మనిషి దైవస్వరూపాలను భక్తితో ఆరాధిస్తాడు. కొన్ని దైవస్వరూపాలను మాత్రం భయభక్తులతో ఆరాధిస్తాడు. ఆ కొన్ని దైవస్వరూపాలే నవగ్రహాలు! తన జాతక చక్రంలో కొలువుదీరి, జీవిత చక్రాన్ని నడిపే నవగ్రహ దేవతలను భయంతో, భక్తితో సేవించడం మనిషి నైజంగా మారింది. తల్లి గర్భంలో పడినప్పటి నుండి కాలగర్భంలో కలిసిపోయేదాకా మానవ జీవనయానం పూర్తిగా నవగ్రహాల ప్రభావం మీద ఆధారపడి వుంటుంది. మనిషి ఆలోచనలకూ, అభివ్యక్తీకరణకూ, ఆచరణకూ మూలం గ్రహవీక్షణే అంటున్నాయి శాస్త్రాలు.
నవగ్రహాల గురించి సంపూర్ణంగా తెలుసుకొని ఆరాధించడం మంచిది. ఆ గ్రహాల అవతార రహస్యాలు అద్భుతాలు. చరిత్రలు పరమాద్భుతాలు. మహిమలు మహాద్భుతాలు. ఇన్ని అద్భుతాల సమాహారమే మీ చేతిలో వున్న నవగ్రహపురాణం.
-వక్కంతం సూర్యనారాయణరావు
మనిషి దైవస్వరూపాలను భక్తితో ఆరాధిస్తాడు. కొన్ని దైవస్వరూపాలను మాత్రం భయభక్తులతో ఆరాధిస్తాడు. ఆ కొన్ని దైవస్వరూపాలే నవగ్రహాలు! తన జాతక చక్రంలో కొలువుదీరి, జీవిత చక్రాన్ని నడిపే నవగ్రహ దేవతలను భయంతో, భక్తితో సేవించడం మనిషి నైజంగా మారింది. తల్లి గర్భంలో పడినప్పటి నుండి కాలగర్భంలో కలిసిపోయేదాకా మానవ జీవనయానం పూర్తిగా నవగ్రహాల ప్రభావం మీద ఆధారపడి వుంటుంది. మనిషి ఆలోచనలకూ, అభివ్యక్తీకరణకూ, ఆచరణకూ మూలం గ్రహవీక్షణే అంటున్నాయి శాస్త్రాలు. నవగ్రహాల గురించి సంపూర్ణంగా తెలుసుకొని ఆరాధించడం మంచిది. ఆ గ్రహాల అవతార రహస్యాలు అద్భుతాలు. చరిత్రలు పరమాద్భుతాలు. మహిమలు మహాద్భుతాలు. ఇన్ని అద్భుతాల సమాహారమే మీ చేతిలో వున్న నవగ్రహపురాణం. -వక్కంతం సూర్యనారాయణరావుgood
© 2017,www.logili.com All Rights Reserved.