ఈ చట్టాన్ని తెలుగులోనికి అనువదించిన శ్రీ పొన్నాడ హనుమంతరావుగారు తూర్పు.గోదావరి.జిల్లా రాజోలులో గత 50 సంవత్సరాలుగా న్యాయవాదిగా చురుకుగా వృత్తి చేస్తూ కూడా ఉపాధ్యాయ వృత్తిలోను, రాజకీయాలలోనూ కూడా అనుభవం కలవారు. 40 సంవత్సరముల పాటు రాజోలు ప్రభుత్వ కళాశాలలో మరియు మల్కిపురం డిగ్రీ కళాశాలలో బి.కాం. డిగ్రీవారికీ వ్యాపార న్యాయశాస్త్రం బోధించారు. వ్యాపార న్యాయశాస్త్రంలో యల్.యల్.యం. డిగ్రీ కూడా పొందారు. రాజోలు గ్రామ పంచాయితీ సర్పంచిగా ఎన్నుకోబడ్డారు. మరియు రాజోలు శాసనసభ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటి చేశారు. 1989, 1994, 1999 మరియు 2004 సంవత్సరాలలో శాసనసభలకు జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధులకు ఎన్నికల ప్రతినిధిగా పనిచేశారు. 1989 ఎన్నికలకు సంబంధించి గెలిచిన అభ్యర్ధి తరపున ఎన్నికల ప్రతినిధిగా ఉన్నత న్యాయస్థానంలో జరిగిన అర్జిలో సాక్షిగా కూడా వ్యవహరించారు. ఈ విధంగా ఆయనకు న్యాయశాస్త్రంలోను మరియు ఎన్నికలలోనూ గల ప్రత్యక్ష అనుభవం ఈ చట్టం తెలుగులో వ్రాయడానికి సహకరించిందని భావిస్తున్నాము.
తెలుగులో వ్యాపార న్యాయశాస్త్రాన్ని బోధించిన అనుభవంతో వ్యాపార న్యాయశాస్త్రాన్ని తెలుగులో వ్రాశారు. అంతేగాక సామాన్య ప్రజలకు న్యాయశాస్త్రంపై అవగాహన కలుగడానికి వీలుగా షుమారు 60 చట్టాలను తెలుగులో వ్రాయగా ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమి వారు "న్యాయ విజ్ఞాన దర్శిని" అను పేరుతో ఈమధ్యనే ప్రచురించారు. ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమి మరియు ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషాసమితి వారు సమిష్టిగా "తెలుగులో న్యాయ పరిపాలన" పేరున నిర్వహించిన సెమినార్ లో పాల్గొన్నారు.
ఈ చట్టాన్ని తెలుగులోనికి అనువదించిన శ్రీ పొన్నాడ హనుమంతరావుగారు తూర్పు.గోదావరి.జిల్లా రాజోలులో గత 50 సంవత్సరాలుగా న్యాయవాదిగా చురుకుగా వృత్తి చేస్తూ కూడా ఉపాధ్యాయ వృత్తిలోను, రాజకీయాలలోనూ కూడా అనుభవం కలవారు. 40 సంవత్సరముల పాటు రాజోలు ప్రభుత్వ కళాశాలలో మరియు మల్కిపురం డిగ్రీ కళాశాలలో బి.కాం. డిగ్రీవారికీ వ్యాపార న్యాయశాస్త్రం బోధించారు. వ్యాపార న్యాయశాస్త్రంలో యల్.యల్.యం. డిగ్రీ కూడా పొందారు. రాజోలు గ్రామ పంచాయితీ సర్పంచిగా ఎన్నుకోబడ్డారు. మరియు రాజోలు శాసనసభ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటి చేశారు. 1989, 1994, 1999 మరియు 2004 సంవత్సరాలలో శాసనసభలకు జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధులకు ఎన్నికల ప్రతినిధిగా పనిచేశారు. 1989 ఎన్నికలకు సంబంధించి గెలిచిన అభ్యర్ధి తరపున ఎన్నికల ప్రతినిధిగా ఉన్నత న్యాయస్థానంలో జరిగిన అర్జిలో సాక్షిగా కూడా వ్యవహరించారు. ఈ విధంగా ఆయనకు న్యాయశాస్త్రంలోను మరియు ఎన్నికలలోనూ గల ప్రత్యక్ష అనుభవం ఈ చట్టం తెలుగులో వ్రాయడానికి సహకరించిందని భావిస్తున్నాము. తెలుగులో వ్యాపార న్యాయశాస్త్రాన్ని బోధించిన అనుభవంతో వ్యాపార న్యాయశాస్త్రాన్ని తెలుగులో వ్రాశారు. అంతేగాక సామాన్య ప్రజలకు న్యాయశాస్త్రంపై అవగాహన కలుగడానికి వీలుగా షుమారు 60 చట్టాలను తెలుగులో వ్రాయగా ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమి వారు "న్యాయ విజ్ఞాన దర్శిని" అను పేరుతో ఈమధ్యనే ప్రచురించారు. ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమి మరియు ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషాసమితి వారు సమిష్టిగా "తెలుగులో న్యాయ పరిపాలన" పేరున నిర్వహించిన సెమినార్ లో పాల్గొన్నారు.© 2017,www.logili.com All Rights Reserved.