చిన్న దీవి. చెట్టు దిగితే మింగే క్రూరమృగాలు. ఎటు చూసినా అంతులేని సముద్రం. నరమానవుడు తోడులేని జీవితం. తల్చుకుంటేనే గుండెలు గుబేలుమంటాయి. ఆ నిర్జన దీవిలో రాబిన్సన్ క్రుసో బతికి బట్టకట్టాడు. అంతటి ప్రతికూల పరిస్థితులల్లో సైతం అతను నిరాశకు గురికాలేదు. ఆదైర్య పడి ఆశ విడిచిపెట్టలేదు. తన ప్రయత్నం మానలేదు. తన వివేకంతో లోకజ్ఞానంతో సమయస్పూర్తితో సాహసంతో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు.
జ్ఞానాన్ని వాస్తవ పరిస్థితులకు అన్వయించడం అంటే ఏమిటో ఈ కధ తెలియజేస్తుంది. ప్రతికూల పరిస్థితులను ఎంత నిబ్బరంగా అధిగమించాలో ఈ కధ నేర్పుతుంది. ఈ నవలలో అడుగడుగునా కనిపించే అంశాలు అన్వేషణా స్పూర్తి, సాహసం. తెగువ, ఆత్మవిశ్వాసం, భవిష్యత్తు పై చెరగని ఆశ. ఇవే క్రూసో ప్రధాన లక్షణాలు. ఈ లక్షణాలు, నైపుణ్యాలు అన్ని ఏ తరం బలబాలికలైనా సంతరించుకోతగినవే. ఈ నవల పిల్లల మనస్సులను అన్వేషణా స్పూర్తితో ప్రజ్వలింపచేస్తుంది. వాళ్ళలో చైతన్యాన్ని, ఉత్తేజాన్ని నింపుతుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను స్వీకరించడానికి అవసరమైన ఆశావాద దృక్పధాన్నీ వివేకాన్ని ప్రసాదిస్తుంది.
ఒక్క మాట, రాబిన్ సన్ క్రూసో నుంచి నేర్చుకో కూడని అంశాలు ఉన్నాయి. చదవండి మీకే తెలుస్తుంది.
చిన్న దీవి. చెట్టు దిగితే మింగే క్రూరమృగాలు. ఎటు చూసినా అంతులేని సముద్రం. నరమానవుడు తోడులేని జీవితం. తల్చుకుంటేనే గుండెలు గుబేలుమంటాయి. ఆ నిర్జన దీవిలో రాబిన్సన్ క్రుసో బతికి బట్టకట్టాడు. అంతటి ప్రతికూల పరిస్థితులల్లో సైతం అతను నిరాశకు గురికాలేదు. ఆదైర్య పడి ఆశ విడిచిపెట్టలేదు. తన ప్రయత్నం మానలేదు. తన వివేకంతో లోకజ్ఞానంతో సమయస్పూర్తితో సాహసంతో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు. జ్ఞానాన్ని వాస్తవ పరిస్థితులకు అన్వయించడం అంటే ఏమిటో ఈ కధ తెలియజేస్తుంది. ప్రతికూల పరిస్థితులను ఎంత నిబ్బరంగా అధిగమించాలో ఈ కధ నేర్పుతుంది. ఈ నవలలో అడుగడుగునా కనిపించే అంశాలు అన్వేషణా స్పూర్తి, సాహసం. తెగువ, ఆత్మవిశ్వాసం, భవిష్యత్తు పై చెరగని ఆశ. ఇవే క్రూసో ప్రధాన లక్షణాలు. ఈ లక్షణాలు, నైపుణ్యాలు అన్ని ఏ తరం బలబాలికలైనా సంతరించుకోతగినవే. ఈ నవల పిల్లల మనస్సులను అన్వేషణా స్పూర్తితో ప్రజ్వలింపచేస్తుంది. వాళ్ళలో చైతన్యాన్ని, ఉత్తేజాన్ని నింపుతుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను స్వీకరించడానికి అవసరమైన ఆశావాద దృక్పధాన్నీ వివేకాన్ని ప్రసాదిస్తుంది. ఒక్క మాట, రాబిన్ సన్ క్రూసో నుంచి నేర్చుకో కూడని అంశాలు ఉన్నాయి. చదవండి మీకే తెలుస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.