ఈ నవలలో కధంటూ ప్రత్యేకంగా ఏమీలేదు. ఈ నవలలో సీతారామారావు కధానాయకుడు. ఇతని పూర్వీకులు, తాతముత్తాతలు నుంచీ తండ్రి వరకు బతికిన విలాసవంత జీవితం, కాపాడుకుంటూ వస్తున్న పరువు ప్రతిష్ట, వంశ గౌరవం, గొప్పతనం, వాటి కోసం చేసిన దానధర్మాలు, కట్టించిన గుడులు, సత్రాలు, చెలాయించిన సామజిక ఆధిపత్యం వంటి అనేక విషయాలు అతనిలో అహం(Ego)ను కలిగిస్తాయి. ఆ మూలంగా వంశపారపర్యంగా వస్తున్న అధ్యహం(Super Ego)అతనికీ వచ్చి, నేను అందరిలాంటి వాణ్ణి కాదన్న భ్రమలోకీ నెడుతాయి. కానీ ఆస్తిపస్తులు పోగొట్టుకున్న తర్వాత ఆ Egoలు దెబ్బతింటాయి. అయినా భౌతిక, సామజిక పరిస్థితులలో అతనిలోని సహజాత లక్షణం (Id)ను Ego కొంతవరకు అతని మానసిక స్థితి (Psychological Situation)ని నియంత్రించడానికి దోహదపడి అతనిలోని అహం - వ్యాకులత (Ego - Anxiety)ఎక్కువై ఆత్మన్యూనతా భావం (Inferiority Complex)లో పడిపోతాడు. అదే Depressionకీ దారితీసి అతనిలో పాక్షిక మనోవిక్షిప్తి (Semi Insanity)ని కలుగు జేస్తుంది. ఆ మనో విక్షిప్తిలో భ్రాంతుల (Delusions)కీ విభ్రాంతుల (Hallucinations)కీ బలై ఒక విధమైన Personality Disorderలోకి పడిపోతాడు. ఇలా మొదలయిన అతనిలోని అపసామాన్య ప్రవర్తన కారణంగా, నిజమేదో, భ్రమేదో కూడా తెలుసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయి, చివరికి స్మశానంలో అతనితో అతనే పోరాడి ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ Process అంతా Sub Conscious స్థితిలో ఒక కలలా ఎన్నో భ్రమాత్మక ప్రతీక (Delusional Symbols)లతో మరెన్నో తాత్విక (Phylosaphical)విషయాలతో Surrealisticwayలో ఊపిరి సలపనంత ఉద్వేగభరితమైన శైలిలో నవల నడిచి పోతుంది.
ఈ నవలలో కధంటూ ప్రత్యేకంగా ఏమీలేదు. ఈ నవలలో సీతారామారావు కధానాయకుడు. ఇతని పూర్వీకులు, తాతముత్తాతలు నుంచీ తండ్రి వరకు బతికిన విలాసవంత జీవితం, కాపాడుకుంటూ వస్తున్న పరువు ప్రతిష్ట, వంశ గౌరవం, గొప్పతనం, వాటి కోసం చేసిన దానధర్మాలు, కట్టించిన గుడులు, సత్రాలు, చెలాయించిన సామజిక ఆధిపత్యం వంటి అనేక విషయాలు అతనిలో అహం(Ego)ను కలిగిస్తాయి. ఆ మూలంగా వంశపారపర్యంగా వస్తున్న అధ్యహం(Super Ego)అతనికీ వచ్చి, నేను అందరిలాంటి వాణ్ణి కాదన్న భ్రమలోకీ నెడుతాయి. కానీ ఆస్తిపస్తులు పోగొట్టుకున్న తర్వాత ఆ Egoలు దెబ్బతింటాయి. అయినా భౌతిక, సామజిక పరిస్థితులలో అతనిలోని సహజాత లక్షణం (Id)ను Ego కొంతవరకు అతని మానసిక స్థితి (Psychological Situation)ని నియంత్రించడానికి దోహదపడి అతనిలోని అహం - వ్యాకులత (Ego - Anxiety)ఎక్కువై ఆత్మన్యూనతా భావం (Inferiority Complex)లో పడిపోతాడు. అదే Depressionకీ దారితీసి అతనిలో పాక్షిక మనోవిక్షిప్తి (Semi Insanity)ని కలుగు జేస్తుంది. ఆ మనో విక్షిప్తిలో భ్రాంతుల (Delusions)కీ విభ్రాంతుల (Hallucinations)కీ బలై ఒక విధమైన Personality Disorderలోకి పడిపోతాడు. ఇలా మొదలయిన అతనిలోని అపసామాన్య ప్రవర్తన కారణంగా, నిజమేదో, భ్రమేదో కూడా తెలుసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయి, చివరికి స్మశానంలో అతనితో అతనే పోరాడి ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ Process అంతా Sub Conscious స్థితిలో ఒక కలలా ఎన్నో భ్రమాత్మక ప్రతీక (Delusional Symbols)లతో మరెన్నో తాత్విక (Phylosaphical)విషయాలతో Surrealisticwayలో ఊపిరి సలపనంత ఉద్వేగభరితమైన శైలిలో నవల నడిచి పోతుంది.© 2017,www.logili.com All Rights Reserved.