే శాస్త్రీయ దృక్పథం, వైజ్ఞానికంగా కనుగొన్నని మాత్రమే. పరస్పర భావ సంఘర్షణల మధ్య ప్రపంచం సాగిపోతుండగా మతస్థుల తాము సృష్టించిన అబద్ధాల దేవుళ్ళ ఉనికిని సమర్ధించుకోవడానికి మరికొన్ని అబద్ధాలు ఆడారు. అలంటి వాటిని గ్రంధస్థం చేసి పవిత్ర గ్రంధాలనేపేరిట నమ్మకస్తులను కట్టిపడేశారు. మతం, మూఢనమ్మకం, పవిత్ర గ్రంధాల పేరిట విశ్వాసాలు అన్నీ వంశపారంపర్యం చేశారు. అందుకే మతాలు బతికి బట్టకడుతున్నాయి. మతాల మనుగడకు అనేక ఆకర్శణియ వ్యాపార లక్షణాలను ప్రవేశపెట్టి విశ్వాసపరులను కట్టిపడేస్తున్నారు. క్రమేణ మతాలు రాజ్యాలలోకి, పాలకులు మతాలలోకి ప్రవేశించి ప్రభుత్వాలకు, మతాలకు తేడాలేకుండా చేస్తున్నారు. చాలా మంది మానవవాదులు, హేతువాదులు, నాస్తికులు స్పష్టత లేని కారణంగా తడబడుతున్నారు. ఈ విషయాలు ఒక క్రమబద్ధంగా విడమరచి విశ్లేషించి చెప్పే రీతులు అవసరం. లోగడ ఎం.ఎన్.రాయ్, కార్ల్ సేగన్, జూలియన్ హక్సలి వంటి వారు అలంటి కృషి చేశారు. మనకు లభిస్తున్న సాహిత్యాన్ని, శాస్త్రీయ ఆధారాలను దృష్టిలో పెట్టుకుని, అన్ని మతాలు చేసే స్పష్టమైన అసత్య ప్రచారాన్ని ఎదుర్కోవడానికి ఒక ప్రణాళిక కావాలి. అలాంటిది రిచర్డ్ డాకిన్స్ 'ది గాడ్ డెల్యూషన్' పుస్తకంలో సమకూర్చారు. - నరిశెట్టి ఇన్నయ్య© 2017,www.logili.com All Rights Reserved.